"తేనె" కూర్పుల మధ్య తేడాలు

2,277 bytes added ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ద ఔషధం "తేనె"(హనీ). తేనెలో ఉన్న ఔషధ గుణాలు అన్నీఇన్నీ కావు. మరి అలాంటి ఔషధం నేడు విషంగా మారిందా..?! అవుననే అంటున్నాయి తాజా పరిశోధనలు. "అన్ని రోజులు ఒకలా ఉండవు" అన్న సామెత మాదిరిగా "అన్ని కంపెనీల తేనెలు ఒకలా ఉండవు" అని చెబుతున్నారు పరిశోధకులు. ప్రముఖ దేశీయ, విదేశీయ బ్రాండ్లు "ప్యూర్ హనీ" అంటూ విక్రయిస్తున్న తేనెలో అధికశాతంలో యాంటీబయొటిక్స్ ఉంటున్నాయని, వీటి వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) హెచ్చరిస్తోంది. కొన్ని భారతదేశపు బ్రాండ్‌లలో ఉండాల్సిన దానికన్నా అధికంగా రెండు నుంచి నాలుగు వరకూ యాంటీబయొటిక్స్ ఉన్నాయని సీఎస్ఈ కాలుష్య పర్యవేక్షణ ల్యాబొరేటరీ కనుగొంది. ఇవే కాకుండా ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన విదేశీ బ్రాండ్లు కూడా తేనెలో మోతాదుకు మించి యాంటీబయోటిక్స్ వాడుతున్నారని సీఎస్ఈ తెలిపింది. ఇప్పటి వరకూ 12 కంపెనీలకు చెందిన తేనెలను పరిశీలించిన సీఎస్ఈ వాటిల్లో ఆరు రకాల యాంటీబయోటిక్స్ వాడినట్లు గుర్తించింది. "అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. భారతీయ కంపెనీలు విదేశాలకు ఎగుమతి చేసే తేనెలో మాత్రమే యాంటీబయోటిక్స్‌ను వీలైనంత వరకూ నియంత్రిస్తున్నాయి. కానీ మన దేశంలో ఉపయోగించే వాటిలో మాత్రం ఎటువంటి నియంత్రణ లేదు. ఇందుకు నిర్లక్ష్యం ఒక్కటే కారణం." యూరప్, అమెరికా వంటి దేశాల్లో తేనె ఉత్పత్తులకు కఠినమైన, నిర్ధిష్టమైన నిబంధనలు ఉంటాయి. కానీ మన దేశంలో ఇవేమి ఉండవు. అందుకే చాలా వరకూ విదేశాల్లో భారతీయ తేనె ఉత్పత్తులను నిషేధిస్తున్నారని సీఎస్ఈ డిప్యూటీ డైరెక్టర్ చంద్రభూషణ్ అన్నారు. ఇందుకు పెద్ద ఉదాహరణే.. భారత ఎగుమతుల తనిఖీ కౌన్సిల్(ఈఐసీ) విదేశీ మార్కెట్‌లో విడుదల చేసే తేనె ఉత్పత్తులలో నిర్ణీత యాంటీబయోటిక్స్ మాత్రమే వాడాలని షరతులు పెట్టింది. కానీ దేశీయ మార్కెట్‌లో విక్రయించే తేనె ఉత్పత్తులకు మాత్రం ఎలాంటి నిబంధనలు లేవు.
 
==తేనె వాడకూడని సందర్భాలు==
 
* మధుమేహ వ్యాధిగ్రస్తులు యథేచ్ఛగా తేనెను వాడకూడదు. ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తేనెను వాడాలి.
* తేనెను వేడి పదార్థాలతో కలిపి వాడకూడదు. అలాగే పిప్పళ్లు, మిరియాలు వంటి వాటితో కలిపి నేరుగా వాడకూడదు. తేనెను మరిగించకూడదు. తేనె ఉష్ణ వీర్య పదార్థం కాబట్టి తేనెను నేరుగా మంటపైన వేడిచేయకూడదు. తేనెను వేడి వాతావరణంలోనూ, ఎండాకాలంలో పరిమితంగానే వాడాలి. (తేనెలో రకరకాల పువ్వుల మకరందాల అంశ ఉంటుంది. వీటిల్లో విష పుష్పాలు సైతం ఉంటాయి. .)
* మసాలా పదార్థాలతోనూ, మద్యంతోనూ, ఆవనూనె వంటి పదార్థాలతోనూ కలపకూడదు.
* తేనెను వర్షం నీళ్లతో కలిపి వాడకూడదు.
* తేనెను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఫ్రిజ్‌లో ఉంచితే పంచదార స్పటికాలు తయారవుతాయి. అలాంటి సందర్భాల్లో ఎండలో ఉంచితే సరిపోతుంది. లేదా తేనె సీసాను వేడి నీళ్లలో పెట్టి పరోక్షంగా వేడిచేస్తే తేనె స్పటికాలు కరిగి తిరిగి తేనె తయారవుతుంది.
* తేనెను, నెయ్యిని సమాన భాగాలుగా తీసుకోకూడదు (సంయోగ విరుద్ధం).
 
 
== మకరందం నుండి తేనె ==
2,16,613

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/905741" నుండి వెలికితీశారు