పామాయిల్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
* ఆంధ్ర రాష్టంలో [[ఆయిల్‌ పాం]] (పామాయిల్) తోటల సాగు విస్తీర్ణం పెంచాలన్న ఉద్దేశాన్ని, ప్రైవేటు కంపెనీల నిర్వాకం, ఉద్యాన శాఖ నిర్లక్ష్యం తీవ్రంగా దెబ్బతీశాయి. గత ఆర్ధిక సంవత్సరం (2010-11) సాగు లక్ష్యంలో కనీసం సగమైనా నెరవేరకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాఛారం. గత ఏడాది అదనంగా 37,065 ఎకరాల/హెక్టార్ల మేర సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించింది. చివరికి 18,167 ఎకరాల్లో/హెక్టార్లలో మాత్రమే, రైతులు కొత్తగా సాగుచేశారు. ఈ పంట సాగు చేసే రైతులకు కేంద్రమే పూర్తిగా నిధులు ఇస్తోంది. ఆయిల్‌పాం తోటల సాగు బాగా పెరిగితే వంట నూనెల దిగుమతి వ్యయం, తగ్గుతుందన్న యోచనతో, కేంద్రం ఈ సాగును ప్రోత్సహిస్తోంది. ఇంత ప్రోత్సాహమున్నా కనీసం 50 శాతం లక్ష్యాన్నయినా సాధించక పోవడం ఉద్యాన శాఖ వైఫల్యమేనన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
* దేశంలోకెల్లా , ఆంధ్రప్రదేశ్ లోనే ఆయిల్‌పాం తోటల సాగు అత్యధికంగా ఉంది (రాజమండ్రి నుంచి ఏలూరు రైలులో వెళుతున్నప్పుడు, ఈ తోటలు మనకు కనువిందు చేస్తాయి). ఇప్పటికే 2.50 లక్షల ఎకరాల్లో/ హెక్టార్లలో పంట సాగులో ఉంది. గత ఏడాది, తొలుత 86 వేల ఎకరాల అదనపు సాగు లక్ష్యాన్ని నిర్దేశింఛినా, తరువాత దానిని 37 వేల ఎకరాలకు /హెక్టార్లకు తగ్గించారు. చివరికి 18,167 ఎకరాలను /హెక్టార్లను దాటలేక పోయారు. గత ఏడాది సాగు పెరగకపోవడానికి ప్రైవేటు కంపెనీల నిర్వాకమే కారణమని ఉద్యాన శాఖ చెబుతోంది. నాలుగు కంపెనీలు తొలుత 6 జిల్లాల్లో కొత్తగా ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిస్తామని రెండేళ్ళ క్రితం ముందుకొచ్ఛాయి. చెరకు పంట తరహాలో ఆయిల్‌ పాంను సైతం ఒక్కో మండలాన్ని ఒక్కో కంపెనీకి ప్రభుత్వం కేటాయిస్తోంది. అక్కడి రైతులతో పంట సాగును ప్రోత్సహించి దాని కొనుగోలుకు సదరు కంపెనీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలి. కానీ, ఇప్పటి వరకూ తమకు కేటాయించిన ప్రాంతాలకు సంబంధించి ఆ 4 కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ప్రభుత్వం ఈ కంపెనీల కోసం ఏడాది పాటు ఎదురుచూసి వారం క్రితం ఉత్తర్వులను సవరించింది. రెండు కంపెనీల ఒప్పందాలను రద్ధు చేసింది. అటు కంపెనీల నిర్వాకం, ఇటు ఉద్యాన శాఖ నిర్లక్ష్యం కారణంగా మధ్యలో రైతులు పంట వేయలేక నష్ట పోయారు. వారికి ప్రోత్సాహకాలు అందించేవారు లేక పంటను వేయలేక పోయారని అధికార వర్గాలే అంగీకరిస్తున్నాయి . వాస్తవానికి ఈ కంపెనీల సామర్ధ్యంపై ముందుగా సరైన పరిశీలన చేయకుండానే వాటికి ఆయా జిల్లాల్లో మండలాలను కేటాయించారన్న ఆరోపణలున్నాయి. ఆయిల్‌పాం సాగు, పామాయిల్ ఉత్పత్తిపై సరైన పరిజ్ఞానం, అవగాహన లేనివాటికి పంట సాగును ప్రోత్సహించాలని నిర్దేశించి ఉద్యాన శాఖ మిన్నకుండిపోవడం కూడా లక్ష్యం చేరకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గత ఏడాది లక్ష్యమే నెరవేరకపోగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2011-12) రాష్ట్రంలో లక్ష హెక్టార్లలో /ఎకరాల్లో అదనంగా సాగు ఛేయాలని కేంద్రం రాష్ట్రానికి లక్ష్యం నిర్దేశించింది.
 
==వైద్య పరంగా ఉపయోగాలు==
మీడియం చైన్‌ ట్రైగ్లిజరైడ్స్ దీనిలో ఉంటాయి కావున జీర్ణము చేసుకోవడం చాలా తేకిక . తల్లి పాలతో సమానము .
శాఖాహారము అయినందున కొలెస్టిరాల్ ఉండదు .
oleic acid(omega-9)39%, linolic acid(omega-6) 10% ఉంటాయి కావున ఆరోగ్యానికి మంచిది . ఈ ఎసెన్‌సియల్ ఫ్యాటీ యాసిడ్స్ రక్తం లోని కొలెస్టిరాల్ ను తగ్గిస్తాయి.
దీనిలో యాంటి ఆక్షిడెంట్స్ (Tocotrienols) ఉన్నందున వ్యాధుల బారిన పడకుండా కాపాడును .
పామ్‌ ఆయిల్ లో బీటాకెరోటీన్స్ పుష్క్లము గా లభించును .
 
==Fatty acid content of palm oil==
 
Type of fatty acid pct
Palmitic saturated C16------ 44.3%
Stearic saturated C18--------- 4.6%
Myristic saturated C14-------- 1.0%
Oleic monounsaturated C18- 38.7%
Linoleic polyunsaturated C18 10.5%
Other/Unknown------------- 0.9%
 
 
Line 56 ⟶ 73:
*http://nrcop.ap.nic.in (Redirected to http://dopr.gov.in)
*[[ఆధారం]]: ఈనాడు పత్రిక , బిజినెస్ లైన్ పత్రిక
 
==మూలాలు==
*https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AA%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D&action=edit
 
[[వర్గం:పామే]]
"https://te.wikipedia.org/wiki/పామాయిల్" నుండి వెలికితీశారు