శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శ్రీ సూర్యారాయాంధ్ర నిఘంటువు''' [[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం]] తరపున ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాదు వారి విశిష్ట ప్రచురణ. ఇది ఎనిమిది సంపుటములు కల్గిన ఒక పెద్ద [[నిఘంటువు]].
తెలుగు భాషలో ఇప్పటికీ ఇదే నిండైన నిఘంటువు ఇదే. ఇందులో దాదాపు ఒక లక్షా పదివేల మాటలున్నాయి.
 
దీని మొదటి నాలుగు సంపుటాలు స్వర్గీయ [[రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు]] బహద్దరుగారి అండదండలతో, సంపూర్ణ ఆర్థిక సహకారముతో, స్వర్గీయ [[జయంతి రామయ్య పంతులు]] గారి పర్యవేక్షణలో సిద్ధమై 1939 సంవత్సరములో కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తు పక్షాఅన ప్రకటితమైనది. తర్వాత 5, 6, 7 సంపుటాలు 1957 సంవత్సరములో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయముతో ముద్రితమైనవి. ఏడవ సంపుటము అనుబంధము మాత్రము 1965 సంవత్సరములొ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, ఆర్థిక సహాయము గావించి దీని ముద్రణకు తోడ్పడినది. ఇది 1974 సంవత్సరము హైదరాబాదు నగరములో, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వేదికపై ఆవిష్కృతమైనది.