సర్పి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
MeshID = D006561 }}
'''సర్పి''' (Herpes) అనేది హెర్పెస్ సింప్లెక్స్ (Herpes Simplex) అనే సూక్ష్మజీవుల వల్ల వ్యాపిస్తుంది. ఇందులో రెండు రకాలు: హెచ్.యస్.వి టైప్ 1 (HSV Type1) మరియు హెచ్.యస్.వి టైప్ 2 (HSV Type 2). సర్పి సాధారణంగా జననేంద్రియాల వద్ద, నోటి వద్ద, నుదురు పైన, కళ్ళకు, తలకు సోకుతుంది. హెచ్.యస్.వి టైప్ 2 వల్ల జననేంద్రియాలవద్ద సోకే సర్పి స్త్రీ పురుషులలో నొప్పితో కూడిన కురుపులతో ఏర్పడుతుంది. హెచ్.యస్.వి టైప్ 1 వల్ల సోకే సర్పి నుదురు పైన, కళ్ళకు, తలకు సోకుతుంది. జననేంద్రియాల ద్వారా అప్పుడే పుట్టిన పిల్లల కంటికి సోకవచ్చును. [[మెదడు]]కు సోకిన సర్పి అన్నింటికన్నా ప్రమాదమైనది.
జ్వరం, కీళ్ల నొప్పులు, ఒళ్లంతా నొప్పులు, జననావయవాల్లో మంట, దురద... ఎన్ని మందులు వేసుకున్నా ఫలితం శూన్యం. తగ్గినట్టే తగ్గి మళ్లీ తిరగబెడుతుండటంతో మానసిక ఆందోళన. హెర్పిస్ బారినపడిన వారిలో కనిపించే పరిస్థితి ఇది
'''జననాంగ సర్పి''' (Genital Herpes) [[సంభోగం|లైంగిక సంపర్కం]] ద్వారా సంభవించే [[సుఖ వ్యాధి]].
 
అతి సూక్ష్మమైన వైరస్ హెర్పిస్. జీవితాంతం బాధించే ఈ వైరస్‌ను హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అంటారు. ఇది రెండు రకాలు. ఒకటి హెచ్ఎస్‌వి 1, హెచ్ఎస్‌వి 2.
#హెచ్ఎస్‌వి 1 : ఇది నోటి దగ్గర పొక్కుల రూపంలో బయటపడుతుంది. పెదవుల చుట్టూ తెల్లని నీటి పొక్కులలాగా కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా తల్లిదండ్రులు, తోటి పిల్లల నుంచి వ్యాపిస్తుంది. ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. సాధారణంగా ఇవి వచ్చి పోతూ ఉంటాయి.
#హెచ్ఎస్‌వి 2 : జననావయవాల దగ్గర పొక్కులతో బయటపడుతుంది. దీనినే జెనిటల్ హెర్పిస్ అంటారు. చిన్న చిన్న నీటి పొక్కులలాగా వచ్చి పగిలిపోతుంటాయి. తగ్గినట్టే తగ్గి తిరిగి రావడం జరుగుతుంది. లైంగిక వ్యాధులలో నిత్యం వేధించే ఈ సమస్య దైనందిక జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది.
హెర్పిస్ వైరస్ పురుషుల నుంచి స్త్రీలకు లేదా స్త్రీల నుంచి పురుషులకు శృంగారం జరిపే సమయంలో వ్యాప్తి చెందుతుంది. కలయిక సమయంలో చర్మం చిట్లినప్పుడు పుండ్లు, గాయాల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. శరీరంలోకి ప్రవేశించిన ఈ వైరస్ కొద్ది రోజుల్లోనే ప్రభావం చూపిస్తుంది. ఈ వైరస్ వెన్నెముక చివరి భాగం శాక్రమ్ చుట్టూ ఉండే నాడుల సముదాయంలో చోటు చేసుకుని నిద్రావస్థలో ఉండిపోతుంది. ఈ నిద్రాణ స్థితిలో ఎలాంటి లక్షణాలూ చూపించకుండా అవ సరమైనప్పుడు తన ప్రతాపాన్ని చూపించి అతలాకుతలం చేస్తుంది. రోగిలోని రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడినప్పుడు మానసిక ఆందోళన, శారీరక ఆందోళన ఉన్నప్పుడు, వాతావరణ పరిస్థితులు మారినప్పుడు లేదా ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఇది సునామీ లాగా విజృంభిస్తుంది.
==కారణాలు==
అపరిశుభ్రమైన వాతావరణం, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, సరైన ఆహార సమతుల్యత లేకపోవడం.
"https://te.wikipedia.org/wiki/సర్పి" నుండి వెలికితీశారు