కానుగ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
కానుగ ఒక రకమైన చెట్టు.[[వేపచెట్టు]]వలె వైద్య(ఒషద)పరంగా పలు ఉపయోగాలు కలిగినచెట్టు.వృక్షశాస్రనామం:పొంగమియ పిన్నట పెర్రె(ponngamia pinnata perre).పపిలినేసియా కుటుం బానికి చెందిన చెట్టు.
==పరిచయము==
కానుగ చెట్లను రోడ్లపక్కన నీడకోసం పెంచుతారు. ఉద్యానవనాల్లో ఆర్నమెంటల్ ట్రీగా కూడా పెంచుతారు. కానుగ ఆకులు కొంచెం గుండ్రంగా ఉంటాయి. పువ్వులు గుత్తులుగా నీలం తెలుపు కలగలసిన రంగులో ఉంటాయి. కాయలు సీమబాదం కాయల మాదిరిగా ఉంటాయి. కాయలపైన తోలు ఉంటుంది. ఇవి కొంచెం వంకరగా, చితక్కొట్టినట్లు తప్పెటగా ఉంటాయి. కాయలోపల నూనె గింజలు ఉంటాయి. వీటినుంచి కానుగ నూనెను తీస్తారు. కానుగ గింజలు అక్టోబర్, నవంబర్ నెలల్లో లభిస్తాయి. ఉపయోగపడే భాగాలు --- కానుగ కాయలు, కానుగ చెట్టుపట్ట, కానుగ వేర్లు, కానుగ ఆకులు. మోతాదు గింజల చూర్ణం: 250 మి.గ్రా., ఇతర భాగాల చూర్ణం: 3-5 గ్రాములు కషాయం చేయడానికి తీసుకోవాల్సిన గింజల మోతాదు:5-10 గ్రాములు, కషాయం: 50-100 మిల్లీలీటర్లు. శాస్ర్తియ అధ్యయనాలు కానుగ నూనె: స్కేబిస్ (గజ్జి), హెర్పిస్ (విసర్పం), లూకోడర్మా (తెల్లమచ్చలు) తదితర చర్మవ్యాధుల్లో బాహ్యప్రయోగంగా వాడితే హితకరంగా ఉంటుంది. నిమోనియాలోనూ, జలుబులోనూ ఛాతిమీద బాహ్యంగా ప్రయోగిస్తే ప్రయోజనం ఉంటుంది. అబ్యంతరంగా తీసుకుంటే కోలోగాగ్‌గా (కాలేయాన్ని శక్తివంతంగా చేసేదిగా) పనిచేస్తుంది. ఆకులు: ఆకు రసం ఫ్లాట్యులెన్స్(గ్యాస్)లోనూ, డిస్‌పెప్సియా (కడుపునొప్పి), డయేరియా (నీళ్ల విరేచనాలు), కాఫ్ (దగ్గు) తదితర సమస్యల్లో హితకరంగా ఉంటుంది. ఆకు కషాయం లెప్రసి, గనేరియా వ్యాధుల్లో పనిచేస్తుంది. కానుగ వేరు: వేరు పేస్టును పట్టుగా కడితే గడ్డలు పగిలి ఉపశమనం లభిస్తుంది. వేరు నిజరసాన్ని దుష్టవ్రణాలను శుభ్రపరచడానికి, ఫిస్ట్యులస్ సోర్స్ (నాడీ వ్రణాలు)ని మూయడానికి వాడవచ్చు. కొమ్ముపట్ట: దీని కల్కాన్ని బ్లీడింగ్ పైల్స్ (రక్తంతోకూడిన మూల వ్యాధి) అభ్యంతరంగా వాడవచ్చు. కానుగ గింజలు, కాయలపైన ఉండే తోలు, కానుగ గింజలు: వీటి కల్కాన్ని బ్రాంకైటిస్ (ఇనె్పక్షన్‌తో కూడిన దగ్గు), వూపింగ్ కాఫ్ (కోరింత దగ్గు)లో అభ్యంతరంగా వాడవచ్చు. ఆయుర్వేద గృహచికిత్సలు ఉన్మాదం: కానుగ గింజలను, దిరిశన గింజలను చూర్ణంచేసి తేనె, నెయ్యిలను కలిపి తీసుకుంటే అన్నిరకాల ఉన్మాదాల్లోను హితకరంగా ఉంటుంది. (యోగరత్నాకరం). మొండిగా బాధించే వాంతులు కానుగ గింజను వేయించి, చిన్న చిన్న ముక్కలుగా చేసి అప్పుడప్పుడు తింటుండాలి. శరీరాంతర్గత రక్తస్రావం కానుగ గింజలను మెత్తగా నూరి తేనెతోనూ, నెయ్యితోనూ, పంచదారతోనూ కలిపి తీసుకుంటే రక్తస్రావం ఆగుతుంది. అలాగే నేరేడుచెట్టు పట్ట, తెల్లమద్దిపట్ట, మామిడిచెట్టు పట్టలతో కషాయం తయారుచేసుకొని తాగాలి. బాహ్యాభ్యంతర రక్తస్రావం కానుగ గింజలను మెత్తగా నూరి వేడిచేసిన ఉప్పును కలిపి పెరుగుమీద తేటతో మూడురోజులపాటు తీసుకుంటే బాహ్యాభ్యంతర రక్తస్రావం నిలిచిపోతుంది. అర్శమొలలు లేత కానుగ ఆకులను తెచ్చి ముద్దగా నూరి నువ్వుల నూనె, ఆవు నెయ్యిల మిశ్రమంలో వేయించి, వేయించిన గోధుమ పిండిని కలిపి తీసుకుంటే అరుగుదల పెరిగి, సుఖ విరేచనమవుతుంది. దీంతో అర్శమొలలు తగ్గుతాయి. అరుచి కానుగ చెట్టు పుల్లతో దంత ధావనం చేసుకుంటే నాలుక మీద ఉండే రుచిగ్రాహక గ్రంథులు ఉద్దీపన చెందుతాయి. దీంతో రుచి పెరుగుతుంది. ప్లీహం పెరగటం (స్ల్పీనోమెగాలి) కానుగ చెట్టు క్షారాన్ని పుల్లని గంజితో కలిపి, బిడా లవణాన్ని, పిప్పళ్ల చూర్ణాన్ని కలిపి తీసుకుంటే ప్లీహం పెరిగిన సందర్భాల్లో హితకరంగా ఉంటుంది. వాంతులు కానుగ ఆకులను వేసి తయారుచేసిన బియ్యం గంజిని తాగితే వాంతులు తగ్గుతాయి. సైనసైటిస్, ఇతర సైనస్ సంబంధ సమస్యలు కానుగను (ఆకులు, కాండబెరడు, కానుగ వేర్లు), వేప చెట్టు బెరడును, జాజికాయలను, తానికాయలను కచ్చాపచ్చాగా దంచి నీళ్లకు వేసి కషాయం తయారుచేసి జలనేతి పాత్రతోగాని లేదా బల్బ్‌సిరంజితోగాని సైనస్‌లని శుభ్రపరిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. * - డా. చిరుమామిళ్ల మురళీమనోహర్--August 14th, 2011
 
==మూలాలు==
*https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B1%81%E0%B0%97&action=edit
[[వర్గం:ఫాబేసి]]
"https://te.wikipedia.org/wiki/కానుగ" నుండి వెలికితీశారు