కె.సభా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కె.సభా
| residence =
| other_names =కె.సభా
| image =
| imagesize = 200px
| caption = కె.సభా
| birth_name = కె.సభా
| birth_date = [[1923]] [[జూలై 1]]
| birth_place = [[చిత్తూరు జిల్లా]] [[కొట్రకోన]]
| native_place =
| death_date = [[1980]] [[నవంబరు 4]]
| death_place =
| death_cause =
| known = కథా రచయిత
నవలాకారుడు
కవి
గేయకర్త
బాలసాహిత్య నిర్మాత
సంపాదకుడు
జానపద గేయ సంకలనకర్త
ప్రచురణకర్త
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ
| wife =
| spouse=
| partner =
| children =
| father = చెంగల్వరాయుడు
| mother = పార్వతమ్మ,
| website =
| footnotes =
| employer =
| height =
| weight =

'''కె.సభా''' రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి.జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా, నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు.
==జీవిత విశేషాలు==
Line 8 ⟶ 45:
==రాయలసీమ రైతాంగ సహిత్య వైతాళికుడు==
రాయలసీమ రైతాంగ సాహిత్య వైతాళికునిగా కె.సభా కృషి అనన్యసామాన్యం. పల్లెపట్టుల బాధల పాటల పల్లవుల మీద సజన దృష్టిని నిలిపిన సభా అభివృద్ధి పేర వంచనాపరులైన పాలనా యంత్రాంగంలోని క్షుద్రులమీద, రాజకీయ యంత్రాంగంలోని కొత్తతరం స్వార్థ రాజకీయ వాదులమీద, నిరసన గళం గట్టిగా విన్పించారు. గాంధేయ జాతీయ వాద స్ఫూర్తినిండిన భావాలు సభారచనల్లో కోకొల్లలుగా కన్పిస్తాయి. ఇతివృత్త స్వీకరణలం, కథనంలో పాత్రల చిత్రీకరణలో, కంఠస్వరంలో, వాతావరణ చిత్రణంలో, మానవ సంబంధాల నిరూపణలో అద్వితీయమైన శైలిని, నిబద్ధతను సభా రచనల్లో పాటించారు. రైతుల కథల్లో ఆదర్శవాస్తవికతా వాదం, కఠిన విమర్శనా వాస్తవికత, ప్రజాస్వామ్యంలోని కొన్ని లొసుగులు కన్పిస్తాయి. కథన శిల్పంలో చెక్కు చెదరని దేశీయతను సభా పాటించారు. 'పిచ్చిదంపతులు' అనే ఆయన కథ చదివినప్పుడు సమాజ ప్రేమకు మనస్సున్న మనుషులు కావాలనే ఒక సామాజిక వేదన గుండెను తాకుతుంది. 'అంబా' కథ సీమకరవు నేపథ్యంతో రాసింది. చదివిన ప్రతి పాఠకుణ్ణి అది ఒక విషాదాంతసంఘటనగా వెంటాడుతుంది. 'అంతరంగం' కథ గ్రామీణ జీవితం, రైతుల కడగండ్లు, కడుపునిండని కవుల కృతక కావ్యరచనను వెక్కిరిస్తుంది. 'చుక్కలవరాలు' కథ అచ్చమైన దేశీయతను చెబుతుంది.
==రచనలు==
కథా సంపుటాలు బంగారు (5 కథలు),పాతాళ గంగ (పది కథలు), నీటి దీపాలు (15 కథలు) యిలా మూడొందల కథలు, పిల్లలకథలు వందల సంఖ్యలో ఉండగా తొమ్మిది సంపుటాలు వెలువడ్డాయి. భిక్షుకి, మొగలి, దేవాంతకుడు వంటి నవలలు మరియు పిల్లల కోసం మరో ఏడు నవలను వ్రాసారు. వేయికి పైగా బాలగేయాలు వ్రాసారు. విశ్వరూప సందర్శనం అనే గేయ కావ్యం రాసారు.దయానిధి వేదభూమి వంటి పద్యకావ్యాలను వ్రాసారు.రైతురాజ్యం, పాంచజన్యం అనే బుర్రకథ లు వ్రాసారు.

ఈయన [[1980]] [[నవంబరు 4]] న మరణించారు.
==సూచికలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కె.సభా" నుండి వెలికితీశారు