శ్రీహరి నిఘంటువు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
పిఠాపురం రాజా సూర్యారావు బహదూర్ గారి అండదండలతో, [[జయంతి రామయ్య పంతులు]] గారి ఆధ్వర్యంలో అనేక పండితుల కృషి ఫలితంగా '[[శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు]]' అనే పేర ఒక బృహన్నిఘంటువు నిర్మాణం జరిగింది. ప్రముఖ భాషా సాహితీ సంస్థ [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] దీన్ని ప్రచురించింది. ప్రామాణికమైన తెలుగు నిఘంటువుల్లో దీనికి ప్రముఖ స్థానం ఉంది. నిఘంటు నిర్మాణకాలంనాటికి అందుబాటులో ఉన్న సాహిత్యాన్ని, వివిధ నిఘంటువులను ఆధారంగా చేసుకొని ఈ నిఘంటు నిర్మాణం జరిగింది. ఈ నిఘంటు నిర్మాణం 1911లో ప్రారంభింపబడి 1972లో పూర్తిగావింపబడింది. ఇది మొత్తం ఏడు సంపుటాల్లో ప్రచురింపబడినది.
 
ఏ నిఘంటువైనా సర్వసమగ్రమని చెప్పలేం. తరువాతికాలంలో లభించిన సామగ్రినిబట్టి, భాషలో వచ్చిన మార్పులనుబట్టి నిఘంటువులో ఎన్నో మార్పులకు, చేర్పులకు అవకాశం ఉంటుంది. [[అమరకోశం]] మొదలైన ఎన్నో ప్రాచీన నిఘంటువులకు కూడా అనంతరకాలంలో శేషగ్రంథాలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. సుమారు అరవై సంవత్సరాలకు పూర్వం సిద్ధం చేయబడిన సూర్యరాయాంధ్ర నిఘంటువులో కూడా భాషలో తరువాత వచ్చిన మార్పుల ఆధారంగా అందులో లేని ఆరోపాలను చేరుస్తూ దీనికి ఒక అనుబంధ నిఘంటువును సిద్ధం చేయవలసిన ఆవశ్యకం ఎంతో ఉంది. దీన్ని గుర్తించి రవ్వా శ్రీహరి గత ఏడెనిమిది సంవత్సరాలుగా కృషిచేసి వివిధ ఆకరాలను పరిశీలించి ఇందులో లేని ఆరోపాలనెన్నింటినో సేకరించి సూర్యరాయాంధ్ర నిఘంటువుకు శేషగ్రంథంగా ఈ 'శ్రీహరి నిఘంటువు'ను సిద్ధం చేయడం జరిగింది.
 
== కొన్ని వివరాలు ==
 
# సూర్యరాయాంధ్ర నిఘంటువులో లేని సుమారు ముప్పైఐదువేల కొత్త ఆరోపాలు ఇందులో చోటు చేసుకున్నాయి.
# సూర్యరాయాంధ్ర నిఘంటుకర్తలు సంప్రతించని తాళ్లపాక కవుల సాహిత్యం - ప్రధానంగా అన్నమయ్య కీర్తనలు; క్షేత్రయ్యపదాలు, సారంగపాణి పదాలు మొదలైన పదసాహిత్యానికి సంబంధించిన గ్రంథాలు; కాటమరాజుకథలు, బొబ్బిలియుద్ధం మొదలైన జానపద సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలు; రాయవాచకం, సిద్ధేశ్వరచరిత్ర మొదలైన చారిత్రక గ్రంథాలు, కట్టా వరదరాజు శ్రీరామాయణం, పల్నాటి వీరచరిత్ర మొదలైన ద్విపద గ్రంథాలు; యక్షగాన-సాహిత్యం; కాశీయాత్రా చరిత్ర, సాక్షి మొదలైన వచన గ్రంథాలు - వీటన్నిటినీ సంప్రతించి ఎన్నో ఆరోపాలు సేకరించి ఇందులో పొందుపరచడం జరిగింది.
# సూర్యరాయాంధ్ర నిఘంటుకర్తలు సంప్రదించని తూము రామదాసకవి ఆంధ్రపద నిధానము (1930), సర్వాంధ్రసార సంగ్రహము, మారేపల్లివారి నుడికడలి (అముద్రితం) మొదలైన నిఘంటువుల నుండి ఎన్నో దేశ్యపదాలను సేకరించి ఇందులో చేర్చడం జరిగింది. ఆంధ్రపద నిధానంలో దాదాపు 250 దేశ్యపదాలు లభ్యమైనాయి.
# సూర్యరాయాంధ్ర నిఘంటుకర్తలు సంప్రతించిన ఆంధ్రమహాభారతం, ఆంధ్ర మహాభాగవతం, హంసవింశతి, శుకసప్తతి మొదలైన గ్రంథాలలో కూడా వారి దృష్టికి రాక తప్పిపోయిన ఆరోపాలను కూడా ఎన్నింటినో గుర్తించి ఈ నిఘంటువులో చేర్చడం జరిగింది.
# కేవలం ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలనుండేకాక ఆధునిక సాహిత్యం (నవలలు, కథలు, కవిత్వం మొదలైనవి) నుండి కూడా సేకరింపబడిన ఎన్నో వాడుకపదాలు ఇందులో ఆరోపాలుగా గ్రహింపబడ్డాయి.
# పూర్వ నిఘంటువుల్లో మాండలికపదాలకు, నిత్యవ్యవహారంలో ఉన్న అనేక పదాలకు స్థానం కనిపించదు. సాహిత్యమంతటా ఒకేచోట, ఒక్కసారి మాత్రమే ప్రయోగింపబడ్డ పదానికి కూడా నిఘంటువుల్లో స్థానం ఇస్తున్నప్పుడు లక్షలాది జనం నాలుకలపై ఉండి నిఘంటువుల్లోకి ఎక్కకపోవడం అపచారమే అనిపిస్తుంది. కనుక మాండలిపదాలు, జనుల నిత్యవ్యవహారంలోని పదాలు ఎన్నో ఇందులో సంగ్రహింపబడ్డాయి.
# కేవలం పదాలేకాక భాషా వ్యవహారంలోని ప్రత్యేకతను తెలిపే పదబంధాలు కూడా ఇందులో ఆరోపాలుగా చూపబడ్డాయి. ఐతే ఆ పదాలన్నీ ప్రధానపదంలోనే భిన్న భిన్న ఆరోపాలుగా కాక స్వతంత్రారోపాలుగా గ్రహింపబడ్డాయి.
# ఆరోపాలకు కేవలం అర్థాలేకాక వాటికి వీలైనంతవరకు సాహిత్యం నుండి, వ్యవహారం నుండి ప్రయోగాలు చూపబడ్డాయి.
# సూర్యరాయాంధ్ర నిఘంటువులో చేరక ఇతర నిఘంటువుల్లో - ముఖ్యంగా వావిళ్ల నిఘంటువు, వాచస్పత్యం, బ్రౌణ్యం, తెలుగు వ్యుత్పత్తి పదకోశం మొదలైన నిఘంటువుల్లో లభించే పదాలను కూడా ఇందులో చేర్చడం జరిగింది. ఇందువల్ల ప్రస్తుత సూర్యరాయాంధ్ర నిఘంటువులో లభ్యంకాని పదాల కోసం ఇతర నిఘంటువులను సంప్రతించవలసిన అవసరం ఉండదు. చాలావరకు ఈ నిఘంటువు ఆ అవసరాన్ని తీరుస్తుంది.
# సూర్యరాయాంధ్ర నిఘంటు నిర్మాణం జరిగిన తరువాత ఈ యాభై అరవై యేళ్ళలో భాషలో ఎంతో కొత్త పదజాలం ఏర్పడింది. ఉన్న పదజాలానికి కూడా అర్థపరిణామాదులు కలిగినాయి. ఈ నిఘంటు నిర్మాణంలో వీటిని దృష్టిలో పెట్టుకోవడం జరిగింది.
# అర్థనిర్ణయం సందిగ్ధంగా ఉన్న కొన్ని పదాలకు ఎదురుగా (?) గుర్తువేసి వదిలివేయడం జరిగింది. విజ్ఞులు వాటి అర్థాలు తెలియజేస్తే తరువాతి ముద్రణలో చేర్చుకుంటాను.
# ఒక మూలశబ్దం నుండి ఏర్పడ్డ వివిధ పదాలను సూర్యరాయాంధ్ర నిఘంటువు ఆ పదం ఆరోపం క్రింద చూపడంతో పాటు కొన్ని సందర్భాల్లో విడివిడిగా చూపడం కూడా జరిగింది. ఈ నిఘంటువులో అలా కాకుండా ప్రతి ఆరోపం స్వతంత్రారోపంగానే చూపబడింది.
# సూర్యరాయాంధ్ర నిఘంటువులో గ్రాంధికభాషే అనుసరింపబడడంవల్ల దాని శేష గ్రంథమైన ఈ నిఘంటువులోనూ గ్రాంథికభాషే స్వీకరింపబడింది.
 
[[వర్గం:నిఘంటువులు]]
"https://te.wikipedia.org/wiki/శ్రీహరి_నిఘంటువు" నుండి వెలికితీశారు