శ్రీహరి నిఘంటువు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
 
# సూర్యరాయాంధ్ర నిఘంటువులో లేని సుమారు ముప్పైఐదువేల కొత్త ఆరోపాలు ఇందులో చోటు చేసుకున్నాయి.
# సూర్యరాయాంధ్ర నిఘంటుకర్తలు సంప్రతించని తాళ్లపాక కవుల సాహిత్యం - ప్రధానంగా అన్నమయ్య కీర్తనలు; క్షేత్రయ్యపదాలుక్షేత్రయ్య పదాలు, సారంగపాణి పదాలు మొదలైన పదసాహిత్యానికి సంబంధించిన గ్రంథాలు; కాటమరాజుకథలుకాటమరాజు కథలు, [[బొబ్బిలియుద్ధం]] మొదలైన జానపద సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలు; రాయవాచకం, సిద్ధేశ్వరచరిత్రసిద్ధేశ్వర చరిత్ర మొదలైన చారిత్రక గ్రంథాలు, కట్టా వరదరాజు శ్రీరామాయణం, [[పల్నాటి వీరచరిత్ర]] మొదలైన ద్విపద గ్రంథాలు; యక్షగాన-సాహిత్యం; కాశీయాత్రా[[కాశీయాత్ర చరిత్ర]], [[సాక్షి వ్యాసాలు]] మొదలైన వచన గ్రంథాలు - వీటన్నిటినీ సంప్రతించి ఎన్నో ఆరోపాలు సేకరించి ఇందులో పొందుపరచడం జరిగింది.
# సూర్యరాయాంధ్ర నిఘంటుకర్తలు సంప్రదించని తూము రామదాసకవి ఆంధ్రపద నిధానము (1930), సర్వాంధ్రసార సంగ్రహము, మారేపల్లివారి నుడికడలి (అముద్రితం) మొదలైన నిఘంటువుల నుండి ఎన్నో దేశ్యపదాలను సేకరించి ఇందులో చేర్చడం జరిగింది. ఆంధ్రపద నిధానంలో దాదాపు 250 దేశ్యపదాలు లభ్యమైనాయి.
# సూర్యరాయాంధ్ర నిఘంటుకర్తలు సంప్రతించిన ఆంధ్రమహాభారతంఆంధ్ర మహాభారతం, ఆంధ్ర మహాభాగవతం, హంసవింశతి, శుకసప్తతి మొదలైన గ్రంథాలలో కూడా వారి దృష్టికి రాక తప్పిపోయిన ఆరోపాలను కూడా ఎన్నింటినో గుర్తించి ఈ నిఘంటువులో చేర్చడం జరిగింది.
# కేవలం ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలనుండేకాక ఆధునిక సాహిత్యం (నవలలు, కథలు, కవిత్వం మొదలైనవి) నుండి కూడా సేకరింపబడిన ఎన్నో వాడుకపదాలు ఇందులో ఆరోపాలుగా గ్రహింపబడ్డాయి.
# పూర్వ నిఘంటువుల్లో మాండలికపదాలకు, నిత్యవ్యవహారంలో ఉన్న అనేక పదాలకు స్థానం కనిపించదు. సాహిత్యమంతటా ఒకేచోట, ఒక్కసారి మాత్రమే ప్రయోగింపబడ్డ పదానికి కూడా నిఘంటువుల్లో స్థానం ఇస్తున్నప్పుడు లక్షలాది జనం నాలుకలపై ఉండి నిఘంటువుల్లోకి ఎక్కకపోవడం అపచారమే అనిపిస్తుంది. కనుక మాండలిపదాలుమాండలిక పదాలు, జనుల నిత్యవ్యవహారంలోని పదాలు ఎన్నో ఇందులో సంగ్రహింపబడ్డాయి.
# కేవలం పదాలేకాక భాషా వ్యవహారంలోని ప్రత్యేకతను తెలిపే పదబంధాలు కూడా ఇందులో ఆరోపాలుగా చూపబడ్డాయి. ఐతే ఆ పదాలన్నీ ప్రధానపదంలోనే భిన్న భిన్నభిన్నభిన్న ఆరోపాలుగా కాక స్వతంత్రారోపాలుగా గ్రహింపబడ్డాయి.
# ఆరోపాలకు కేవలం అర్థాలేకాక వాటికి వీలైనంతవరకు సాహిత్యం నుండి, వ్యవహారం నుండి ప్రయోగాలు చూపబడ్డాయి.
# సూర్యరాయాంధ్ర నిఘంటువులో చేరక ఇతర నిఘంటువుల్లో - ముఖ్యంగా వావిళ్ల నిఘంటువు, వాచస్పత్యం, బ్రౌణ్యం, తెలుగు వ్యుత్పత్తి పదకోశం మొదలైన నిఘంటువుల్లో లభించే పదాలను కూడా ఇందులో చేర్చడం జరిగింది. ఇందువల్ల ప్రస్తుత సూర్యరాయాంధ్ర నిఘంటువులో లభ్యంకాని పదాల కోసం ఇతర నిఘంటువులను సంప్రతించవలసిన అవసరం ఉండదు. చాలావరకు ఈ నిఘంటువు ఆ అవసరాన్ని తీరుస్తుంది.
పంక్తి 44:
# అర్థనిర్ణయం సందిగ్ధంగా ఉన్న కొన్ని పదాలకు ఎదురుగా (?) గుర్తువేసి వదిలివేయడం జరిగింది. విజ్ఞులు వాటి అర్థాలు తెలియజేస్తే తరువాతి ముద్రణలో చేర్చుకుంటాను.
# ఒక మూలశబ్దం నుండి ఏర్పడ్డ వివిధ పదాలను సూర్యరాయాంధ్ర నిఘంటువు ఆ పదం ఆరోపం క్రింద చూపడంతో పాటు కొన్ని సందర్భాల్లో విడివిడిగా చూపడం కూడా జరిగింది. ఈ నిఘంటువులో అలా కాకుండా ప్రతి ఆరోపం స్వతంత్రారోపంగానే చూపబడింది.
# సూర్యరాయాంధ్ర నిఘంటువులో గ్రాంధికభాషే[[గ్రాంధిక భాష]] అనుసరింపబడడంవల్ల దాని శేష గ్రంథమైన ఈ నిఘంటువులోనూ గ్రాంథికభాషే స్వీకరింపబడింది.
 
[[వర్గం:నిఘంటువులు]]
"https://te.wikipedia.org/wiki/శ్రీహరి_నిఘంటువు" నుండి వెలికితీశారు