చుండ్రు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 38 interwiki links, now provided by Wikidata on d:q117484 (translate me)
పంక్తి 1:
{{మొలక}}
{{Infobox_Disease
| Name = Dandruff
Line 16 ⟶ 15:
 
చుండ్రు (Dandruff) ఒకరకమైన చర్మవ్యాధి.ఆంగ్లంలో Pityriasis simplex capillitii అంటారు.
==నివారణ చర్యలు==
#ఇతరుల దువ్వెనలను, బ్రెష్‌లను, తువ్వాళ్ళను వాడకూడదు. తమ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు.
#వారానికి ఒకసారి పరిశుద్ధమైన కొబ్బరినూనెను కానీ, ఆలివ్‌ ఆయిల్‌ను కానీ వెచ్చ చేసి, తలకు పట్టించి, సున్నితంగా మర్దన చేయాలి. ఆ తర్వాత కుంకుడుకాయలు, శీకాయపొడిని ఉపయోగించి, తలస్నానం చేయాలి.
#తలస్నానం చేసే నీళ్ళు పరిశుభ్రంగా ఉండాలి. పొగలు కక్కే వేడినీటిని కానీ, మరీ చన్నీటిని కానీ తల స్నానానికి ఉపయోగించకూడదు. గోరువెచ్చని నీటిని మాత్రమే తలస్నానానికి ఉపయోగించాలి.
#వెంట్రుకలకు రాయటానికి పరిశుభ్రమైన కొబ్బరినూనెనే వాడాలి. రసాయనాలు కలిసిన హెయిర్‌ ఆయిల్స్‌ను వాడకూడదు.
#ఇతరుల దుప్పట్లను, తలగడలను వాడకూడదు.
#చుండ్రుతో బాధపడేవారు పొగరేగే ప్రాంతాలలో తప్పనిసరిగా ఉండవలసి వచ్చినప్పుడు తలకు ఆచ్ఛాదనగా టోపీ పెట్టుకోవడం కానీ, బట్టను కట్టుకోవడం కానీ చేయాలి.
#చుండ్రుతో బాధపడేవారు తలగడ గలీబులను వేడినీటిలో నానబెట్టి, శుభ్రంగా ఉతికి ఎండలో ఆర వేయాలి.
#తీక్షణమైన ఎండ కూడా వెంట్రుకల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.
#తలంటు స్నానానికి షాంపూలు, సబ్బులు ఉపయోగించకుండా, కుంకుడు కాయల రసం లేదా పొడి, సీకాయ పొడినే వాడాలి.
#పోషకాహార లోపం ఏర్పడకుండా సంతులిత ఆహారాన్ని తీసుకోవాలి.
#నిద్రలేమి ఏర్పడకుండా చూసుకోవాలి.
#తల దువ్వుకునే దువ్వెనలో పళ్ళ మధ్య మట్టి పేరుకోకుండా శుభ్రపరుస్తూ, దువ్వెనలను వారానికి ఒకసారి వేడి నీటితో శుభ్రపరచడం మంచిది.
#వెంట్రుకల కుదుళ్ళలోకి ఇంకేటట్లుగా కొబ్బరి నూనె తలకు రాసినప్పుడు వేళ్ళతో సున్నితంగా మసాజ్‌ చేయాలి.
#వేసవిలో చెమట వల్ల, వానాకాలంలో తల తడవడం వల్ల వెంట్రుకలు అపరిశుభ్రమవుతాయి. వారానికి రెండుసార్లు గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే వెంట్రుకల ఆరోగ్యం బాగుంటుంది.
== చిట్కా ==
చుండ్రు మృత చర్మం వలన తయరవుతుంది. కావున గుండు చెయంచుకునెప్పుడు ఆ మృత చర్మంను తోలగించమని కోరుకొవాలి. ఆ తరువాత ప్రతి రోజు కొబ్బరి నూనె రాసుకుంటె మృత చర్మం తయరవదు, చుండ్రు రాదు.
"https://te.wikipedia.org/wiki/చుండ్రు" నుండి వెలికితీశారు