పంబల వారు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
సర్కారు ఆంధ్ర ప్రాంతంలో ఒకప్పుడు విరివిగా జరిగే దేవతల కొలువుల్లోనూ, జాతర్ల లోనూ [[పంబల]] వారి కథలు ఎక్కువగా జరుగుతూ వుండేవి. ఈ నాటికీ గ్రామ దేవతలను కొలిచే ప్రతి చోటా ఈ కథలు జరుగుతూ వున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ కథలు కనుమరుగు ఔతున్నాయి.
పంబల వారు అయ్యగారి దర్శనానికి చెందిన హరిజనులనీ, వీరి వాయిద్యం ''పంబ జోడనీ, వీరు ఎక్కువగా '' అంకమ్మ '' కథలను పాదుతారనీ, వీరు కొలిచే అంకమ్మకు, ''మురాసపు అంకమ్మ '' అని పేరనీ వంతలు పంబ జోడును వాయిస్తూ [[శ్రుతి]] కి [[తిత్తి]] ఊదుతూ వుంటే కథకుడు రాజ కుమారునిలా వేషాన్ని ధరించి కుడి చేతితో పెద్ద కత్తినీ, ఏడమ చేతితో ''అమజాల '' అనే చిన్న కత్తినీ పట్టుకుని వీరా వేశంతో [[చిందులు]] తొక్కుతూ కథను పాడుతారనీ, డా: [[తంగిరాల వెంకట సుబ్బారావు]] గారు జాన పద కళోత్సవాల సంచికలో వివరించారు.
==కులచరిత్ర==
గ్రామీణ ప్రాంతాలలో వర్షాలు కురవకపోయినా,రోగాలొచ్చినా గ్రామ దేవతలను ప్రసన్నులను చేసుకోవడానికి కొలిచే కొలుపుల్లో ‘పంబల’ కులస్తులు వాయిద్యాలు వాయించేవారు.రాత్రి సమయంలో పంబలవారు వాయిద్యాలను వాయిస్తూ కథలు చెప్పేవారు.
పంబలవారు సర్కారు జిల్లాల్లో ఎక్కువగా అంకమ్మ కథలను పాటల రూపంలో వినిపించేవారు. రాగాలుతీస్తూ శ్రావ్యంగా కథలు వినిపించేవారు. వీరు కొలిచే అంకమ్మ దేవతను ‘మరాసపు అంకమ్మ’ అని చెప్పుకుంటారు. ఇందులో ప్రధాన కథకుడు రాజకుమారుని వేషం ధరిస్తాడు.కత్తులతో విన్యాసాలు కూడా చేస్తాడు. కుడి చేతిలో పెద్ద కత్తి, ఎడమచేతిలో అమజాల అనే చిరు కత్తిని పట్టుకుని వీరావేశం ప్రదర్శిస్తాడు.కథను రక్తి కట్టిస్తాడు.ప్రక్కనే ఉన్న వంతలవాళ్లు పంబజోడును వాయిస్తూ, శృతికి తిత్తిని ఊదుతూ సహకరిస్తారు.పంబలవాళ్ల వాయిద్యాలు లేకుండా ఆరోజుల్లో జాతరలు ముగిసేవికావు.ఉత్సవ విగ్రహాల ఊరేగింపుల్లో కూడా వీరు తమ వాయిద్యాలతో పాల్గొని తమ ప్రత్యేకతను చాటుకునేవారు.[[మాల]] లకు వీరు పూజారులు.పెద్ద కర్మ తదితర అంత్యక్రియల కార్యక్రమాలలో కూడా వీరే నిర్వహించేవారు.ఆర్థికంగా ఎదుగుదల లేకపోవడం,నమ్ముకున్న కళ దెబ్బతినడం,ఆది నుండి గ్రామాలనే నమ్ముకుని జీవిస్తున్న వీరు బతుకుదెరువుకోసం పట్టణాలకు పలసలుపట్టి ప్లాస్టిక్‌షీట్లతో టెంట్లు వేసుకుని జీవిస్తూ అడ్డాల దగ్గర నిలబడి కూలీలయ్యారు.
==సూచికలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/పంబల_వారు" నుండి వెలికితీశారు