బోయ జంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
'''బోయ జంగయ్య''' ప్రముఖ రచయిత. నాటికలు, కవిత్వం, కథ, నవలలు మొదలైన ప్రక్రియల్లో ఆయన రచనలు చేశాడు.
==జీవిత విశేషలు==
'''బోయ జంగయ్య''' [[నల్లగొండనల్గొండ జిల్లా]] [[రామన్న పేట]] తాలూకాలోని [[పంతంగి]] గ్రామంలో ఎల్లమ్మ, మల్లయ్య దంపతులకు [[1942]] [[అక్టోబరు 1]] న జన్మించారు. బి.ఏ, డి.లిట్‌ చదివారు. వృత్తి రీత్యా ప్రభుత్వ ఖజానాలు, లెక్కల శాఖలో చాలాకాలం పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన చదువుకున్న చదువు చేసిన ఉద్యోగం సాహిత్యంతో ఏమాత్రం సంబంధం లేకున్నా హృదయంలో సాహిత్యానుబంధం అతనికి ఏర్పడింది.
==రచయితగా==
బోయ జంగయ్య యాభై సంవత్సరాలుగా నిరంతరం సాహిత్య కృషి చేస్తున్నాడు. ఆయన ఎన్ని ప్రక్రియల్లో రచనలు చేసినా అతని ప్రతిభ కథలు వ్రాయటంలో నవలలు రచించటంలో ఎక్కువగా ప్రకాశించిందని చెప్పాలి. ఆయన వ్రాసిన కథలు మానవతా వాదాన్ని చిత్రిస్తున్నాయి. దళిత వాదాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఆయన రచించిన నవలల్లోనూ దళితవాద దృక్కోణం చోటు చేసుకున్నది. దళితవాదంలో కవిత్వం వచ్చినంత బలంగా వచన రచనలు రాలేదని చెప్పాలె. కాని తెలంగాణ నుంచి మాత్రం దళిత వాదాన్ని చిత్రిస్తూ కథలు, నవలలు వంటి వచన ప్రక్రియల్లో రచనలు చాలా వచ్చాయి. అటువంటి వచన ప్రక్రియల్లో రచనలు చేసిన ప్రముఖ రచయిత, సీనియర్‌ రచయిత బోయ జంగయ్యనే. పద్యం, కవిత్వం వ్రాయటం సులభం కాని వచనం వ్రాయటం కఠినం. అందులో చక్కని సమగ్రమైన అర్ధవంతమైన విషయావగాహన కలిగించే వచనం వ్రాయటం అంతగా సులభమైన పనికాదు. కాని బోయ జంగయ్య కథల్లోగాని నవలల్లోగాని వచన రచన సమగ్రంగా వుంటుంది. చక్కని శైలిలో ఆయన వచన రచన చేశాడు.
పంక్తి 62:
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:1943 జననాలు]]
[[వర్గం:బాలసాహిత్యంబాల సాహిత్యం]]
[[వర్గం:నల్గొండ జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/బోయ_జంగయ్య" నుండి వెలికితీశారు