గుత్తికొండ నరహరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
 
==జీవన సరళి==
తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్తగా, రాజకీయ విశ్లేషకుడుగా రాణించిన గుత్తికొండ నరహరి ఆగస్ట్ 10, 1918 న ఆంజనేయులు, రాఘవమ్మ దంపతులకు [[యలవర్రు]] గ్రామం, [[తెనాలి]] తాలుకా ([[గుంటూరు జిల్లా]]) లో పుట్టాడు. ఈ గ్రామం ప్రసిద్ధులకు కాణాచి. సుప్రసిద్ధ శాస్త్రవేత్త నాయుడమ్మ అక్కడివాడే. సమీపంలో వున్న తురుమెళ్ళ పాఠశాలలో చదువుకున్నాడు. యలవర్తి రోశయ్య, మల్లంపాటి మధుసూదన ప్రసాద్ తన సహాధ్యాయులు. కాలేజీలో చేరకుండానే బర్మా లోని రంగూన్ వెళ్ళి రెండేళ్ళు పత్రికా విలేఖరి గా పనిచేసి , తిరిగి వచ్చి గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బి.ఎ. పూర్తి గావించాడు. [[మద్రాస్]] లో న్యాయశాస్త్రము లో చేరి మధ్యలోనే స్వస్తిపలికి , ఎం.ఎన్.రాయ్ ప్రభావంలో నవ్య మానవవాద రాష్ట్ర పార్టి కార్యదర్శి అయ్యాడు. 1944 లో గూడవల్లి లో, మేనమామ కూతురు సరోజిని తో పెళ్ళి అయింది. ఈ వివాహం లౌకిక (Secular way) పద్ధతిలో జరిగి, నమోదు చేయబడినది.
 
==రాజకీయాలు ==
1946 ఎన్నికలలో నరహరి యువత నుద్దేశించి పదవులకు రాజీనామాలు చేయమని, స్వాతంత్ర్యం రానున్నందున త్యాగం చేస్తే తరువాత ఉన్నత పదవులు వస్తాయని బోధ చేశాడు. రాడికల్ రాజకీయాలలో అటు కమ్మూనిస్ట్ లను, ఇటు కాంగ్రెస్ వారిని ఎదురుకొని , తన ధారాళ ఉపన్యాసాలతో జనాన్ని ఆకట్టుకున్నాడు. ములుకోల, ప్రజామిత్ర, సమీక్ష పత్రికలలో వ్యాసాలు వ్రాసాడు. విహారి, ఆంధ్రా లేబరు పత్రికల సంపాదకత్వం వహించాడు. రాజకీయ పాఠశాలలో ఎందరినో సుశిక్షితులను గావించాడు. గోపిచంద్, ఆవుల గోపాలకృష్ణమూర్తి , ఎం.వి.రామమూర్తి, కోగంటి రాధాకృష్ణమూర్తి , పి.వి.సుబ్బారావు, రావిపూడి వెంకటాద్రి, ఎన్.వి.బ్రహ్మం లతో నవ్య మానవ వాద ఉద్యమంలో పనిచేశాడు. ఎ.సి.కాలేజి ప్రిన్సిపాల్ టి.ఎస్.పాలస్ కు దగ్గర మిత్రుడు. కొన్నాళ్ళు ఆచార్య రంగా తో పనిచేశాడు. 1972లో క్షాత్ర ధర్మ పరిషత్ అనే రాజకీయ పార్టి పెట్టి, లోక్ సభకు పోటీ చేశాడు. అసంపూర్తిగా వదిలేసిన లా ను పూర్తి చేసి, 1974 లో, హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేసాడు.
"https://te.wikipedia.org/wiki/గుత్తికొండ_నరహరి" నుండి వెలికితీశారు