మృణ్మయ పాత్రలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
===కూజ===
ఇది చిన్న కుండ ఆకారంలో వుండి సన్నని , మరియు పొడవుగా వున్న గొంతు కలిగిన మట్టి పాత్ర. ఎండాకాలంలో చల్లని నీళ్ళకొరకు వీటిని ఉపయోగిస్తారు. ఈ నాటికి వీటి ఉపయోగము చాల ఎక్కువగానే వున్నది. ఇందులోని నీళ్ళు చల్లగాను రుచి కరంగాను వుంటాయి. నీటి కొరకు తప్ప మరెందుకూ దీనిని వాడరు.
===నీళ్ల తొట్టి===
[[దస్త్రం:Totti.... mattidi.jpg|150px|right|thumb|మట్టితో చేసిన నీళ్లతొట్టి]]
గతంలో పల్లెల్లో ఇండ్లలో నీళ్ళను నిలువ చేసుకోడానికి మట్టితో చేసిన వాటిని ఉపయోగించే వారు. వాటినే [[తొట్టి]] అంటారు. పశువుల కొట్టంలో ఇలాంటి తొట్టి ఒకటి తప్పక వుంటుంది. అందులో బియ్యం కడిగిన నీళ్ళను, గంజి మొదలగు వంటింట్లో నుండి వచ్చే వ్వర్థ పదార్థాలను ఈ తొట్టి లోవేసేవారు. వాటిని పశువులు త్రాగుతాయి. దానినే [[కుడితి]] అనేవారు. అలాగే స్నానం చేయడానికి కావలసిన నీళ్ళను నిలువ చేసుకోవడానికి కూడ ఈ తొట్టిని ఉపయోగించేవారు. ప్రస్తుతం వీటి ఉపయోగము పూర్తిగా కనుమరుగైనది. వీటి స్థానంలో ఇటుకలు, సిమెంటు తో కట్టిన తొట్లు వాడకంలోకి వచ్చాయి.<nowiki> ఏక వచనము = తొట్టి, బహువచనము = తొట్లు.</nowiki>
 
==ఆకారాలు చేసే పద్ధతులు==
"https://te.wikipedia.org/wiki/మృణ్మయ_పాత్రలు" నుండి వెలికితీశారు