ప్రచ్ఛన్నయుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

చి సరైన పదం మార్పు
చి లింక్
పంక్తి 3:
రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు బలాబలాలు కలుపుకొని మిత్రదేశాలుగా ఒక వైపు పోరాడిన [[అమెరికా]], [[బ్రిటన్]], [[రష్యా]] లు శత్రుదేశాలైన [[జర్మనీ]],[[ఇటలీ]], [[జపాన్]] లను ఓడించాయి. కానీ యుద్ధం ముగుస్తూనే అమెరికా-బ్రిటన్ లకు, సోవియట్ యూనియన్ కు మధ్య తీవ్ర విభేదాలు పొడచూపాయి. అచిరకాలం లోనే ఇది అధిక పక్షం ప్రపంచ దేశాల వర్గ విభజనకు దారితీసేంతగా ఎదిగింది. రష్యా నాయకత్వంలో [[సామ్యవాద]] దేశాలన్నీ ఒక వర్గమైతే, అమెరికా వైపు [[పెట్టుబడిదారీ]] వ్యవస్థలన్నీ వత్తాసు పలికాయి.
 
రష్యా,అమెరికా నేరుగా యుద్ధాలేవీ పోరాడక పోయినా, వ్యూహాత్మక ప్రణాళికలు, క్షిపణి మొహరింపులతో పొంచియున్న మరో భయంకర ప్రపంచయుద్ధాన్ని తలపింపజేస్తుండేవి. [[బెర్లిన్ ఘర్షణ]], [[కొరియా యుద్ధం]], సోవియట్ యూనియన్ అణుపాటవ పరీక్షలు, [[భారత-భారత్ చైనా సమస్యయుద్ధం 1962]], క్యూబా క్షిపణి మొదలయిన అనేక సమస్యలు ఈ అంతర్గత ఒత్తిడిని రగులుస్తూ బహిర్గతం చేస్తూండేవి.
 
1991 లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై రష్యా బలం క్షీణించడంతో శీతల సమరం ముగిసి, అమెరికా ఏకైక [[అగ్ర రాజ్యాలు|అగ్ర రాజ్యం]] గా ఎదిగింది.
"https://te.wikipedia.org/wiki/ప్రచ్ఛన్నయుద్ధం" నుండి వెలికితీశారు