ప్రచ్ఛన్నయుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి లింక్
పంక్తి 3:
[[రెండవ ప్రపంచ యుద్ధం]] పిమ్మట [[అగ్ర రాజ్యాలు]] గా రూపు దిద్దుకున్న [[అమెరికా]], [[సోవియట్ యూనియన్]] ల మధ్య చిరకాలంపాటు కొనసాగిన ఉద్రిక్త పూర్వక ద్వైపాక్షిక సంబంధాలకే '''ప్రచ్ఛన్నయుద్ధం''' లేదా '''శీతల సమరము''' (Cold War) అని పేరు. పరస్పరాధిక్య ప్రదర్శన, ఆయుధ, క్షిపణి సమీకరణ, అనేక ప్రపంచ దేశాల ఏకపక్ష మొగ్గు తో కూడుకొన్న ఈ కాలాన్ని ''ఆయుధసాధిత శాంతియుగం'' అని కూడా వ్యవహరిస్తుంటారు.
 
రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు బలాబలాలు కలుపుకొని మిత్రదేశాలుగా ఒక వైపు పోరాడిన [[అమెరికా]], [[బ్రిటన్]], [[రష్యా]] లు శత్రుదేశాలైన [[జర్మనీ]], [[ఇటలీ]], [[జపాన్]] లను ఓడించాయి. కానీ యుద్ధం ముగుస్తూనే అమెరికా-బ్రిటన్ లకు, సోవియట్ యూనియన్ కు మధ్య తీవ్ర విభేదాలు పొడచూపాయి. అచిరకాలం లోనే ఇది అధిక పక్షం ప్రపంచ దేశాల వర్గ విభజనకు దారితీసేంతగా ఎదిగింది. రష్యా నాయకత్వంలో [[సామ్యవాద సామ్యవాదం।సామ్యవాద]] దేశాలన్నీ ఒక వర్గమైతే, అమెరికా వైపు [[పెట్టుబడిదారీ]] వ్యవస్థలన్నీ వత్తాసు పలికాయి[http://www.prabhanews.com/career/article-385605 1]
 
రష్యా, అమెరికా నేరుగా యుద్ధాలేవీ పోరాడక పోయినా, వ్యూహాత్మక ప్రణాళికలు, క్షిపణి మొహరింపులతో పొంచియున్న మరో భయంకర ప్రపంచయుద్ధాన్ని తలపింపజేస్తుండేవి. [[బెర్లిన్ ఘర్షణ]], [[కొరియా యుద్ధం]], సోవియట్ యూనియన్ అణుపాటవ పరీక్షలు, [[భారత్ చైనా యుద్ధం 1962]], [[క్యూబా క్షిపణి సంక్షోభం]] మొదలయిన అనేక సమస్యలు ఈ అంతర్గత ఒత్తిడిని రగులుస్తూ బహిర్గతం చేస్తూండేవి
"https://te.wikipedia.org/wiki/ప్రచ్ఛన్నయుద్ధం" నుండి వెలికితీశారు