ఉరుము నృత్యము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
==ఉరుము వాద్య నిర్మాణం==
ఈ ఉరుము వాద్యానికే [[వీరణం]] అని పేరు. చిత్తూరు జిల్లాలో వీరణం అనే వాద్యం ఉంది. కానీ వీరణానికి ఉరుముకు తేడా ఉంది. ఉరుము [[మద్దెల]] ఆకారంలో ఉంటుంది. ఒకటిన్నర అడుగుల వ్యాసార్ధం, రెండున్నర అడుగుల పొడవు ఉంటుంది. ఇత్తడి లేదా కంచు చేత తయారు చేస్తారు. మద్దెల లాంటి ఈ గొట్టానికి ఇరువైపులా మేక చర్మం బాగా శుద్ది చేసి అమర్చబడి ఉంటుంది. రెండువైపులా చర్మాలను బిగించేందుకు రెండు కడియాలు వేస్తారు. చర్మాలకు తాళ్ళ బిగింపు వళ్ళ మంచి బిగింపు వస్తుంది. ఖాదర కాయ చెట్టు పుల్లలను ఈ వాద్యాన్ని వాయించడానికి ఉపయోగిస్తారు. ఎడమచేతిలోని పుల్లతో రాపాడిస్తారు. ఎడమచేతిలోనిఎడమచేతి లోని పుల్లను జిగుపుపుల్ల అంటారు. కుడిచెతిలోనికుడి చెతిలోని పుల్లతో వాయిస్తారు. దీనిని కొట్టుడు పుల్ల అంటారు. ఎడమవైపు పుల్లతో రాపాడిస్తే బూర్ బూర్ బూర్ బూర్ అనే శభ్దం వస్తుంది. కుడివైపు పుల్లతో కొడితే డబు, డబు, డబు, డబు అనే శబ్ధం వస్తుంది.
 
ఉరుములోల్లు నిష్టాగరిష్టులు. వీరిలో నియమాలు ఎక్కువ. ఇంట్లో ఈత పరకలు వాడరు. [[ఈత చెట్టు]] క్రింద కూర్చోరు. కాళ్ళకు [[చెప్పులు]] ధరించరు. వీరు అక్కమ్మ దేవతను కొలుస్తారు. ఈమె [[గ్రామదేవత]]. ఉరుముల వాళ్ళను [[అక్కమ్మ దేవత]]కు ప్రతిరూపంగా భావిస్తారు. వీరు అక్కమ్మ దేవత సృష్టి అని చెప్పడానికి ఒక కథ ఉంది.
 
[[శివుడు]] తన తలలోని నాలుగు [[జడపాయ]]లను నాలుగు లోకాలకు విస్తరిస్తాడు. నాగలోకంలోని అక్కమ్మ శివుని జడను చూసి ఈ జడయే ఇంత సుందరంగా ఉంటే కైలాస సౌందర్యం ఎలా ఉంటుందోనని ఆ జడ ద్వారా కైలాసం చేరుకుంటుంది. పార్వతి పరమేశ్వరులు అక్కమ్మను భూలోకం ఏలుకోవడానికి అనుమతి ఇస్తారు. అక్కమ్మ పంచాంగం అడగడానికి పాల కొండమల దగ్గర ఉన్న బ్రహ్మ ముని దగ్గరకు పోతుంది. బ్రహ్మ ముని భయపడి గుహలో దాక్కుంటాడు. అక్కమ్మ పిలిచినా బ్రంహముని పలకడు. అక్కమ్మ మట్టి తో రెండు బొమ్మలను చేసి వాటికి ప్రాణం పోసి సింగరయ్య, సోమన్న అని పేర్లు పెట్టి వేపమాను తొలిపించి మేకచర్మంతో రెండువైపుల మూయించి కుదురుపుల్లలతోకుదురు పుల్లలతో వాద్యాన్ని వాయించమని పురమాయించిందని, ఆ వాద్యాల ద్వనులు ఓంకారంలా ద్వనించి ఉరుములా వినిపిస్తే బ్రహ్మ ముని బయటకు వచ్చాడని సింగరయ్య, సోమన్నలకు అక్కమ్మ బీజాక్షరాలను ప్రసాదించిందని కధ.
 
==వాయిద్యపు తీరు==
వాయిద్యాన్ని ఈ విధంగా ప్రారంభిస్తారు:
"https://te.wikipedia.org/wiki/ఉరుము_నృత్యము" నుండి వెలికితీశారు