ఉరుము నృత్యము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
ఉరుముల వారిని అక్కమ్మ దేవతల ప్రతిరూపంగా భావిస్తారు. దైవ సమానంగా భావించి ఆ దేవతలను పూజించే సమయంలో వారి కాళ్ళు కడిగి పాదాభివందనం చేస్తారు. నిండు కుండలోని అన్నం ఇంటి ముందుకొచ్చిన ఉరుములోల్లకు భోజనం పెడ్తారు. ఉరుములోల్లు బీజాక్షరాలతో వారిని దీవించడం కనిపిస్తుంది. ఈ బీజాక్షరాల వాక్కులు మూడు. 1. [[అమృత వాక్కు]] 2. [[విషవాక్కు]] 3. [[వేదవాక్కు]].
==రాయల కాలంలో==
[[విజయనగర సామ్రాజ్యం|విజయనగర సామ్రాజ్య]] కాలంలో వీరికి మాన్యాలు ఇచ్చినా కాలక్రమేణా అంతరించి పోయి, ప్రస్తుతం కుల వృత్తిని నమ్ముకుంటూ పొట్ట గడవని స్థితిలో డెబ్బై కుటుంబాల దాకా ఉరుములవారు [[అనంతపురం]] జిల్లాలో వున్నారు. వీరిని [[ఉరుములోళ్ళు]] అని కూడ పిలుస్తారు. వీరు [[మాల]] తెగలో ఎక్కువగా వున్నారు. [[ఉరుము]] అనబడే చర్మ వాయిద్యం ప్రాచీనమైంది. ఆదిమ జాతుల నర్తన రూపంలో వలయాకార విన్యాసాలు చేస్తూ ఉరుములతో భయంకర మైన శబ్దాలు సృష్టిస్తూ, వీరు చేసే నాట్య అతి గంభీరంగా వుంటుంది.ఉరుముల వాయిద్యం ఒకే సారి ఏక ధాటిగా వాయిస్తే కారు మొయిళ్ళు ఉరుములతో పయనిస్తున్నట్లు భ్రమ వ్వక్తమౌతుందివ్వక్త మౌతుంది. అందుకే ఆ వాయిద్యానికి ఉరుము అని పేరు పెట్టారేమో ననిపిస్తుంది. ఒక చేత అరీరణం యొక్క చర్మాన్ని ప్రేము పుల్లలతో రాస్తూ ఈ శబ్దాలు సృష్టిస్తారు. మరో చేతితో పుల్లతో లయ విన్యాసాలు తాళ యుక్తంగా సాగుతాయి. వీరి ఆరాధ్య దైవం శ్రీశైల మల్లన్న. ఆయన మహాత్య్వ గాథలు ఉరుముపై దరువులు వేస్తూ గాన చేస్తారు. చరణానికి చరణానికీ మధ్య ముక్తాయింపుల్తో గంభీరమైన శబ్దాలు సృష్టించి వలయాకార విన్యాసాలు చేస్తారు:
 
==ఉరుము వాద్య నిర్మాణం==
"https://te.wikipedia.org/wiki/ఉరుము_నృత్యము" నుండి వెలికితీశారు