కోటిలింగాల: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q6434046 (translate me)
పంక్తి 5:
ఈ కోట గోడలు గోదావరి నది ఒడ్డు వెంబటి తూర్పు పడమరగా, మరియు పెద్దవాగు ఉత్తర దక్షిణములుగా దాదాపు 300 మీటర్ల ఆనవాళ్లను బట్టి తెలియుచున్నది. ఇక్కడ పురావస్తు శాఖ వారు రెండు సార్లు త్రవ్వకాలు జరిపారు. మొదట 1979 నుండి 1984 వరకు, రెండవసారి ఫిబ్రవరి 2009లో జరిగాయి. మొదటిసారి 1979లోత్రవ్వకాలు జరిపినపుడు ఈ ప్రాచీన నగరం బయల్పడింది.
==చరిత్ర==
మూడూ దశాబ్దాల క్రితం చారిత్రక పట్టణంగా వెలుగులోకి వచ్చిన కోటిలింగాల శాతవాహనుల రాజధానిగా చారిత్రక పరిశోధకులు భావించారు. క్రమక్రమంగా త్రవ్వకాలలో లభించిన ఆధారాలను బట్టి ఇదే శాతవాహనుల తొలి రాజధానిగా నిర్థారించారు. కోటిలింగాలలో లభించిన శ్రీముఖుని నాణేలు వారి రాజధాని కోటలింగాల అని నిరూపించినట్లు ప్రముఖ చారిత్రక పరిశోధకుడు రాజారెడ్డి వాదించగా ఇది నిస్సందేహంగా శాతవాహనులూ రాజధాని అని ఏటుకూరి బలరామయ్య అన్నాడు.<ref>తెలంగాణ చరిత్ర, డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 42</ref> పైఠాన్, ధాన్యకటకంలకు ముందు ఇదే శాతవాహనులకు రాజధానిగా పనిచేసిందని జైశెట్టి రమణయ్య, శాతవాహనుల జన్మభూమి తెలంగాణయే అనే విషయంలో సందేహానికీ రావులేకుండా పోయిందని శ్రీరామశర్మ, శాతవాహనులు తొలుత కోటిలింగాలలోనే రాజ్యమొనర్చినారని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు బి.ఎన్.శర్మ వివరించారు.malayasri
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కోటిలింగాల" నుండి వెలికితీశారు