సన్ రైజర్స్ హైదరాబాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 78:
|}
==2013 [[ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20]]==
'''అర్హత పోటీ 1:''' చాంపియన్స్ లీగ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సీఎల్‌టి20 అర్హత మ్యాచుల్లో భాగంగా 2013 సెప్టెంబరు17, మంగళవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో కందురతా మారూన్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కందురతా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 168 పరుగులు చేసింది.
 
'''అర్హత పోటీ 2:'''పీసీఏ స్టేడియంలో 2013 సెప్టెంబరు 18, బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 7 వికెట్ల తేడాతో ఫైసలాబాద్ వోల్వ్స్‌పై నెగ్గింది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఫైసలాబాద్ వోల్వ్స్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు అమ్మర్ (31), అలీ (16) 48 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చినా... మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కెప్టెన్ మిస్బావుల్ హక్ (40 బంతుల్లో 56 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో కనీసం ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. సన్‌రైజర్స్ బౌలర్లంతా సమష్టిగా రాణించారు.
 
'''అర్హత పోటీ 3:''' సన్‌రైజర్స్ జోరుకు పగ్గాలు వేస్తూ 2013 సెప్టెంబరు 20 ,శుక్రవారం మొహాలీలో జరిగిన చివరి మ్యాచ్‌లో ఒటాగో వోల్ట్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ రెండు జట్లు ఇప్పటికే ప్రధాన మ్యాచ్‌లకు అర్హత సాధించడంతో ఎలాంటి ప్రాధాన్యత లేని ఈ మ్యాచ్‌లో రైజర్స్ విఫలమైంది. ఈ గెలుపుతో క్వాలిఫయింగ్‌లో వోల్ట్స్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ నెగ్గినట్లయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 143 పరుగులు చేయగా, ఒటాగో 16.2 ఓవర్లలో 5 వికెట్లకు 144 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ ధావన్ (10 బంతుల్లో 12; 1 సిక్స్)తో పాటు పార్థివ్ (12 బంతుల్లో 12; 2 ఫోర్లు), సమంత్రే (8) వెంట వెంటనే వెనుదిరగడంతో రైజర్స్ 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
 
==బయటి లంకెలు==