వికీపీడియా:మొలక: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
మామూలుగా, మొలకల నామకరణ విధానం ఇలా ఉంటుంది ''విషయం-మొలక ''; మొలకల పూర్తి జాబితా కొరకు [[Wikipedia:Wikiproject Stub sorting/మొలకల రకాలు]] చూడండి. వ్యాసాలను మొలకలుగా గుర్తించేటపుడు, వీలయినంత ఖచ్చితంగా, నిర్దుష్టంగా చెయ్యండి —మిగిలిన సభ్యులకు మొలకను గుర్తించడంలో ఇది చాలా సహాయ పడుతుంది. ఒక వేళ వ్యాసం రెండు వర్గాల లోకి వసుంటే, రెండు టెంప్లేటులు వాడండి. రెండు కంటే ఎక్కువ వాడటం మాత్రం అంత మంచిది కాదు.
 
 
ఒక ప్రధాన వర్గమంటూ లేని మొలక మీకు కనిపిస్తే, దానికి ఒక వర్గాన్ని సృష్టించండి. మొలకకు టాగు తగిలించడం ఎంత ముఖ్యమో, వర్గాన్ని సృష్టించడం కూడా అంతే ముఖ్యమైనది. మొలక బాగా విస్తరించాక, పూర్తి స్థాయి వ్యాసం అయ్యాక, దాని మొలక టాగును తొలగించాలి.
 
మొలక సంబంధిత కార్య కలాపాలకు [[Wikipedia:WikiProject Stub sorting]] (shortcut [[WP:WSS]]) కేంద్ర స్థానం.
 
===ఒక చక్కని మొలక వ్యాసం ఎలా ఉండాలి===
 
ఒక మొలకను ప్రారంభించేటపుడు, దాని ప్రధాన ఉద్దేశ్యం విస్తరణ అని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. దానికి తగినట్లుగా, ఆ వ్యాసంలో విస్తరణకు వీలైనంత కనీస మాత్రపు సమాచరం ఉండే విధం గా చూడాలి. పుస్తకాల నుండి గానీ, [[YAHOO!]], [[Google]] వంటి సెర్చి ఇంజనుల నుండి గాని మీ తొలి సమాచారాన్ని సేకరించ వచ్చు. ఇతర మార్గాల నుండి సేకరించిన సమాచారాన్ని కూడా పొందు పరచ వచ్చు; ఆ సమాచారం సరి యైనదీ,[[Wikipedia:నిష్పాక్షిక దృక్కోణం|నిష్పాక్షికమైనది]] అయి ఉండాలి.
 
 
విషయాన్ని నిర్వచించడం తో మొలకను మొదలు పెట్టండి. కొన్ని సార్లు విషయాన్ని నిర్వచించడం అసాధ్యం; అటువంటప్పుడు విషయం గురించి స్పష్టమైన వివరణ ఇవ్వండి. ఉదాహరణకు ఆ స్థలం ఎందుకు ప్రసిధ్ధి చెందింది, ఫలానా వ్యక్తి గొప్పదనం ఏమిటి మొదలైనవి.
 
 
తరువాత, ఈ ప్రాధమిక నిర్వచనాన్ని విస్తరించాలి. ఇంతకు ముందు సూచించిన పధ్ధతుల ద్వారా తగినంత సమాచారాన్ని సేకరించవచ్చు. కొన్ని వాక్యాలు రాసిన తరువాత వాటిలోని పదాలకు సంబంధిత అంతర్గత లింకులు పెట్టాలి. అనవసరంగా, అతిగా లింకులు పెట్టవద్దు; ఏమైనా సందేహాలుంటే, సరిచూడు మీట నొక్కి, ఒక పాఠకుడి దృష్టి తో వ్యాసాన్ని చదవండి. లింకులు అవసరం లేదనిపించిన చోట పెట్టకండి.
 
 
వ్యాసాన్ని సమర్పించిన తరువాత అది ఎన్నో దశల గుండా ప్రస్థానం చెందుతుంది. ఎవరైనా సభ్యుడు దానిని విస్తరించవచ్చు, సరైన సమాచారం దొరికినపుడో, తీరుబడి గా ఉన్నపుడో మీరే దానిని విస్తరించవచ్చు.
 
 
 
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:మొలక" నుండి వెలికితీశారు