"చతుర్యుగాలు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
హిందూ సంప్రదాయముననుసరించి కొన్ని సంవత్సరములు కలిపి ఒక '''యుగము''' గా కాలమానము లెక్కింపబడుతున్నది. అలా '''లా నాలుగు యుగాలు''' చెప్పబడ్డాయి.
 
==యుగాలు, మహా యుగము==
 
దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును
==యుగాల మధ్య జరిగిన ఒక కధ==
 
[[భాగవతం]] ఏకాదశ స్కంధము నుండి [http://www.indiaheritage.org/rendez/article1.htm#image1]:
 
 
ఇప్పటి మన్వంతరము ఆరంభములో, అనగా స్వాయంభువు మన్వంతరములోని మొదటి మహాయుగంలోని సత్యయుగం మధ్యకాలంలో - శుర్యవంశపు రాజు కకుద్ముని కుమార్తె రేవతి అనే సుందరి. ఆయన తన జ్యోతిష్కుల మాటలు నమ్మలేక, తన కుమార్తెకు తగిన వరుని గురించి అడగడానికి, తన కుమార్తెతో కలసి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ దర్శనం కోసం షుమారు 20 నిముషాలు (అప్పటి కాలమానం ప్రకారం) వేచి ఉండవలసి వచ్చింది. దర్శనం తరువాత కకుద్ముడు తన సందేహాన్ని చెప్పగా బ్రహ్మ నవ్వి, "నీవు వచ్చిన తరువాత 27 మహాయుగాలు గడచిపోయాయి. కనుక నీవు మనసులో ఉంచుకొన్న వరులెవ్వరూ ఇప్పుడు జీవించి లేరు. ప్రస్తుతం భూలోక వాసులు [[కృష్ణావతారము|శ్రీకృష్ణభగవానుని]] అవతారంతో పునీతులౌతున్నారు. నీవు తిరిగి భూలోకానికి వెళ్ళి నీ కూతురుకు కృష్ణుని అన్న [[బలరామావతారము|బలరామునితో]] వివాహం జరిపించు అని చెప్పాడు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/91686" నుండి వెలికితీశారు