బందగి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''షేక్ బందగి''' భూమి కోసం, భుక్తికోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం [[తెలంగాణ]] రైతాంగ సాయుధ పోరాటం సల్పిన గొప్ప పోరాట యోధుడు.
 
[[వరంగల్ జిల్లా]] [[దేవరుప్పుల]] మండలం కామాడ్డి గూడెంకు చెందిన ఈయన రజాకార్ నాయకుడు. ,60 ఊళ్లకు భూస్వామి అయిన విస్నూర్ దేశ్‌ముఖ్ రాపాక రాంచంవూదాడ్డిపై సాహసోపేతంగా పోరాడి అనూహ్య విజయం సాధించాడు.కామారెడ్డి గూడెంలో బందగీకి కొంత వ్యవసాయ భూమి ఉండేది. తన పాలివాడు అయిన ఫకీర్ ఆహ్మద్ బందగీ భూమిపై కన్నేసి దానిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించాడు. ఇతడు విస్నూర్ దేశ్‌ముఖ్ అనుచరుడు. బందగీ ఎదురు తిరగడంతో ఫకీర్ ఆహ్మద్ దేశ్‌ముఖ్‌కు ఫిర్యాదు చేశాడు.
 
దేశ్‌ముఖ్ ఫకీర్ ఆహ్మద్‌కు భూమి ఇవ్వాలని బందగీని బెదిరిస్తూ వచ్చాడు. బందగీ ససేమిరా ఇవ్వనంటూ జనగామ కోర్టులో సివిల్ కేసు వేశాడు. అయితే జులై 17, 1941లో [[జనగామ శాసనసభ నియోజకవర్గం|జనగామ]] తాలూకా మేజివూస్టేట్ తీర్పు వెల్లడించాల్సి ఉంది. తీర్పును ముందే పసిగట్టిన దేశ్‌ముఖ్ బందగీని చంపమని తన కిరాయి మూకలను పురమాయించాడు. జనగామ-సూర్యాపేట రహదారిలోని బస్టాండ్‌కు నడుచుకుంటూ వెళుతున్న బందగీని అంతకు ముందే మాటు వేసిన దేశ్‌ముఖ్ గూండాలు గొడ్డళ్లతో దాడి చేసి, కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. నమ్మిన న్యాయం కోసం ఏ సంఘం అండలేకుండా ప్రాణాలకు తెగించి, రజాకార్ నాయకుడైన విస్నూర్ దేశ్‌ముఖ్‌పై విజయం సాధించి వీర మరణం పొందిన బందగీ తెలంగాణ బిడ్డలకు చిరస్మరణీయుడైనాడు.
"https://te.wikipedia.org/wiki/బందగి" నుండి వెలికితీశారు