మహమ్మద్ ఖదీర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 55:
*మన్ చాహే గీత్- పాటలు ప్రసిద్దుల పరిచయాలు,
*న్యూ బాంబే టైలర్స్ (కథల సంపుటి) (1 edition -published ఫిబ్రవరి 15, 2012)
*బియాండ్ కాఫీ (కథల సంపుటి)(1 edition -published August 2013)
 
===దర్గామిట్ట కతలు===
 
ఇందులో ఇరవై ఐదు కథలున్నాయి నూట నలభై
పంక్తి 219:
 
నయాబ్‌ కుటుంబం పడిన హింస. అనుభవించిన బాధ. జరిగిన హాని. ఎవరు బాధ్యుల? ఎవరు జవాబుదారీ వహిస్తారు? ఇవీ షకీల్‌ అడగయే అడుగుతున్న ప్రశ్నలు. సభ్యసమాజం జవాబీయవలసిన ప్రశ్నలు. “ఈ దేశంలో కొందరు ఐడెంటీ చూపలేరు. అలాగని ఐడెంటిటీలేని వారుగా కూడా బతకలేరు. అందుకనే ఒక్కోసారి వాళ్ల ఐడెంటీయే వాళ్లకు ప్రమాదం తెచ్చిపెడుతూ వుంటుంది’! ఇదీ “గెట్‌ పబ్లిష్‌డ్‌’ కథానికకు ఇతివృత్త కేంద్రకం.
 
===బియాండ్ కాఫీ (కథల సంపుటి)===
బియాండ్ కాఫీ: <ref> [http://beditor.com/telugu-stories/421-khadeer-babu-beyond-coffee-reviews ఖదీర్ బాబు-బియాండ్ కాఫీ కథల సంక్షిప్త వివరణ విశ్లేషణ-రివ్యూలు ]</ref>ఇందులో పది డైరెక్ట్ కథలు (ఏ పత్రికలోనూ అచ్చు కానివి) వున్నాయి.(కొన్ని కథలు సంక్షిప్తంగా)
 
*'''ఆస్తి:''' మంత్రాలూ,తంత్రాలూ, మాయలూ, తాయెత్తులూ, మూలికలూ అంటూ ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకునే హుజూర్ లాంటివారు తమ ఆటలు సాగని చోట ఎలా లౌక్యంగా వ్యవహరిస్తారో మొదటి కథ ఆస్తిలో తెలుస్తుంది. డ్రగ్సుకు అలవాటు పడి చివరకు తన మగతనాన్నే కోల్పోయిన ఒక ధనవంతుడు, అతని చేతకానితనాన్ని ఆసరగా చేసుకుని అతని ముందే అతని డ్రైవర్‌తో సంబంధం పెట్టుకుని కులికే భార్య, పరువు ప్రతిష్టల కోసం, మనవడి కోసం కోడల్ని సహిస్తున్న అత్తగారు ఈ కథలో మనకు తారసపడతారు.
 
*'''ఘటన:'''తరువాతి కథ పేరు ఘటన. ఒక ముసలాడు తప్పతాగి రోడ్డుకు అడ్డంగా నడుస్తూ కారు క్రింద పడతాడు. ఆ కారు నడుపుతున్న కుర్రాడు ఆయన్ని హాస్పెటల్లో చేరుస్తాడు. విషయం తెలుసుకున్న ముసలిది హాస్పెటల్‌కు వచ్చి మొగుడిపై ఉన్న కోపాన్ని అక్కడున్న వాళ్ళపై ప్రదర్శిస్తూ చెడామడా దులిపి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ కుర్రాడు ఎలాగో ఆవిడను కన్విన్స్ చేసి మళ్ళీ హాస్పెటల్‌కు పంపుతాడు. మొగుడి పలకరింపుతో ఆమె కరిగిపోతుంది. ఇదీ కథ. ఎన్ని గొడవలున్నా దంపతుల మధ్య ఆప్యాయతలు అనేవి ఉంటాయని ఈ కథ నిరూపిస్తుంది. స్త్రీలకున్న క్షమించే గుణాన్ని కూడా ఈ కథ తెలియజేస్తుంది.
 
*'''టాక్ టైం:'''ఒంటరితనంతో నరకాన్ననుభవించే ఓ ధనిక కుటుంబ స్త్రీ ఆ 'బోర్' నుండి తప్పించుకోవడానికి అపరిచిత పురుషులకు ఫోన్ చేసి విసిగించే వైనం టాక్ టైం కథలో చూడవచ్చు. An idle mind is devil's workshop అనే నానుడికి ఈ కథ ఒక ఉదాహరణ.
 
*'''వహీద్, మచ్చ, ఏకాభిప్రాయం:'''ఒక పిల్లవాడు తనపై ఆప్యాయతను చూపే పక్కింటి అమ్మాయి(అక్క)పై అభిమానాన్ని పెంచుకోవడం, ఆ అమ్మాయి పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతే వాడిలో కలిగే మథనం వహీద్ అనే కథలో కన్పిస్తుంది.
ఎదుటివాళ్లనే కాదు ఒక్కోసారి మనల్ని కూడా మనం క్షమించుకోవాలి మనస్ఫూర్తిగా' అని మచ్చ అనే కథలో సందేశమిస్తాడు రచయిత.
మంచి మాటలతో వినయం నటిస్తూ తారసపడిన స్త్రీలను వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని లొంగదీసుకునే ఓ మగాడి కథ ఏకాభిప్రాయం.
 
*'''పట్టాయ:'''ఇక తరువాతి కథ పేరు పట్టాయ. పట్టాయ అంటే ఒక పట్టాన అర్థం కాలేదు. గూగుల్లో శోధిస్తే అది థాయ్‌లాండ్ దేశంలో ఒక నగరం పేరు అనీ, మసాజ్ సెంటర్లకూ, బార్లకూ, వ్యభిచారానికీ ఫేమస్ అనీ తెలిసింది. ఈ కథలో అక్కడకు వెళ్ళేవారి ఆకలి గురించీ,అక్కడ పడుపువృత్తిలో ఉన్న వారి ఆకలి గురించీ వర్ణిస్తున్నాడు రచయిత. అదేంటోగానీ ఈ కథ చదివితే పడుపు వృత్తిలో ఉన్నవారిపై మనకు జాలి కలుగదు.
 
*'''ఇంకోవైపు.అపస్మారకం:''' అపస్మారకం అనే కథలో ఓ సాఫ్టువేర్ ఉద్యోగి ఓ టీకొట్టు అమ్మాయిని ముగ్గులోకి దింపుతాడు అపస్మారకం కథలో. 'టూ మినిట్స్'కోసం సిద్ధపడుతుండగా అనుకోని సంఘటనలు ఎదురై తను పాల్పడిన నీచానికి సిగ్గుపడుతూ, జ్వరంలో వున్న తన బాబు గురించి కంగారు పడుతూ చివరకు స్మారకంలోకి వస్తాడు అతడు.
భర్తకు విడాకులు ఇవ్వడానికై లాయర్‌ను సంప్రదించబోయి ముప్పయ్ రెండేళ్ల స్త్రీ ఒక సమస్య వల్ల సతమతమవుతూ సామూహిక మానభంగానికి గురవుతుంది ఇంకోవైపు అనే కథలో.
 
*'''బియాండ్ కాఫీ:'''చివరి కథ పేరు బియాండ్ కాఫీ. అదొక రెస్టారెంట్ పేరు. ఆ రెస్టారెంట్‌లో ఒక స్త్రీ పరిచయమౌతుంది రచయితకు. తన భర్త పైన కంప్లయింట్స్ చెబుతూ అతడిని అభాసుపాలు చేయడానికి ప్లాన్ అడుగుతూ ఉంటుంది రచయితని. భర్త కూడా తన భార్య మ్యాడ్ అనీ ఆవిడ మాటలు నమ్మవద్దనీ నమ్మితే డేంజర్లో పడతారనీ హెచ్చరిస్తూ ఉంటాడు. ఇద్దర్లో ఎవరిని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో చివరి దాకా సస్పెన్స్ కొనసాగించాడు ఈ కథలో.
 
== సూచికలు==
"https://te.wikipedia.org/wiki/మహమ్మద్_ఖదీర్_బాబు" నుండి వెలికితీశారు