వంకాయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 78:
(Brinjal mealy bug) ఒక జాతి పిండిపురుగు. (phenacoccus insolitus ) మొక్కల లేత భాగములకు బట్టి యందలి రసమును పీల్చుకొనును. ఇది చురుకుగ ఎదుగు మొక్కలను సామాన్యముగ పట్టదు. ఎపుడైన అచటచట ఒక మొక్కకు బట్టినచో అట్టి మొక్కలను కనిపెట్టి వెంటనే లాగివ్యవలెను. చాలా మొక్కలను బట్టినచో 0.05% పారాథియాను చిమ్మవలెను. కాయలు ఏర్పడియున్నచో నువాను చల్లవచ్చును. సామాన్యముగ ఈ చీడ కాపు ముగిసి మరళ విగుర్చు ముదితోటలలోని లేతకొమ్మలకే పట్టును. డి.డి.టీ. చల్లిన పిమ్మట ఈ పురుగులు అధికమగును. క్రిస్టోలీమసు అను పెంకుపురుగులను తెచ్చివివ్డిచినచో అవి పిండిపురుగులను అదుపులో ఉంచును.
 
===వెర్రితల రోగము===
వంగ తోటలకు వచ్చు తెగుల్లలో వెర్రితల రోగము ముఖ్యము. ఇది సూక్ష్మదర్శని సహాయముననైనను కంటికి అకానరాని వైరసువలన వచ్చు తెగులు. ప్రథమ దశలో తెగులుబట్టిన కొమ్మలను హెచ్చుగ బట్టిన యెడల మొక్కలను తీసివేసి తగులబెట్టవలెను. ఈ వీఇరసును ఒక మొక్కనుండి మరియొక దానికి మోసుకొనిపోవు జాసిడులవంటి పురుగులను డి.డి.టి. చల్లి నివారించుటచే ఈ తెలుగుయొక్క వ్యాప్తిని అరికట్టవచ్చును.
 
ఈ తెలుగు తట్టుకోగల వంగడములు వాడుట శ్రేష్టము.
 
==వంటకములు==
 
"https://te.wikipedia.org/wiki/వంకాయ" నుండి వెలికితీశారు