పత్రము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 53:
==లఘు, మిశ్రమ, విభిన్న పత్రాలు==
జామ, తొగరు, రావిఆకు లందువలె కొన్ని ఆకులకొక పత్రమేకలదు. అట్లున్నయెడల లఘుపత్రమందుము. చిక్కుడాకులోవలె కొన్ని కలిసియున్న యెడల నది మిశ్రమ పత్రము. ఒకటి మిశ్రమపత్రమో, కొమ్మయో నిర్ధారణ చేయుటకు అది ఏ ఆకు కణుపు సందులో నైన పెరుగుచున్నదో, దాని మీదనున్న ఆకుల కణుపు సందులలో మొగ్గలేమైనా గలవూ చూడవలెను. తుమ్మాకును తురాయి ఆకును మిశ్రమ పత్రములేకాని తురాయి తుమ్మ ఆకులలో పెద్దాకు రెండుసారులు విభజితమైయున్నది. కావున వీనిని ద్విభిన్న పత్రమందుము. ఇట్లే మూడుసారులు విభజితమై యున్నయెడల త్రిభిన్న మనియు, ఇంక నెక్కువసారులు విభజించియున్న యెడల బహుభిన్నపత్రమనియు నందుము. మిశ్రమ పత్రములందున్న చిన్నచిన్న ఆకులను చిట్టి ఆకులందుము. వేపాకులో చిట్టి ఆకులు జతలు జతలుగా ఉండి చివరన ఒకటి కలదు, ఆకుల సంఖ్య బేసి. తురాయి ఆకులో అన్నియు జతలు జతలు గానేయున్నవి, ఆకుల సంఖ్య సరి. కావున తురాయి ఆకును సమభిన్నపత్రమనియు, వేపాకును విషమభిన్నపత్రమనియు చెప్పుదుము. వేపాకు, చింతాకు, తురాయి ఆకులలో చిట్టి ఆకులు మధ్యనున్న కాడకు రెండు ప్రక్కల పక్షి రెక్కల మీదనున్న ఈకలవలె ఉండుటచే ఆ ఆకును పక్షివైఖరిగ ఉన్నదందుము.
== పత్ర విన్యాసం ==
|