కురుక్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 61:
తూర్పున పంచపాండవులు, మధ్యభాగంలో శ్రీక్రిష్ణ, ఆంజనేయులు ఉంటారు. దక్షిణ భాగంలో దుర్గామాత, శ్రీలక్ష్మీనారయణ మరియు బాబా శ్రవణ్ నాధ్‌ల విగ్రహాలు ఉంటాయి.
* సర్వేశ్వర మహాదేవ మందిరం. కురుక్షేత్ర సరోవరం మధ్యభాగంలో ఉన్న సర్వేశ్వర మహాదేవ మందిరం చేరుకోవడానికి చిన్నపాటి వంతెన నిర్మితమై ఉన్నది. బాబా శ్రవణ్ నాధ్ నిర్మించిన ఈ మందిరంలో ఐదు శిఖరాలతో కూడిన ఐదు మందిరాలు ఉన్నాయి. ప్రధానాలయంలో శివలింగం, శివ, పార్వతి, గణపతి, నంది విగ్రహాలు ఉంటాయి. మరొక భాగంలో నారాయణుడు, గరుత్మంతుడు ఉండగా ఇతర భాగాలలో హనుమాన్, మాహామాయ, రాఫ్హాక్రిష్ణుల విగ్రహాలు ఉంటాయి. కుంతీదేవి ఈ మందిరంలో శివుని స్వర్ణకమలాలతో పూజించిందని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.
* గోరక్షనాధ్ మందిరం. బ్రహ్మసరోవరం ఎదుట గోరక్షనాధుని మందిరం ఉంది. నాధ సంప్రదాయం అనుసరించి మందొరంలో గురుగోరక్షనాధుడి విగ్రహం ఉంది. ఇక్కడ యాత్రికులు విశ్రమించడానికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయి. గ్రహణ సమయాలలో స్నానం ఆచరించడానికి వచ్చే సాధువులు అనేకమంది ఇక్కడ విశ్రమిస్తుంటారు.
*
 
"https://te.wikipedia.org/wiki/కురుక్షేత్రం" నుండి వెలికితీశారు