కురుక్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

991 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
పంక్తి 53:
బ్రహ్మసరోవరం వద్ద స్నానం ఆచరిస్తే అశ్వమేధయాగం చేసిన పుణ్యం లభిస్తుందని ప్రతీతి. బ్రహ్మసరోవరం వద్ద అనేక మంది యాగాలు నిర్వహించారు. ప్రచీన బ్రహ్మసరోవరం సువిశాలమైనది. ప్రస్థుతం కురుక్షేత్రం అభివృద్ధి బోర్డ్ అనేక వ్యయప్రయాసలకోర్చి పురాతన సరసులో మూడవ భాగం సరసును తిరిగి నిర్మించారు. దేశంలోని హిందూపుణ్య క్షేత్రాలలోని విశాలమైన సరసులలో ఇది ఒకటని భావించబడుతుంది. ఈ సరోవరం పొడవు 3,600 అడుగులు వెడల్పు 12,00 అలాగే లోతు 15 అడుగులు ఉంటుంది. చక్కని స్నానఘట్టాలు, యాత్రికుల భద్రత కొరకు రైలింగ్ అలాగే స్త్రీలకు ప్రత్యేక స్నానఘట్టాలు ఉన్నాయి. సరసు మధ్యలో సర్వేశ్వర్ శివమందిరం ఉంది. దీనిని 17వ శతాబ్ధంలో మహంత్ శ్రవణనాధ్ నిర్మించారని విశ్వసించ్బడుతుంది. ఈ సరసులో గ్రహణసమయాలలో షుమారుగా ఒకేసారి 5 లక్షలమంది స్నానం చేయడానికి వీలౌతుంది. ఈ కాలువకు అవసరమైన జలాలు భజ్రానంగల్ కాలువ నుండి సరఫరా చేయబడతాయి.
గతదశాబ్ధకాలంగా నిర్మానుష్యంగా ఉన్న ఈ క్షేత్రానికి ఇప్పుడు భక్తులరాక అభివృద్ధి అయింది. మిగిలిన భాగం కూడా త్రవ్వి రైలింగ్ స్నానఘట్టాలు, మరియు ప్రదక్షిణ మార్గం ఏర్పాటు చేసే ప్రణాళికలు పూర్తి అయ్యాయంటే పూర్తిగా స్నానఘట్టాలు కలిగిన సరసులలో ప్రపంచంలోనే ఇది మొదటి స్థానంలో ఉంటుంది.
== ముఖ్యమైన మందిరాలు ==
== సన్నిహిత సరోవరం ==
* సన్నిహిత సరోవర తీరంలో పలు మందిరాలు ఉన్నాయి. వాటిలో శ్రీలక్ష్మీనారాయణ మందిరం ఒకటి. సరోవరానికి పశ్చిమాన ఉన్న ఈ మందిరంలో లక్ష్మీనారాయణుల సుందర ప్రతిమ ఉంటుంది. యాత్రీకులు విశ్రమించడానికి సౌకర్యాలు ఉన్నాయి. ఈ మందిరాన్ని సిద్ధ శివగిరిబాబా నిర్మించినట్లు విశ్వసిస్తున్నారు.
* సన్నిహిత సరోవరానికి సమీపంలో బబాకాలీ కమలీ క్షేత్రం ఉంది. ఇక్కడ క్రిష్ణ, అర్జున, శివుని సుందరశిల్పాలు ఉన్నాయి. ఇక్కడ యాత్రీకులు విశ్రమించడానికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయి.
పంక్తి 62:
* సర్వేశ్వర మహాదేవ మందిరం. కురుక్షేత్ర సరోవరం మధ్యభాగంలో ఉన్న సర్వేశ్వర మహాదేవ మందిరం చేరుకోవడానికి చిన్నపాటి వంతెన నిర్మితమై ఉన్నది. బాబా శ్రవణ్ నాధ్ నిర్మించిన ఈ మందిరంలో ఐదు శిఖరాలతో కూడిన ఐదు మందిరాలు ఉన్నాయి. ప్రధానాలయంలో శివలింగం, శివ, పార్వతి, గణపతి, నంది విగ్రహాలు ఉంటాయి. మరొక భాగంలో నారాయణుడు, గరుత్మంతుడు ఉండగా ఇతర భాగాలలో హనుమాన్, మాహామాయ, రాఫ్హాక్రిష్ణుల విగ్రహాలు ఉంటాయి. కుంతీదేవి ఈ మందిరంలో శివుని స్వర్ణకమలాలతో పూజించిందని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.
* గోరక్షనాధ్ మందిరం. బ్రహ్మసరోవరం ఎదుట గోరక్షనాధుని మందిరం ఉంది. నాధ సంప్రదాయం అనుసరించి మందొరంలో గురుగోరక్షనాధుడి విగ్రహం ఉంది. ఇక్కడ యాత్రికులు విశ్రమించడానికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయి. గ్రహణ సమయాలలో స్నానం ఆచరించడానికి వచ్చే సాధువులు అనేకమంది ఇక్కడ విశ్రమిస్తుంటారు.
* జయరాం విద్యా అందిరం. ఇది బ్రహసరోవర తీరలో ఉన్న గీతాభవనం, గుడియా మఠం మద్యన ఉన్నది. సుందరమైన ఈ భవనాన్ని దేవేంద్రస్వరూప్ భ్రహ్మచారి నిర్మించాడు.
*
ఇక్కడ దశావతారాల పాలరాతి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ భజనలు, హోమాలు జరుగుతుంటాయి. మందిరప్రవేశద్వారానికి ఇరువైపులా విష్ణుమూర్తి, భీష్మపితామహుల ప్రయిమలు ఉంటాయి. ఈ మందిరంలో ఒకప్పుడు వేదపఠనం జరిగేది. ఇక్కడ సంస్కృత పాఠశాల కూడా ఉంది.
 
== ప్రత్యేక ప్రదేశాలు ==
64,892

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/922968" నుండి వెలికితీశారు