కస్తూరి శివరావు: కూర్పుల మధ్య తేడాలు

221 బైట్లు చేర్చారు ,  15 సంవత్సరాల క్రితం
(తెలుగు సినిమా హాస్యనటులు)
శివరావు నాటకాల్లో హాస్యపాత్రలు ధరించాడు. పద్యాలూ, పాటలూ బాగా పాడేవాడు. హాస్యం మార్కుతో వున్న పాటలు గ్రామ ఫోన్‌ రికార్డులుగా ఇచ్చాడు. [[వరవిక్రయం]] (1939) సినిమాలో చిన్న వేషం వేసాడు శివరావు. [[చూడామణి]] (1941) సినిమాలో అతడు వేసిన మంగలిశాస్త్రి అనే వేషం జనం దృష్టిలో బాగాపడి, ‘శివరావు’ తెలిసాడు. తర్వాత తర్వాత అక్కడా అక్కడా చిన్నా, చితకా వేషాలు వేసినా, [[స్వర్గసీమ]] (1945) తో ఇంకా బాగా తెలిసాడు. [[బాలరాజు]] (1948) తో ఇంకా బాగా తెలిసి పెద్ద నటుడైపోయి, జనాన్ని వెంట పరిగెత్తించుకున్నాడు. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. అందులోని శివరావు నటనా, అతని పాటలూ ప్రేక్షకజనాన్ని బాగా ఆకర్షించాయి.
 
ఆ దశలోనే వచ్చిన [[గుణసుందరి కథ]], [[లైలా మజ్నూమజ్ను]], [[రక్ష రేఖరక్షరేఖ]], [[శ్రీలక్ష్మమ్మశ్రీ లక్ష్మమ్మ కథ ( ప్రతిభ)|శ్రీ లక్ష్మమ్మ కథ]], [[స్వప్న సుందరి]] ( అన్నీ 1949 విడుదలలే! ) మొదలైన చిత్రాలు పెద్ద హిట్లు కావడంతో శివరావును ప్రజలు అద్భుత హాస్య నటుడిగా కొనియాడారు. సినిమాలు, ఉత్సవాలు జరుపుకున్న సందర్భంలో తారలు అందరూ వెళ్ళితే, శివరావు వెంటా, దగ్గరా మాత్రం ఎక్కువమంది జనం గుమిగూడి కనిపించేవారు. [[గుణసుందరి కథ]] లో శివరావే కథానాయకుడు నిజానికి. ఆ చిత్రంలోని ఊతఓదం ‘గిడి గిడి’ తో జనసందోహం చేసిన సందడీ, గోలా ఆకాశం అంటేవి. 1950 లో శివరావు సొంతంగా సినిమా కంపెని ఆరంభించి, [[పరమానందయ్య శిష్యుల కథ (1950 సినిమా)|పరమానందయ్య శిష్యుల కథ]] హాస్య నటులతో తీసాడు. [[అక్కినేని నాగేశ్వరరావు|నాగేశ్వరరావు]] హీరో కాగా, హీరోయిన్‌గా, [[గిరిజ]]ను పరిచయం చేశాడు. అతనే దర్శకత్వం వహించాడు.
 
==వెలుగు తగ్గిన తార==
ప్రతి నిర్మాతా తన చిత్రంలో శివరావు వుండాలనీ, అతని కోసం పడిగాపులు పడేవారు. ఒక మహోన్నతమైన తారగా సినీవినీలాకాశంలో వెలిగిన శివరావు కాంతి - రాను రాను తగ్గసాగింది. "హాస్యనటులకి ఎప్పుడూ వుండేదే ఇది. ఒక దశలో మాత్రం గొప్పగా వెలిగిపోతారు" అని తెలిసినవాళ్లు అంటారు. [[రేలంగి]] శకం వచ్చిన తర్వాత శివరావు జోరు తగ్గింది. క్రమేణా సినిమాలూ తగ్గసాగాయి. ఐతే ఎవర్నీ వేషాలు ఇవ్వమని అడిగేవాడు కాదు. "అంత బతుకు బతికిన వాడిని, ఇప్పుడు దేహీ అనవలసిన అవసరం లేదు నాకు!" అని అతను మొండిపట్టుగా కూర్చోవడం - సినిమా నిర్మాతలకి నచ్చలేదు. దీనికి తోడు తాగుడు అలవాటు సినిమాలల్లో అవకాశాలను దెబ్బ తీసింది. ఐనా తర్వాత నాటకాల్లో నటించడం ఆరంభించాడు.
1,367

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/92401" నుండి వెలికితీశారు