ఉత్తర రామాయణం: కూర్పుల మధ్య తేడాలు

→‎రామరాజ్యం: ఇక్కడ ఉంచిన దస్త్రం అసందర్బంగా ఉన్నది. అందుకని తొలగించడమైనది
చి Wikipedia python library
పంక్తి 1:
 
అందరికీ బాగా తెలుసున్న [[రామాయణం|రామాయణ గాధ]] రాముడి జననం , సీతాకళ్యాణం తో మొదలై రాముడి అరణ్యవాసం , సీతాప హరణం, రావణ సమ్హారానంతరం శ్రీ రామ పట్టాభిషేకంతో ముగుస్తుంది. ఆ తరువాత కధకథ చాలా మందికి తెలిసేంతలా ప్రాచుర్యం కాలేదు. దానికి కారణం రామాయణం విషాదాంతం కావడమేమోనని పండితులు అంటుంటారు. రామాయణం రెండు భాగాలుగా ఉంది. శ్రీరామ జననం నుంచి పట్టాభిషేకం వరకు మొదటి భాగం. శ్రీ రామ పట్టాభిషేకం నుంచి నుంచి శ్రీ రామ నిర్యాణం వరకు రెండవ భాగం. ఈ రెండవ భాగాన్నే '''ఉత్తర రామాయణం''' అంటారు. ఈ ఉత్తర రామాయణాన్ని [[భవభూతి]] [[సంస్కృతం]]లో రాసాడు. ఆయన ఒక చోట కరుణ రసం ఒక్కటే రసం అని చెప్పాడు.
<poem>
పంక్తి 9:
</poem>
 
కరుణకు భావస్థాయి శ్లోకం. ఎందుకంటే [[వాల్మీకి]] మొదటి శ్లోకం (" మాన్నిషాద" ) కరుణ నుంచే ఉద్భవించింది. దాశరధీ కరుణా పయోనిధీ అని జనులు రాముడ్ని ప్రార్ధించడం అందుకే. ఈ ఉత్తర రామాయణంలో సీతా రాముల వియోగం, నిర్యాణం కారణంగా కరుణ రసం పతాక స్థాయిలో ఉంది. [[తిక్కన సోమయాజి]] [[నిర్వచనోత్తమ రామాయణం]] ( వచనం లేని , కేవలం పద్యకావ్యం) రచించాడు. తరువాత [[కంకంటి పాపరాజు]] ఉత్తర రామాయణాన్ని [[చంపూ కావ్యం]]గా రాసాడు. " జానకీఈ జాని కధల్కథల్ రచింపక యసత్కధలెన్నియసత్కథలెన్ని రచించెనేనియున్ ... వాని కవిత్వ మహత్త్వమేటికిన్?" అన్నాడు పాపరాజు. నిజంగానే [[కవి]] అనేవాడు రాముడి మాట తలవకుండా ఉండలేడు. అంత శక్తి ఆకర్షణా ఉన్నవాడు [[రాముడు]].
 
 
==ఉత్తర రామాయణం కధకథ==
===రామరాజ్యం===
శ్రీ రామ పట్టాభిషేకం తరువాత [[అయోధ్య]]లో అంతటా సుఖ సంతోషాలు వెల్లివిరిసాయి. శ్రీ రాముని పాలనలో ప్రజలు ఏ కష్టం లేకుండా సుఖంగా జీవనం సాగించేవారు. అందుకే ఇప్పటికీ శ్రేయో రాజ్య పరిపాలనకు రామ రాజ్యాన్ని ఉదాహరణగా వాడతారు. ఇలా ఉండగా ఒక రోజు రాముడు ఏకాంతసమయంలో సీతను చేరి" దేవీ! నీవు తల్లివి కాబోతున్నావు. నీ మనస్సులో ఏమైనా కోరిక ఉంటే చెప్పు. " అని అడిగాడు. అందుకు సీత " నాధా గంగా తీరంలో ఉన్న ముని ఆశ్రమాలలో పళ్ళు, కందమూలాలు ఆరగిస్తూ ఒక్కరోజు గడపాలని ఉంది. ": అంటుంది. అందుకు సరే నంటాడు రాముడు. కానీ సీత కోరిక వినగానే వ్యాకులచిత్తుడవుతాడు.
పంక్తి 18:
===సీత గురించిన నింద===
[[దస్త్రం:AN00127858 001 l.jpg|thumb|ఒక గ్రామములోని బావి దగ్గర రామ లక్ష్మణులు సీత]]
అక్కడనుండి సభామంటపానికి వెళ్ళిన రాముడిని విజయుడు, మధుమత్తుడు, కాశ్యపుడు, పింగళుడు, కుటుడు, సురాజు, మొదలైన వారు హాస్య కధలుకథలు చెప్పి రాముడిని సంతోషపరుస్తారు. రాముడు ప్రసన్నుడై భద్రునితో" భద్రా! నా పరిపాలన ఎలావున్నది? ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవుగదా? నిజం చెప్పు.?" అని అడుగుతాడు. అందుకు భద్రుడు" మహారాజా! సత్యసంధుడివైన నీకు నిజం చెప్తున్నాను. ప్రజలు నీ పరక్రమాలను, రావణ సంహారాన్ని వేనోళ్ల పొగడుతున్నారు. అయితే, రావణ చెరలో కొన్నాళ్ళు ఉన్న సీతను తిరిగి మీరు భార్యగా స్వీకరించడం గురించి మాత్రం రక రకాలుగా చెప్పుకొంటున్నారు. ఇలా అంటున్నందుకు నన్ను మన్నించండి" అన్నాడు. రాముడు సరేనని వారినందరిని పంపించి విషాదచిత్తుడై తమ్ముళ్ళను పిలిపిస్తాడు. వారు రావడంతోనే రాముని వదనం చూసి నిశ్చేష్టులవుతారు. రాముడు వారిని కూర్చోమని జరిగిన సంగతి అంతా వివరిస్తాడు. " లక్ష్మణా! సూర్య చంద్రులు, అగ్ని,ఇంద్రాది దేవతలు కూడా ఆమె సౌశీల్యాన్ని శ్లాఘించారు. కానీ ఆమెపై అయోధ్యలో ఇంకా అపవాదు తొలగలేదు. ప్రజాభీష్టం లేని పరిపాలన సూర్యుడులేని పగలు వంటిది. ఇప్పుడు నాకు ఆమెను పరిత్యజించడం తప్ప వేరు మార్గం కనపడ్డం లేదు. కొద్ది సమయం కిందటే [[సీత]] తనకు మున్యాశ్రమాలు చూడాలని కోరికగా ఉన్నదని కోరగా ఆమెకు సరే అని అనుమతిచ్చాను. నువ్వు మారు మాటాడక ఆమెను [[గంగానది|గంగానదీ]] తీరంలోని ఆశ్రమాల వద్ద వదిలిరా. ఇది నా ఆజ్ఞ" అంటాడు.
 
===అడవుల పాలైన సీత===
పంక్తి 37:
===రామాయణ గానం===
[[దస్త్రం:F1907.271.14.jpg|thumb|రాముని సభలో రామాయణమును గానము చేయుచున్న లవ కుశులు]]
మరునాటి ఉదయం లవకుశులు వాల్మీకి మునికి నమస్కారం చేసి, ఆయన ఆశీర్వాదంతో రామాయణ గానం అయోధ్య నలుదెసలా ఆరంభిస్తారు. ఆ గానామృత మాధుర్యానికి జనులు సమ్మోహితులై వారిని వెంబడిస్తారు. దేశం నలుమూలలా కుశలవుల గాన మాధుర్యం గురించే చర్చ జరుగుతూంది. రాముడు కూడా ఆ గానాన్ని విని ముగ్దుదౌతాడు. యజ్ఞకర్మ పూర్తి కాగానే ఒక సభను ఏర్పాటు చేసి మునులు, రాజులు, పండితులు, సంగీత విద్వాంసులు, భాషావేత్తలు, వేదకోవిదులు, సకలవిద్యాపారంగతులు ఆసీనులై ఉన్న సమయాన రాముడు కుశలవులను తమ గాన మాధుర్యాన్ని వినిపించమని కోరతాడు. మొదటి సర్గనుంచి ఇరవై సర్గలు వరకూ వారు అతి రమ్యగా గానంచేయగా సభాసదులు చప్పట్లు చరిచి వారి గాన మాధుర్యానికి జేజేలు చెప్తారు. రాముడు భరతునితో ఈ బాలురకు పద్దెనిమిదివేల బంగారు నాణేలు బహూకరించమని కోరగా లవకుశులు తమకు ఎలాణ్టి ధనమూ కానుకలూ అవసరం లేదని తిరస్కరిస్తారు. అప్పుడు రాముడు . మీరు పాడిన కావ్యం ఏమిటి? అని ప్రశ్నించగా లవకుశులు " దీని కర్త వాల్మీకి మహర్షి. ఇప్పుడాయన ఇక్కడే ఉన్నారు. ఆయనే మాగురువు. మీ చరిత్రనే ఆయన ఇరవై నాలుగువేల శ్లోకాలుగా వ్రాసాడు. దీనిలో 7 కాండాలున్నాయి. అయిదువందల సర్గలున్నాయి. వంద కధలున్నాయికథలున్నాయి. మీకంతగా కోరిక ఉంటే పాడి వినిపిస్తాం" అన్నారు.
 
===జానకీదేవి కళంక రహిత===
పంక్తి 56:
===లక్ష్మణుడి యోగ సమాధి===
[[File:Lava and Kusa, the sons of Rāma..jpg|thumb|300px|రాముని కుమారులైన లవ కుశులు]]
రాముడు యముని వడి వడిగా పంపి దుర్వాసునికి ఎదురేగి స్వాగతించాడు. దుర్వాసుడు తనకు ఆకలిగా ఉన్నదని మృష్టాన్నం కావాలనీ కోరాడు. ఆయనను కోరిక మేరకు తృప్తి పరచి తాను యముడికి ఇచ్చిన మాటను గుర్తుతెచ్చుకొని విచారించసాగాడు. లక్ష్మణుడు వచ్చి" అన్నా! నీవు మాట తప్పవద్దు. ఏ సంకోచమూ లేకుండా శిక్ష విధించి ధర్మాన్ని నిర్వర్తించు" అని ధైర్య చెప్పాడు. రాముడు నిలువెల్లా కుంగిపోతూ వశిష్ట, భరత , [[శతృఘ్నుడు|శతృఘ్నులను]] సమావేశ పరచి విషయం విని విచారించాడు. [[వశిష్టుడువశిష్ఠుడు]] " రాజా! ఆడి తప్ప రాదు. నీవు లక్ష్మణుడికి దేశ బహిష్కరణ విధించు." అన్నాడు. " సాధు పరిత్యాగం మరణసమానమవుతుంది కనుక నిన్ను బహిష్కరిస్తున్నాను." అన్నాడు. వెంటనే సౌమిత్రి తన ఇంటి వైపు కూడా చూడక సరాసరి సరయూ నది ఒడ్డువద్దకు చేరి యోగసమాధి అయ్యాడు. ఇంద్రుడు తన విమానంలో అతన్ని [[అమరావతి]]కి తీసుకుకుపోయాడు. విష్ణు అంశలో నాల్గవభాగం తమ దగ్గరకు వచ్చినందుకు దేవతలు సంతోషించారు.
 
 
లక్ష్మణుడికి దేశ బహిష్కారం చేసాక భరతుని రాజుగా చేసి తాను కూడా వెళ్ళి పోతానని ప్రకటించాడు శ్రీ రాముడు. ఈ మాట విని యావత్తు రాజ్యం దుఃఖించింది. భరతుడయితే మూర్చపోయాడు. కొంతసేపటికి తేరుకొని భరతుడు" అన్నా! నువ్వులేని రాజ్యం నాకెందుకు? నిన్నువదిలి నేనుండలేను. కోసల రాజ్యం రెండుభాగాలు చేసి దక్షిణం [[కుశుడు|కుశుడికి]] ఉత్తరం [[లవుడు|లవుడుకి]] ఇచ్చేద్దాం. ఇదే ధర్మబద్ధం . వెంటనే శతృఘ్నునికి కబురుపెడదాం. " అన్నాడు. వరసగా జరుగుతున్న ఘటనలు ప్రజలకు దిగ్భ్రాంతి కలిగించాయి. వశిష్టుడువశిష్ఠుడు " రామా! ప్రజల అభీష్టాన్ని కూడా తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి"" అన్నాడు. రాజు ప్రజలతో సభ జరిపి "నా నిర్ణయం రాజ్యాన్ని త్యజించి పోవడం. మీ నిర్ణయం ఏమిటి?" అని అడిగాడు. "ప్రభూ మీ నిర్ణయమే మాకు శిరో ధార్యం. తమతో పాటు అనుసరించాలని మాలో చాలా మందికి ఉన్నది. అందుకు అనుమతించండి. అదే మాకోరిక" అన్నారు. రాముడు సరేనన్నాడు.
 
===రాముని నిర్ణయం===
[[దస్త్రం:"Rama Receives Sugriva and Jambavat, the Monkey and Bear Kings", Folio from a Ramayana.jpg|thumb|left|వానరులతో మాట్లాడుతున్న రాముడు]]
ఆరోజే కుశలవులకు పట్టాభిషేకం జరిపి కొడుకులిద్దరను తొడమీద చేకొని వారి శరస్సులను ఆఘ్రూణించి వారికి హితవచనాలు చెప్పి ధనకనక వస్తు వాహనాలతో సైన్యాన్ని ఇచ్చి కుశుణ్ణి కుశాపతికి, లవుణ్ణి శ్రావస్తికి పంపాడు. తరువాత దూతల ద్వారా జరిగిన సంగతులన్నీ శత్రుఘ్నుడికి తెలియ చేసాడు. శతృఘ్నుడు మంత్రి పురోహితులను పిలచి తన అన్నతో తానూవెళ్ళిపోతానని తెలిపి తన రాజ్యాన్ని రెండుగా విభజించి మధురను సుబాహుడికి, విదిశానగరాన్ని చిన్నవాడు శత్రుఘాతికీ ఇచ్చి అభిషిక్తులను చేసాడు. రాముడు వెళ్ళి పోతున్నాడన్న విషయం తెలిసిన వానరులు, భల్లూకాలు, రాక్షసులు తండోప తండాలుగా అయోధ్యకు తరలి వచ్చారు. [[అంగదుడు]] చేతులు జోడించి" రామా ! అంగదుడికి నా రాజ్యం అప్పగించి వచ్చేసాను. నన్నూ నీతో తీసుకొని పో" అన్నాడు. రాముని వద్దకు వచ్చి విభీషణుడు వచ్చి ఏదో రామునికి చెప్పబోగా రాముడు వారించి "విభీషణా సూర్యచంద్రులున్నంత దాకా , నా కధకథ ఈ లోకంలో ప్రజలు చెప్పుకొన్నంత కాలం నువ్ ధర్మబధ్ధమైన పాలన గురించి కూడా పొగిడేలా చక్కని రాజ్య పాలన చేయాలి. ఇది స్నేహితునిగా నా ఆజ్ఞ. అంతే కాదు మా ఇక్ష్వాకువంశ కులనాధుడు జగన్నాధుడు. ఆయనను సదా సేవించడం మానకు." అన్నాడు. అప్పుడు [[ఆంజనేయుడు|ఆంజనేయుడిని]] పిలిచి" నాయనా!నీవు, మైందుడు , ద్వివిదుడు. మీ ముగ్గురూ కలికాలం అంతమయ్యేదాకా చిరాయువులై ఉండండి. అని ఆశీర్వదించి, మిగిలిన వానర భల్లూక వీరులనందరినీ తనతో తీసుకొని వెళ్ళడానికి అనుజ్ఞ ఇచ్చాడు.
 
===రామావతార పరిసమాప్తి===
పంక్తి 75:
 
 
==కధాకథా భేదాలు==
 
 
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_రామాయణం" నుండి వెలికితీశారు