ఉమర్ ఆలీషా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 52:
ఈ విధంగా 80 సంవత్సరాల క్రితం అప్పటి సమాజ రీతి-రివాజులకు, ఆలోచనలకు వ్యతిరేకంగా స్త్రీజన పక్షం వహిస్తు ఉదాత్త భావాలను ఉమర్‌ అలీషా ప్రకటించటం విశేషం. స్త్రీ జన సముదాయాల కడగండ్లను వివరించి, విమర్శించిన ఉమర్‌ అలీషా అంతటితో ఊరు కోలేదు. ఆయన రాసిన '' విచిత్ర బిల్హణీయం '' నాటకంలో బాల్య వివాహాలను, కన్యాశుల్కం లాంటి దురాచారాలను ఖండిస్తూ, ఆనాటి విపత్కర పరిస్థితుల నుండి ప్రీలె విముక్తి పొందడానికి తీసుకోవాల్సిన చర్యలకు ఈ నాటకంలోని, యామిని పూర్ణ తిలక, బిల్హణీయుడు అను పాత్రల చేత సూచించారు. కన్యాశుల్కానికి బలైన సత్యవతి అను పాత్ర తన వృత్తాంతాన్ని సహాధ్యాయిని యామిని పూర్ణ తిలకతో చెబుతూ, ''..నడువన్‌ బాదములైన లేని మగనిన్‌ నాల్గేండ్ల ప్రాయంబున ముడివైచెన్‌ జనకుండు నకటకటా...ననీ బడుగన్‌ చేరి సుఖించుటెట్లు? ...కాసుల కాసజేసి కనుగానని వృద్ధుని నాకు తండ్రియే చేసెను పెండ్లి, బంధువులు చెప్పరొవద్దని పెండ్లి పెద్దలీ మోసం మెఱుంగరో, జనని పోరదో నా కురివెట్టి గొంతుకన్‌ గోసిరి..'' అంటూ ఈ పరిస్థితులలో తాను భూమిలో కలసి పోవటం కంటే, ఈ సమస్యకు పరిష్కారం లేదని సత్యవతి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ వృత్తాంతం విన్న యామినీ పూర్ణతిలక, ఈ సమస్యలకు పరిష్కారం స్త్రీలు చైతన్యవంతులు కావటమే మార్గం తప్ప భూమి తల్లి వడిలో చేరటం ఎంత మాత్రం కాదంటుంది. స్త్రీ లోకాన్ని చైతన్య వంతులను చేయాలంటే, స్త్రీలలో అక్షరాస్యత పెంచాలని, ఆ తరువాత లోకజ్ఞానం కోసం గ్రంథాలు, వార్తా పత్రికలు, చదవాలని సూచిస్తుంది. సామాన్య స్త్రీలకు కూడా చదువుకునే అవకాశాలను కల్పించాలని ఆమె ప్రయత్నిస్తుంది. ''.. మననారీ లోకం బున విద్య యొక్కటి కడు కొఱంతగానున్నది. అందేచేతనే యిన్ని దురాగతములు తటస్థించినవి ...'' అని ఆమె ప్రకటిస్తుంది. ఈ నాటకంలోని మరో పాత్ర బిల్హణుడు పలు స్త్రీ జనసంక్షేమ కార్యక్రమాలను చేపడతాడు. ''... స్త్రీ విద్యలేని దేశమునకు క్షేమము రానేరాడు..'' అంటూ ి స్త్రీ విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తాడు. స్త్రీ విద్యావ్యాప్తి కోసం మహిళా విద్యాలయాలు, అనాథ శరణాలయాలు ప్రారంభించి మహిళాభ్యుదయానికి కృషి యామిని పూర్ణతిలక, బిల్హణీయుడు చేపడతారు. ఈ దిశగా ఆ స్త్రీ జన బాంధవులు తమ కాలం కంటే చాలా ముందుగా ఆలోచిస్తారు. ఆరాధనాలయాల కంటే బాలికా పాఠశాలలు అవసరమంటారు. సత్రముల కంటే అనాథ శరణాలయాలు కావాలంటారు. వనాలు తటకాల కంటె మహిళలకు సర్వ విద్యలు గరిపె కళాశాలను స్థాపించాలని ఆ పాత్రల ద్వారా ఉమర్‌ అలీషా ఆనాటి సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాన్ని సూచిస్తారు.
బాల్య వివాహాల వలన స్త్రీ జాతికి కలుగుతున్న కడగండ్లను వివరిస్తూ, ''.. కడు దరిద్రతచేత నిడుములు బడయవచ్చు బాలవైధవ్యంబు బడయరాదు - హాలాహలము ద్రావియగ్ని గూలగవచ్చు బాలుధ్యంబు పడయరాదు - దాస్య సజీవనము దగుల మొందగవచ్చు బాల వైధవ్యంబు పడయరాదు...'' అని అంటారు. అంతే కాదు ''..సహగమనమైన గావించి చావవచ్చు బాల వైధవ్య దుఖంబు పడయరాదు...'', అని ఈ రుగ్మతను నివారించ కదలి రావల్సిందిగా మాన్యులను ఆయన ప్రజలను వేడుకుంటారు. ఈ రకంగా సాగే బాల్య వివాహాల వలన చిన్న వయస్సులోనే వైధవ్యం పొందిన బాలికలలో ఆత్మస్థైర్యం కలుగ చేసేందుకు వారిని సమావేశ పర్చి సభలు సమావేశాలు ఏర్పాటు చేయాలని యామిని పూర్ణ తిలక, బిల్హణుడు పాత్రల ద్వారా నిర్మాణాత్మక ఆలోచనలు చేస్తారు కవి ఉమర్‌ అలీషా.
స్త్రీ విద్య, బాల వైధవ్య బాధలు, కుటుంబ సమస్యల వరకు మాత్రమే ఆయన పరిమితం కాకుండా ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం, అగ్రహారాలను నిచ్చేకంటే పదిమందికి ఉపాధిని కలిగించే యంత్ర కర్మాగారాలను స్థాపించాలని అంటారు. ఈ విషయాన్ని ఉమర్‌ అలీషా ఓ పద్యంలో ఈ విధంగా ప్రస్తావించారు. ''.. ప్రథిత సత్రంబుల బదులనాథ శరనాలయంబులు నల్పి జాలికొల్పి, మహిని దేవళముల మాఱుగా బాలికా పాఠశాలలు కట్టి వన్నె బెట్టి, వన తటాకం బుల బదులుగా సర్వ కళాళాలలుంచి లీలల రచించి, బహుళాగ్రహరాళి బదులుగా యంత్ర కర్మాగారములు పెంచి ఖ్యాతి గాంచి, నతపురాణ కధావిధానములకథావిధానముల బదులుతొంటి నిర్భంవైధవ్య దు:ఖ జలధి సమయజేయనుపన్యాస సభలు దీర్చి యామిని పూర్ణతిలక బిల్హణునియట్లే...'', అంటూ నాటకంలోని పాత్రలు చేసిన కృషి వివరిస్తూ, ఆ ప్రయత్నాలను మరొక పాత్ర చేత ప్రశంసింప చేస్తారు. ఈ మేరకు సమాజ అనుమతిని తన గ్రంథాలలో పరోక్షంగా సాధిస్తారు డాక్టర్‌ ఉమర్‌ అలీషా.
మనం నిష్పాక్షికంగా ఆలోచిస్తే, స్త్రీలు పురుషులకంటే యోగ్యులని ఉమర్‌ అలీషా తీర్మానిస్తూ, తనను స్త్రీజన పక్షపాతిగా ఏమాత్రం సంశయం ప్రకటించుకుంటారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ , '' నిష్పాక్షిక బుద్ధితో నూహించినచో పురుషులకన్న స్త్రీలత్యంత యోగ్యులని చెప్పవలెనని '' తీర్మానిస్తారు. ఈ నాటకంలోని ఒక పాత్ర మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఆ పాత్ర ద్వారా ఆనాడు సమాజంలో మహిళలకు వ్యతిరేకంగా ప్రజలి ఉన్న అహేతుక అభిప్రాయాలను వివరిస్తూ, ఆ వాదనలను ఉమర్‌ అలీషా చాలా బలంగా పూర్వపక్షం చేస్తారు. ఈ నాటకంలో ఒక పాత్ర మహిళలు అవినీతి పరులంటూ, శాస్త్రజ్ఞులు చెప్పారు కదా?..శాస్త్రజ్ఞులు పొరపడ్డారా? అంటూ ప్రశ్నించగా, ఆ ప్రశ్నకు ప్రతిస్పందిస్తూ, మరొక పాత్ర చేత సమాధానంగా, ''.. సతుల వినీతలంచు దమశాస్త్రము లందుకు లిఖించవరలా సతులకు బుట్టరోసతుల-సంగతి గూడి సుఖింపరో సమున్నతి! తమ సోదరీసుతలు నారులు గారో! ప్రసన్న బుద్ధిలే కితరుల నింద సేయదమకే యదిలజ్జా యటంచెఱంగరో..'' అంటూ ఆ అహేతుక అభిప్రాయాల విూద విరుచుకు పడతారు.
ఈ నాటకంలో స్త్రీ విద్యను, మహిళలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను సదా విమర్శించే ఓ పాత్ర ద్వారా, ''..ఓహో! ఇదియా! భరత ఖండము నుద్దరించుటకు యనగా మావంటి బ్రహ్మణోత్తములకు నన్నదాన భూదాన కన్యాదానములు సమర్పించి ఆగ్రహారములిచ్చి లెస్సగా బిండివంటలతో భోజనము పెట్టించడమను కున్నాము. అట్లు గాదట! స్త్రీ విద్యట! భరత ఖండబునకు కొరతంట!.. తగినట్లు బుద్ధి చెప్పి గోబ్రాహ్మణ సమారాధనము మోక్షదాయకమని యొప్పించవలయును..'' అని చెప్పించి, ఆనాటి ప్రతీపశక్తుల కుయుక్తులను, పరాన్నభుక్కుల కుళ్ళు బుద్ధులను ఉమర్‌ అలీషా బట్ట బయలు చేస్తారు. చదువుకున్న స్త్రీ మగని నెత్తికెక్కి పెత్తనం చేస్తుందని వచ్చిన వాదనలను దృష్టిలో వుంచుకుని, ఒక పాత్ర, విద్యా బుద్ధులు నేర్చిన స్త్రీలు అధిపత్యం కోసం పాకులాడుతారని, పెనిమిటిని గౌరవించరని, మాట వినరని ఆరోపించగా ''...విద్యచే వివేకము వచ్చును గావున వివేకవంతు దాధిపత్యమునకు నర్హుడైయ్యే యుండును..'' అంటూ ఆ వాదనను ఆయన పూర్వపక్షం చేస్తారు. కులం కాదు ప్రధానం గుణం ప్రధానమంటూ, బ్రహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన ఎవ్వరూ బ్రహ్మగారని, ''.. బ్రహ్మణుండైన గడజాతి - శ్వపచుడైనా విద్యయున్న మహాబ్రహ్మ...'' యగునని సాధికారంగా ప్రకటిస్తారు. ఉమర్‌ అలీషా కాలం నాటి సమాజ స్థితి, అభిప్రాయాలు, అభిమతాలతో బేరీజు వేసుకుని, ఆయన రచనలను పరిశీలిస్తే ఆయన విప్లవాత్మక దృష్టి విదితమౌతుంది.
పంక్తి 74:
ఉమర్‌ అలీషా భారత దేశమంతటా పర్యటించి పలు పండిత సభలలో పాల్గొని పాహిత్య-అధ్యాత్మిక ఉపన్యాసాలిచ్చి, అద్భుతమైన ధారణతో ప్రతిభను ప్రదర్శించి పలు సన్మానాలు, సత్కారాలను పొందారు. '' భారతభూమి నేనుప న్యాసము లిచ్చుచున్‌ దిరిగి నాడను ఉమ్రాలిషా కవీంద్రుడన్‌ '' అంటూ, '' ...నవరించితిని పెద్ద సారస్వతంబును-శబ్ద శాస్త్రంబులు జదివి చదివి... '' అని ఆయన ప్రకటించుకున్నారు.
ఉమర్‌ అలీషాను సత్కరించటమే మహా భాగ్యంగా ఆనాటి సంస్థానాధీశులు, సంపన్న కుటుంబీకులు భావించారు. విశ్వ విద్యాలయాలు ఆయనకు గౌరవ బిరుదులను ఇవ్వడానికి ఉత్సాహ పడ్డాయి. 1924 లో జుజిజి |దీఖిరిబి ంజీరిలిదీశిబిజి ్పుళిదీతీలిజీలిదీబీలి లో '' పండిట్‌ '' బిరుదుతో ఆయనను సత్కరించింది. ఈ సందర్భంగావ ఓరిజీరీశి ఖతిరీజిరిళీ ఊలిజితివీతి ఆళిలిశి రిదీ జుదీఖినీజీబి ఆజీబిఖిలిరీనీ శిళి నీబిఖీలి జిలిబిజీదీశి ఐబిదీరీదిజీరిశి, ఆలిజీరీరిబిదీ, జుజీబిలీరిబీ బిదీఖి జూదీవీజిరిరీనీవ అని ఆ సంస్థ ప్రకటించింది.(జూదీబీగిబీజిళిచీబిలిఖిరిబి ళితీ ఖతిరీజిరిళీ ఔరిళివీజీబిచీనీగి జూఖి. ఖజీ. శ్రీబివీలిదీఖిజీబి చజీ. ఐరిదీవీనీ, జు.ఆ. కఆ్పు, 2001) అలీఘర్‌ విశ్వ విద్యాలయం ఆయనకు '' మౌల్వీ '' బిరుదునిచ్చి గౌరవించింది. ఫ్రాన్స్‌ దేశానికి చెందిన ఆర్యన్‌ విశ్వ విద్యాలయం(జుజీగిబిదీ ఏదీరిఖీలిజీరీరిశిగి ళితీ ఓజీబిదీబీలి) ఆజీళితీలిరీరీళిజీ రిదీ కరిదీఖితి-ఖతిరీజిరిళీ ్పుతిజిశితిజీలి అను అవార్డును ప్రసాదించి గౌరవించింది. 1933లో ఖతిరీజిరిళీ ఔళిబిజీఖి ళితీ ఐశితిఖిరిలిరీ తీళిజీ ఊలిజితివీతి లో సభ్యుడిగా కార్యక్రమాలకు మార్గదర్శకత్వం నెరపమని ఆయనను ఆంధ్ర విశ్వ విద్యాలయం ఆహ్వానించింది. కాశీలోని హిందూ విశ్వ విద్యాలయం కూడా ఆయనను విద్యాభివృద్ధి కమిటీలో సభ్యునిగా నియమించుకుంది. ఉమర్‌ అలీషా విద్వత్తును గుర్తించి 1936లో జుబీబిఖిలిళీరిబి |దీశిలిజీదీబిశిరిళిదీబిజి జుళీలిజీరిబీబిదీబి లో ఆయనను ఖిళిబీశిళిజీ జిరిశిరిలిజీబిజీతిళీ (ఖిళిబీశిళిజీ ళితీ జిరిశిలిజీబిశితిజీలి) తో గౌరవించింది. ఏ విశ్వ విద్యాలయం నుండి ఎటువంటి కనీస డిగ్రీ లేని వ్యక్తికి, అంతర్జాతీయ స్థాయి విశ్వ విద్యాలయం డాక్టరేట్‌ను ప్రకటించడం చాలా అరుదైన సంఘటన. ఉమర్‌ అలీషా తన సాహిత్య సంపదతో, ఆంగ్లేయులకు షేక్‌ స్పియర్‌, ఇటాలియన్‌లకు డాంటే, ఉర్దూ మాట్లాడే ప్రజలకు డాక్టర్‌ ఇక్బాల్‌ ఎలాగో తెలుగు మాట్లాడే ప్రజలకు డాక్టర్‌ ఉమర్‌ అలీషా అటువంటి వారని ప్రముఖ పండితుల చేత బహువిధాల కీర్తించబడ్డారు.(వ ఇనీబిశి ఐనీబిదిలిరీచీలిబిజీలి రిరీ శిళి శినీలి జూదీవీజిరిరీనీ. ఇనీబిశి ఈబిదీశిలి రిరీ శిళి శినీలి |శిబిజిరిబిదీరీ. ఇనీబిశి ఈజీ.|విలీబిజి రిరీ శిళి ఏజీఖితి రీచీలిబిదిరిదీవీ ఖతిరీజిరిళీరీ, ఈజీ. ఏళీబిజీ జుజిరిరీనీబి రిరీ శిళి శినీలి కరిదీఖితిరీ (ఊలిజితివీతి రీచీలిబిదిరిదీవీ చీలిళిచీజిలి) ళితీ బిదీఖినీజీబి వ ఖ.శ్రీ.కతిఖిబి రిదీ నీరిరీ ఔజీబినీళీబి ష్ట్రరిరీనీరి ఈజీ. ఏళీలిజీ బిజిరిరీనీబి -ఊలిజితివీతి ఆళిలిశి)
ఉమర్‌ అలీషాకు బహు సత్కారాలు, సన్మానాలు జరిగాయి. మౌల్వీ, బ్రహ్మరుషిబ్రహ్మఋషి, అశుకవి, మహాకవి లాంటి పలు బిరుదులే కాకుండా, పూల కిరీటాలు, సింహతలాటాలు, గజారోహణలు, కనకాభిషేకాలు తదితర గౌరవాలతో ఉమర్‌ అలీషా సాహిత్యవేత్తగా జయభేరిని మ్రోగించారు. పలు గ్రంథాలను రచించి, పండితుల ప్రశంసలు పొంది, పామర జనుల హృదయ పీఠాలను అలంకరించిన ఉమర్‌ అలీషా ఏ రంగాన్ని ఎన్నుకున్నా అద్వితీయమైన ప్రతిభతో ఆ రంగాలలో రాణించారు.
శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాధాత్మిక పీఠాచార్యునిగా అసంఖ్యాకులైన శిష్యుల మనస్సులను చూరగొన్నారు. సర్వమత సమభావనా కేంద్రంగా తమ పీఠాన్ని తీర్చిదిద్దారు. ఆయన బోధించిన వేదాంత తత్వం అసంఖ్యాక శిష్యగణాన్ని సమకూర్చి పెట్టింది. ఆయన మతపరంగా ముస్లిం అయినప్పటికి, అయనలో మతాభిమానం ఉన్నా మత దురహంకారం మాత్రం తగదన్నారు. సర్వ మత సామరస్యం బోధించారు. ''..ఆదర్శ గురువుగా అంతేవాసుల ఆరాధ్యదైవంగా... ఆయన గౌరవ మర్యాదలందుకున్నారు ''. మతాల ప్రసక్తి లేకుండా, మతాచారాలతో సంబంధం లేకుండా ఉమర్‌ అలీషా పీఠాధిపత్యం లోని ' జ్ఞానసభ ' అందర్ని ఆహ్వానించింది. ఈ జ్ఞాన సభలో కులమత జాతి భేదాలు లేవు. జ్ఞానార్జనే ఇక్కడ ప్రధానం. ఈ విషయాన్ని '' సభామందిర ద్వారమెపుడు తెఱిచి యుండు పూత చరిత్రులై యుండు వారు వచ్చి జ్ఞానంబు నేర్చుకోవచ్చు సతము మంచి నీళ్ళను కలశాల ముంచినట్లు '' అని ఆయన స్వయంగా ప్రకటించారు. ఆ మేరకు ఆచరించిన చూపారు. ఆ కారణంగా ఆయనకు అన్ని మతాలకు చెందిన ప్రజలు ఆయనను గురువుగా స్వీకరించారు. డాక్టర్‌ ఉమర్‌ అలీషా ప్రతీ ఏడాది శిష్యులకు వేదాంతబోద చేసేందుకు పర్యటనలు చేయటం అనవాయితీ. శిష్యగణమే ఆయన సర్వస్వమని భావించి, ప్రేమించే వేదాంతి మనసులోని తన మాటకు ఆయనలోని కవి ఈ విధంగా అక్షర రూపం కల్పించాడు.
:'' అతి పవిత్రతతో మహాప్రేమ గరిమతో
పంక్తి 85:
:వీరె భక్తులు బిడ్డలు వీరె మాకు
:మా మహాజ్ఞానసభ జగన్మందిరముగ ''
బ్రహ్మరుషిబ్రహ్మఋషి ఉమర్‌ అలీషా మిధ్యా భావనకు బహుదూరం. ప్రాంపంచిక జీవిత చర్యలు పరలోక జీవితానికి పునాది కాగలుగుతాయని ఆయన ప్రభోధం. ఇహలోక జీవనాన్ని ఏమాత్రం విస్మరించరాదన్నారు. భక్త జనుల ఆరాధనా మార్గాలు వేరైనప్పటికీ, అన్ని మతాలు భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకునేందుకు మార్గం చూపుతాయన్నారు. సర్వజనుల సర్వేశ్వరుడు ఒక్కడేనన్న భావన ద్వారా వసుదైక కుటుంబం ఏర్పడుతుందని ఆయన ప్రవచించారు. ఈ విషయాన్ని '' మానవుని మానవునిగా మార్చుటయే యీ ధర్మము యొక్క లక్ష్యమ '' ని ఆ మానవతా వాది ప్రకటించారు. ఆ లక్ష్య సాధనకై, సూఫీ సాధువుల వేదాంత బాటలో నడిచిన ఉమర్‌ అలీషా చుట్టూ అసంఖ్యాకంగా శిష్య గణం చేరింది. ఆయన సర్వమత సమభావన ఆధ్యాత్మి-వేదాంత భావాలు ప్రముఖ పండితుడు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను కూడా ప్రభావితం చేసాయి. ఉమర్‌ అలీషా ధార్మిక చింతనా ధోరణులను శ్రీ రాధాకృష్ణన్‌ బహుదా కొనియాడారు. (ఆంధ్ర ప్రభ ఆదివారం అనుబంధం 03-04-1994)
ఈ రకమైన ధార్మిక తత్వ చింతన కారణంగానే ఈనాటికి పిఠాపురంలోని '' శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠం '' ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది. డాక్టర్‌ ఉమర్‌ అలీషా పూర్వీకులు స్థాపించిన పీఠం ప్రధానంగా ధార్మిక విషయలకు పరిమితం కావడం వలన ఉమర్‌ అలీషాలోని కవికి సాహిత్య చరిత్రలో, ప్రజలలో లభించాల్సినంత ప్రాచుర్యం లభించలేదు. విద్యాధ్యాత్మిక పీఠంగాని, ఆయన తరువాత వచ్చిన పీఠాధిపతులు గాని ఆ దిశగా తగిన స్థాయిలో కృషి సల్పలేదు. ఉమర్‌ అలీషా తెలుగు సాహితీ ప్రక్రియలన్నిటిలోనూ అత్యంత ప్రతిభను చూసేందుకు డాక్టర్‌ ఉమర్‌ అలీషా మునిమనుమడు, నవమ పీఠాధిపతి, యువకుడు డాక్టర్‌ ఉమర్‌ అలీషా ఈ లోటును గ్రహించి ' డాక్టర్‌ ఉమర్‌ అలీషా సాహితీ సమితి ' , ' శ్రీ ఉమర్‌ అలీషా గ్రంథమండలి ' అను సంస్థలను ఏర్పాటుచేసి ఆనాడు ఉమర్‌ అలీషా పోషించిన బహుముఖ పాత్రలను సమాజం అవసరాలను గమనిస్తూ, ప్రజల ఆకాంక్షలను విస్మరించకుండా, సమాజహితం కోరుతూ, మహాకవి ఉమర్‌ అలీషా బాటన వినూత్న కార్యక్రమాలకు రూపొందించి నిర్వహిస్తున్నారు.
'' మహా కవిగా, విద్యా వేత్తగా, రాజనీతి జ్ఞుడిగా, జాతీయవాదిగా, బహుభాషా విశారదుడుగా, బహుముఖ ప్రజ్ఞాదురీణుడుగా, దయార్ధ్ర హృదయుడుగా, ఆధ్యాత్మక విద్యా పీఠాధిపతిగా సమత-మమత-మానవతలకు ప్రతీక...'' గా వెలుగొందిన డాక్టర్‌ ఉమర్‌ అలీషా తన జీవితకాలంలో పలు గ్రంథాలను రాశారు. అందులో 1.అనసూయాదేవి, 2.కళ, 3.చంద్రగుప్త 4.ప్రహ్లాద లేక దానవవధ, 5. మణిమాల, 6,మహాభారత కౌరవరంగము, 7.విచిత్ర బిల్హణీయము, 8.విషాద సౌందర్యము అను నాటకాలున్నాయి.1. నరకుని కాంతాపహరణ, 2. బాగ్దాదు మధువీధి, 3. విశ్వామిత్ర (అసంపూర్ణము) అను ఏకాంకిలు, 1.వరాన్వేషన్‌ అను ప్రహసనం, 1. ఖండకావ్యములు, 2.తత్త్వ సందేశము, 3.బర్హిణి దేవి, 4. బ్రహ్మ విద్యావిలాసము, 5.మహమ్మద్‌ రసూల్‌ వారి చరిత్ర, 6.సూఫీ వేదాంత దర్శనము, 7. స్వర్గమాత, 8.హాలీలాంటి పద్య గ్రంధాలు రచించారు. 1.ఈశ్వరుడు, 2. మహమ్మద్‌ వారి చరిత్ర, 3. సాధన పథము అను గద్యములు, 1.తారామతి, 2. పద్మావతి, 3. శాంత అనునవలలు, 1. ప్రభాత కథావళి అను కథల సంగ్రహము 1. ఉమర్‌ఖయ్యమ్‌, 2.ఖురాన్‌ - ఏ - షరీఫ్‌, 3.గులిస్తా అను అనువాదాలు 1. ఇలాజుల్‌ గుర్‌భా అను వైద్య గ్రంధాలను ఆయన సృజించారు. ఈ గ్రంథాలలో అన్ని ప్రస్తుతం లభ్యం కావటంలేదు.
పంక్తి 128:
32. బ్రహ్మర్షి ఉమర్‌ అలీషా వ్యాసాలు-ఉపన్యాసాలు, శ్రీ ఉమర్‌ అలీషా గ్రంథమండలి, పిఠాపురం,2005.
33. తత్వ సందేశము, బ్రహ్మర్షి డాక్టర్‌ ఉమర్‌ అలీషా, శ్రీ ఉమర్‌ అలీషా గ్రంథమండలి, పిఠాపురం,2001.
34. ప్రభాత కధావళికథావళి, బ్రహ్మర్షి డాక్టర్‌ ఉమర్‌ అలీషా, శ్రీ విజ్ఞాన విద్యాపీఠము, పిఠాపురము, 1988.
35. స్వర్గమాత, బ్రహ్మర్షి డాక్టర్‌ ఉమర్‌ అలీషా, శ్రీ ఉమర్‌ అలీషా గ్రంథమండలి, పిఠాపురము, 2001.
36. శాంత (నవల), డాక్టర్‌ ఉమర్‌ అలీషా, శ్రీ విజ్ఞాన విద్యా పీఠము, పిఠాపురం, 1988.
"https://te.wikipedia.org/wiki/ఉమర్_ఆలీషా" నుండి వెలికితీశారు