కే.వి. చలం: కూర్పుల మధ్య తేడాలు

చి కే. వి. చలం ను, కే.వి. చలం కు తరలించాం
చి Wikipedia python library
పంక్తి 8:
చలం ముందుముందు చిన్న చిన్న వేషాలు వేసినా, మొదటి నుండి హాస్యనటుడు కాడు. చిన్నప్పుడే కొంత నాటకానుభవం ఉంది. వ్యాపారరీత్యా మద్రాసు వచ్చాడు. మద్రాసు వచ్చిన తరువాత సినిమాల మీద మోజు పెంచుకున్నాడు. మద్రాసులో కూడా చిన్న చిన్న నాటకాల్లో వేశాడు. డాక్టర్‌ రాజారావు గారి బృందంలో నటించాడు. ఇంకొకరి ‘యాస’లో మాట్లాడ్డం సరదా ఉండేది. దాని కోసం చాలా సాధన చేసేవాడు. చలం విచిత్రమైన యాసలలో మాట్లాడటం చూసి హాస్య పాత్రలు ఇచ్చారు.
===పేరు తెచ్చిన సినిమాలు===
విజయావారి [[హరిశ్చంద్ర]] (1965)లో చిన్న చిన్న వేషాల్లో కనిపించడంతో సినిమా ప్రవేశం జరిగినా, [[తేనె మనసులు]] (1965)తో బాగా తెలిశాడు. అందులో ఇంగ్లీషును తెలుగులా మాట్లాడే మేనేజరు వేషం వేసి ''కమ్ము హియరూ, వాడ్డూయూ వాంటూ?'' అని చెప్పిన సంభాషణలకు చక్కటి నవ్వు వచ్చింది. అలాగే అతను [[బందిపోటు దొంగలు]] (1968) లో కూడా ‘మిస్టర్‌ అమెరికా’ అనే పాత్ర ధరించాడు. వచ్చీరాని తెలుగులో, ఇంగ్లీషు కలుపుతూ మాట్లాడే ఈ పాత్ర కూడా అతనికి రాణింపు తెచ్చింది. అక్కడి నుంచి కె.వి.చలం కమేడియన్‌గా మారి, వందకు పైగా చిత్రాల్లో హాస్య పాత్రలు ధరించాడు. [[కన్నెమనసులు]] (1966), [[స్త్రీ జన్మ]] (1967), [[నేనంటే నేనే]] (1968), [[మరపురాని కధకథ]],
[[మనుషులు మారాలి]], [[ప్రేమకానుక]], [[భలే రంగడు]] (1969), [[పెద్దక్కయ్య]] (1970), వంటి చిత్రాల్లో హాస్యం మిళాయించిన పాత్రలు చేసి పేరు తెచ్చుకున్నాడు.దాసరి చిత్రం చిల్లరకొట్టు చిట్టెమ్మలో పాత్ర కె.వి.చలం కు మంచి పేరు తెచ్చింది.ఈయన కుమార్తె 'దేవి' కొన్ని చిత్రాల్లో నటించింది.
 
"https://te.wikipedia.org/wiki/కే.వి._చలం" నుండి వెలికితీశారు