అశ్మక జనపదం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Ancient india.png|right|150px|thumb|<center>క్రీ.శ.600 నాటి మహాజనపదాలు</center>]]
క్రీ.పూ.6వ శతాబ్దానికి చెందిన షోడస (16) మహాజనపదాలలొ '''అశ్మక జనపదం''' (Ashmaka Janapada) ఒకటి. షోడస మహాజనపదాలలొ దక్షిణాదిలోని ఏకైక జనపదంగా ప్రసిద్ధి చెందిన దీన్ని అస్సకానేపేరుతోనూచరిత్రకారులు పిలుస్తారు. ప్రాచీన బౌద్ధగ్రంథం "అంగుత్తర నికయ"లో కూడా దీనిపై వర్ణించబడింది. [[గోదావరి నది|గోదావరి]]-[[కృష్ణానది|కృష్ణా]]నదుల మధ్యలో నేటి [[తెలంగాణ]] ప్రాంతపు చాలా ప్రాంతం ([[ఆదిలాబాదు జిల్లా]] తూర్పు తెలంగాణ మినహా) ఈ జనపదంలో భాగంగా మరియు నేటి మహారాష్ట్రంలో కొంతభాగంగా ఉండేది. [[మంజీరా నది]] పరీవాహక ప్రాంతంలో ఈజనపదం ఉన్నతంగా వర్థిల్లింది. పోదన్ దీనికిం రాజధానిగా ఉండేది. <ref>తెలంగాణ చరిత్ర, రచన- సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 28</ref> పోదన్ లేదా పౌడన్యాపురంగా పిలుబడిన నాటి రాజధానియే నేటి బోధన్ పట్టణంగా చరిత్రకారులు నిర్థారించారు. వాయుపురాణంలో కూడా అస్మకరాజుల గురించి వివరించారు. బుద్ధుని సమకాలీనుడు సుజాతుడు పోదన్ పాలకుడిగా ఉన్నట్లుగా బౌద్ధవాజ్ఞయం తెలియజేస్తుంది. బుద్ధిని కాలంలో కోసల వాసి అయిన బావరి అశ్మక జనపదానికి విచ్చేసి గోదావరి నదీద్వీపంలో నివశించినట్లు (నేటి బాదనకుర్తి) "సుత్తనిపాతం" గ్రంథం తెలియజేస్తుంది. [[మహాభారతం|మహాభారత]] కాలంలో ఆశ్మక జనపదం పాండవుల పక్షాన ఉన్నట్లుగా చరిత్రకారుడు నీలకంఠశాస్త్రి బయటపెట్టారు. [[పాణిని]] రచించిన అష్టాధ్యాయిలోకూడా ఈ జనపదం వర్ణన ఉంది. అస్సక పాలకుడు బ్రహ్మదత్త గురించి బౌద్ధగ్రంథం "మహాగోవింద సుత్తాంత"లో వివరణలున్నాయి. <ref>Raychaudhuri, Hemchandra (1972) Political History of Ancient India, University of Calcutta, mumbai, p.80</ref>కాలక్రమంలో మగధ జనపదం బలపడి అనేక జనపదాలను ఆక్రమించడంతో చివరకు ఇదికూడా మగధలో భాగమైంది.
 
 
"https://te.wikipedia.org/wiki/అశ్మక_జనపదం" నుండి వెలికితీశారు