"డౄపల్" కూర్పుల మధ్య తేడాలు

4,160 bytes added ,  7 సంవత్సరాల క్రితం
చి
చి (చేవ విభాగం)
డౄపల్ 8 ఇప్పుడు వృద్ధిచేయబడుతోంది. ఇంకా విడుదల ప్రకటించబడలేదు. డౄపల్ 8 అభివృద్ధిని ప్రధానాంశాలుగా చెప్పుకోవచ్చు, ఇవి : ముబైల్, లేఅవుటు, జాల సేవలు, అమరికల నిర్వహణ మరియు HTML5. గూగుల్ సమర్ ఆఫ్ కోడింగ్ వారు 20 డౄపల్ ప్రాజెక్టులను స్పాన్సర్ చేస్తున్నారు.
==డౄపల్ చేవ==
డౄపల్ సంఘంలో వాడుకరి చేసే మార్పులుండే sites అనే దస్త్రం వెలుపల ఉన్న మూల భాగమంతా చేవగా పరిగణించబడుతుంది. చేవ అనేది డౄపల్ మూలభాగం. డౄపల్ లో జరిగే మార్పులను వివరంగా వెర్జన్ సంఖ్యలుగా వెలువరిస్తూ భద్రపరుస్తుంది.
;చేవపు మోడ్యూళ్ళు
డౄపల్ లోని ఒక్కో క్రియకు ఒక్కో మోడ్యూల్ ఉంటుంది. కొన్ని మోడ్యూళ్ళు తప్పనిసరిగా సచేతనం చేస్తేనా డౄపల్ వెబ్సైటు సరిగా పని చేస్తుంది. మరికొన్ని చేవపు మోడ్యూళ్ళను సచేతనం చేసి మరికొంత పనితనాన్ని సాధించవచ్చు.
డౄపల్ చేవ ద్వారా ఎన్నో విశేషాలు వెబ్సైటుకి అందుతాయి, వాటిలో కొన్ని :
గణాంకాలు మరియు ఖాతా వాడుక వివరాలు
అధునాతన శోధన
బ్లాగు టపాలు, పుస్తకాలు, వ్యాఖ్యలు, చర్చావేదికలు, మరియు అభిప్రాయ సేకరణ ప్రశ్నలు
మెరుగయిన పనితనం కోసం కేషింగ్, మరియు ఫీచర్ థ్రాట్లింగ్
 
వివరణాత్మక యూఆరెళ్ళు
 
బహుళ స్థాయి మెనూ వ్యవస్థ
ఒకే స్థాపనతో బహుళ వెబ్సైట్ల నిర్వహణా సామర్ధ్యం
అనేక వాడుకరుల ద్వారా విషయాంశాలు రాసి సృష్టించి మరియు సవరించే సామర్ధ్యం
ఓపెన్ఐడీ కి సపోర్ట్
ఆరెసెస్ ఫీడ్ మరియు ఫీడ్ అగ్రిగేటర్
సురక్ష మరియు కొత్త విడుదలల-తాజాకరణల సూచన
వాదుకరి ఖాతా ప్రవరలు
అనేక ప్రవేశ నియంత్రణలు(వాడుకరి పాత్రలు, ఐపీ చిరునామా, ఈమెయిలు)
పనితనపు ఉపకరణాలు
 
;చేవపు అలంకరణలు
డౄపల్ చెవలో భాగంగా గార్లాండ్ మరియు బార్టిక్ అలంకరణలు అప్రమేయంగా వస్తాయి. వీటిని వాడి మనం వెబ్సైటు యొక్క రూపూ-రేఖా-లావణ్యాలను తీర్చవచ్చు. కలర్ మోడ్యూల్ వాడి రంగుల అమరికలను మార్చవచ్చు.
 
;స్థానికీకరణ
ఆగస్టు 2013 నాటికి తెలుగు సహా 110 భాషలలో డౄపల్ అందుబాటులో ఉంది. ఆంగ్ల భాషలో అప్రమేయంగా డౄపల్ వస్తుంది. అరబ్బీ, పెర్షియన్, హీబ్రూ లాంటి కుడి నుండి ఎడమ వైపుకు రాసే భాషలకు కూడా డౄపల్ సహకారం అందుబాటులో ఉంది. డౄపల్ స్థానికీకరణ gettext అనే గ్నూ అంతర్జాతీకరణ మరియు స్థానికీకరణ లైబ్రెరీ పై రూపొందించబడింది.
 
== బయటి లంకెలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/927529" నుండి వెలికితీశారు