తరువోజ: కూర్పుల మధ్య తేడాలు

taruvOja guriMci Tookeegaa vraasina vRttaaMtamu.
(తేడా లేదు)

22:01, 1 ఏప్రిల్ 2007 నాటి కూర్పు

తరువోజ తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యము.

పాదమునకు మూడు ఇంద్ర గణములు, ఆ పైన ఒక సూర్య గణము, మళ్ళీ మూడు ఇంద్ర గణమలు, ఒక సూర్య గణము ఉండవలెను. పాదములోని మొదటి అక్షరమునకు మూడు చోట్ల యతి ఉండవలెను - పాదాది అక్షరమునకు పాదంలోని మూడవ, ఐదవ, ఏడవ గణముల మొదటి అక్షరముతో యతి నియమమున్నది.

ఒక్కొక్క తరువోజ పాదము రెండు ద్విపద పాదములు కలసిన రీతిలో (అనగా ఒక ద్విపద పద్యము వలె) ఉంటుంది. ఒకే ఒక భేదమేమిటంటే ప్రతి పాదంలో మూడు చోట్ల యతి కలుస్తుంది - అంటే ద్విపద పద్యములోని రెండు పాదములకూ సాధారణంగా ఉండే యతి కాక పాదాల మొదటి అక్షరములకు కూడా యతి నుంచవలెను. అప్పుడు మొదటి అక్షరముతోనే రెండు పాదములకు మొత్తమూ యతి చెల్లించినట్టు అవుతుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=తరువోజ&oldid=93278" నుండి వెలికితీశారు