కురుక్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

5,720 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
పంక్తి 73:
* కర్ణుడి ఖేడా :- ఇది బ్రహ్మసరోవరానికి ఒక మైలు దూరంలో ఉంది. యుద్ధసమయంలో కర్ణుడు ఇక్కడ బ్రాహ్మణులకు దానాలు ఇచ్చాడని కథనాలు వివరిస్తున్నాయి.
* ఆప్గా తీర్థం :- కర్ణుడి ఖేడా సమీపంలో ఉన్న అతి పవిత్రమైన సరోవరమే ఆప్గాతీర్ధం సరోవరం. కురుక్షేత్రంలో ప్రవహించిన నదులలో ఒకటైన ఆప్గానది యొక్క వరద ప్రవాహం నుండి ఏర్పడిన సరసు కనుక ఈ సరసుకీ పేరు వచ్చింది. మానస నదికి క్రోశుదూరంలో ఉన్న ఆప్గా నదిని బ్రాహ్మణులు సేవించే వారని వామనపురాణంలో ఉన్నది. ఆప్గానదిలో తర్పణం విడిచిన వారి కోరికలు నెరవేరగలవని విశ్వసించేవారు. భాద్రపదకృష్ణ చతుర్ధశి మద్యాహ్నం ఇక్కడ తర్పణం విడిచిన వారికి ముక్తి లభిస్తుందని విశ్వసించబడుతుంది.
* జ్యోతిసర్:- కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన ప్రదేశం. ఇక్కడ శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసిన పాలరాతిశిల్పం ఉంది. అలాగే శ్రీకృష్ణుడి పాదాలు ఉన్నాయి. అర్జునుడి రధం ఉన్న ప్రదేశం చుట్టూ ఐదు వృక్షాలు ఉన్నాయి. ఈ ఐదు వృక్షాలు శ్రీకృష్ణుడి గితోపదేశం నేరుగా విన్నాయని విశ్వసిస్తూ ఐదు వృక్షాలను అతి పవిత్రంగా భావిస్తున్నారు. ఈ వృక్షాల ఆకులు కూడా నేలరాలకూడదు అని ఈ వృక్షాలకు పెద్ద వలలుకట్టి ఉన్నాయి. సమీపంలోనే బాణగంగ మరియు విష్ణుసహస్రనామము ఆరంభమైన ఆలయం ఉన్నాయి. ఇక్కడ ఒకప్పుడు జ్యోతిసర్ మహాదేవుడు ఉండేవాడని అందువలనే ఈ ప్రదేశానికీ పేరు వచ్చింది. ఇక్కడ ఒక ప్రాచీన సరోవరం ఉంది. సరోవరతీరంలో ఉన్న వృక్షం అతిప్రాచీనమైనదని భావించబడుతుంది. దీనిని అక్షయ వటవృక్షమని అంటారు. గితోపదేశం విన్న ఐదు వృక్షాలలో ఇది ఒకటి. థానేశ్వర్ విధ్వంశం జరిగినప్పుడు శిధిలమైన శివాలయం వద్ద అరో వట వృక్షం ఉంది. 1960లో ఇక్కడ శ్రీ కృష్ణ మందిరం నిర్మించబడింది.
*
* భూరి సుర్ :- కౌరవపక్షాన యుద్ధం చేసిన భూరిశ్రవుడు మరణించిన ప్రదేశమే భూరిసుర్ లేక భౌర్ అనిపిలువబడుతుంది. ఇది జ్యూతిసర్‌కు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సూర్యకుండ్ అనే పవిత్ర సరోవరం శివాలయం ఉన్నాయి. యాత్రికులు ఇక్కడ స్నానం ఆచరించి సూర్యోపాసన చేస్తారు. యాత్రికుల వినోదార్ధం ఇక్కడ ఒక మొసళ్ళ అరణాలయం ఏర్పాటు చేయబడి ఉంది.
* వృధోదక తీర్ధం ( పెహ్‌వా ) :- కురుక్షేత్రానికి పశ్చిమాన 25 కిలోమీటర్ల దూరంలో సరస్వతీ తీరంలో ఉన్న పట్టణం పెహ్వా. ఇక్కడి నుండి థానేశ్వర్, అంబాలా, కైథల్ కు రహదారి మార్గాలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలు, తీర్ధాలు ఉన్న ప్రదేశంగా భావించే పెహ్లా వద్ద పృథుచక్రవర్తి తనతండ్రికి అంత్యక్రియలు నిర్వహించాడని అందుకే దీనికీ పేరు వచ్చిందని, విశ్వామిత్రుడు బ్రహ్మఙానం పొందిన ప్రదేశం ఇదని విశ్వసించబడుతుంది. ఇక్కడ ఘోరక్ నాథుని శిష్యుడైన గరీబ్ నాథుని మందిరం ఉంది. ఇక్కడ అతి ప్రాచీనమైన విగ్రహాలు, నాణాలు లభించాయి.
* కామ్య తీర్థం ;- కురుక్షేత్రానికి 6 కిలోమీటర్ల దూరంలో పెహవాకు వెళ్ళే మార్గంలో కామోథా గ్రామం ఉంది. మహాభరతంలో వర్ణించబడిన కామ్యకవనమే కామోథాగా పిలువబడుతుందని విశ్వసిస్తున్నారు. ఇక్కడ పవమాన కామ్యకతీర్థం, శివమందిరం ఉన్నాయి. ఇక్కడ ప్రతి చైత్రశుక్ల సపమిలో మేళా నిర్వహించబడుతుంది. పాండవులు తమవనవాస సమయంలో ఇక్కడ నివసించారని పురాణ కథనాలలో వర్ణించబడి ఉంది.
* కుబేర తీర్థం :- భద్రకాళీ మందిరం సమీపంలో సరస్వతీ నదీతీరంలో ఉన్న ఈ తీర్థంలో కుబేరుడు యఙం చేసాడని విశ్వసించబడుతుంది.
* దధీచి తీర్ధం:-
 
== ప్రత్యేక ప్రదేశాలు ==
64,892

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/933008" నుండి వెలికితీశారు