వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 309:
::*వికీలో బ్లాగర్లకృషి నెమ్మదించిన తరుణంలో తెలుగు బ్లాగర్లను కలుపుకునేటందుకు మంచి ఆలోచన, చంద్రకాంతరావుగార్కి అభినందనలు..[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 05:36, 23 అక్టోబర్ 2013 (UTC)
::::స్పందించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు. తెవికీ ప్రారంభమై పది సంవత్సరాలు కావస్తున్ననూ పట్టుమని పదిమంది చురుకైన సభ్యులు కూడా లేకపోవడం, ఉన్న చురుకైన సభ్యుల మధ్యన ఏమిచేయాలన్ననూ సరైన సహకారం అందకపోవడం, ఏ నిర్ణయం తీసుకోవాలన్ననూ పూర్తిఫలితం ఇవ్వకపోవడం, చర్చలు ఎన్ని జరిగిననూ తుదినిర్ణయానికి అవకాశం లేకపోవడం, కొందరు సభ్యులకు నియమాలపై పూర్తిపట్టు లేకపోవడం, "స్వేచ్ఛా" విజ్ఞానసర్వస్వం అంటే ప్రతి ఒక్కరు ఏమైనా దిద్దుబాట్లు చేయవచ్చనే "స్వేచ్ఛ" ఉన్నట్లుగా కొందరు ఆలోచించడం తదితర కారణాలతో, తెవికీని ప్రస్తుతమున్న "దశ" నుంచి బయటపడేటట్లు చేయడమే కాకుండా కొత్తవారికి తెవికీ రచనాతీర్థం పుచ్చుకొనేటట్లు చేయడం గురించి ఆలోచించి ఈ దిశగా చేయబోయే ఒక చిన్న ప్రయత్నమే ఈ బ్లాగు ఆవిష్కరణ. ఇదివరకు ఇలా బ్లాగులు ప్రారంభించినవారు ఉండవచ్చు కాని ఈ బ్లాగులో మాత్రం ఏదో రెండువ్యాసాలు వ్రాసి మూతపడేటట్లు చేయడం మాత్రం నా ఉద్దేశ్యం కాదు. సాధ్యమైనంతవరకు తెవికీకి సమాంతరంగా ఉంటూ తెవికీ బయటా సభ్యులను ఆకర్షించడం, ఇక్కడి వ్యాసాలు, కృషిచేసే సభ్యుల గురించి తెలుగువారికి తెలియపర్చడం దీని లక్ష్యంగా పెట్టుకున్నాను. తెవికీలో ఎన్ని వ్యాసాలున్ననూ, మనం ఎంత కృషిచేస్తున్ననూ అది పదిమందికి ప్రయోజనం కలిగించాలంటే బలమైన తెలుగు బ్లాగులోకానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనాఉంది. అసలు తెలుగు వికీపీడియా అంటే చూడడం మాత్రమే అనుకుంటారు చాలా మంది. రోజూ ఎందరెందరో సభ్యత్వం తీసుకుంటున్ననూ ఒక్క దిద్దుబాట్లు కూడా చేయకపోవడానికి కారణం ఏమిటి? దీనిపైనా పరిశోధన చేయాలి, వారిచే దిద్దుబాట్లు చేయించాలి. పూర్తి లక్ష్యం నెరవేరడానికి కొంత సమయం పట్టవచ్చు, వెనువెంటనే ఫలితాల గురించి ఆశపడక లక్ష్యమే మనల్ని వెదుక్కుంటూ వచ్చేవరకు మన పని మనం చేద్దాం. ఈవిషయంలో సభ్యుల సలహాలు, సూచనలకు తప్పకుండా విలువ ఉంటుంది. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 14:39, 23 అక్టోబర్ 2013 (UTC)
:::::[[వాడుకరి:C.Chandra Kanth Rao]] గారు ఇది ఒక భగీరథ ప్రయత్నం. ఉడతాభక్తిగా, మీరు వ్రాసిన బ్లాగులను తెవికీ ఫేస్ బుక్ గుంపు మరియు ట్విటర్ ద్వారా వీలయినంత ఎక్కువమందికి తెలియజేయడానికి నా వంతు ప్రయత్నిస్తాను.--[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]])18:43, 24 అక్టోబర్ 2013 (UTC)
 
== ఐ.పి.నెంబరు తో ఇబ్బంది. ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు