"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

::* నేను మరల ఒకసారి పరిశీలించాను. నేనిచ్చిన పేజీ మార్పుల విభజన చూపెట్టుతుంది. దానిలో వేరే లింకు ద్వారా పేజీ వీక్షణల విభజన కూడాచూడవచ్చు. మూడు నెలలలో భారతదేశం నుండి జరిగిన మార్పులన్నిటిలో ఏ భాషలో ఎన్ని మార్పులు జరిగినవనేదానిని మొత్తముమార్పులతో భాగించితే వచ్చే దానినేశాతంగా చూపెట్టటము జరిగింది. ఇది ఇంతకు ముందలి త్రైమాసికంలో 4.8% గా నమోదైంది. అందువలన మనం ఎక్కువమార్పులు జరిగితే దీనిలో వృద్ధికనబడుతుంది లేక ఇతర భాషలలో ఏవిధంగానైన మార్పులు తగ్గితే మనం మొదటి స్థానానికి చేరవచ్చు. ఇతర భాషల మార్పులు లో భారీ తేడాలు రావటానికి కారణాలు నాకు తెలిసి గత త్రైమాసికంలో జరగలేదు. బహుశా తమిళ వికీదశాబ్ది ఉత్సవాలు తప్ప. అందుకని మన భాషలో జరిగిన మార్పులే దీనికి కారణమని అనుకుంటున్నాను. దీనితో పాటు [http://stats.wikimedia.org/wikimedia/squids/SquidReportPageViewsPerCountryTrends.htm వీక్షక అభ్యర్ధనలను కూడా దేశాల వారీగా వాటిలో భాషల విభజన ప్రకారం] చూస్తే తెలుగు 0.2 శాతం గానమోదైంది. మన [[వాడుకరి:వైజాసత్య| వైజాసత్య]] గారి అలాగే [[వాడుకరి:కిరణ్మయి|కిరణ్మయి]] గారి మార్పులు దీనిలోలెక్కకు రాలేదు. వారు అమెరికాలో వుంటున్నారు కాబట్టి. ఈ గణాంకాలకి ఆపేజీలో తెలిపినట్లు పరిమితులుంటాయి. అలాగే నేను మరల పరిశీలించినపుడు ఇవి వికీపీడియాకి మాత్రమే అని తెలిసింది. మరిన్ని వివరాలు సెప్టెంబరు గణాంకాలు తెలిసినప్పుడు తెలియవచ్చు. చంద్రకాంతరావుగారు చెప్పినట్లు మరి ఇతర నివేదికల మార్పులు పరిశీలించినపుడు ఐదారుగురు బలమైన ఎడిటర్లు వలన ఈ మార్పు జరిగిందని భావిస్తాను. దీనిని నిలబెట్టుకోవడం చాలాకష్టం. వికీపరిచయం తెలుగువారికి ఎక్కువగా కలిగినప్పుడు 5 కన్నా ఎక్కువ మార్పులు చేసేవారు గణనీయంగా పెరిగినప్పుడే మన తెవికీ అభివృద్ధిపధంలో పడిందనుకోవాలి. గత నాలుగైదుసంవత్సరాలుగా నేను కాని, [[సభ్యుడు:C.Chandra Kanth Rao]] గారు కాని అప్పుడప్పుడు గణాంకాల విశ్లేషణ చేస్తున్నాము. ఆసక్తిగల సభ్యులు మరింత మంది దీనిపై దృష్టిపెట్టాలి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల ప్రాజెక్టు చేసినప్పుడు స్పష్టమైన [[వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర_ప్రదేశ్_జిల్లాలు|గణాంకాలతో]] విశ్లేషణ చేయడం జరిగింది. వాటిని పొందడానికి తగిన మైఎస్క్యూఎల్ స్క్రిప్ట్ కూడా సంబంధిత చర్చాపేజీలో రాయడం జరిగింది. ఎవరైనా ముందుకు వస్తే నాకు తెలిసినది పంచుకోగలను. ఈ పైన చెప్పినవాటిని ఇతరులుకూడా పరిశీలించి ధృవీకరించమని మనవి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 15:52, 24 అక్టోబర్ 2013 (UTC)
:: ఇది తెవికీ పీడియన్లు అనందించవలసిన విషయం. ఈ ఉత్సాహంతో మనమందరం కలిసికట్టుగా పనిచేసి అన్ని విషయాలలో మొదటి స్థానానికి వచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ విషయం మనకందరికీ అందించి మనలో సరికొత్త ఉత్సాహం నింపిన అర్జునరావుగారికి ధన్యవాదాలు. తెవికీ సభ్యుడుగా విష్ణువర్ధన్ గారు అందిస్తున్న సహకారం ఈ అభివృద్ధికి మరింత కారణం. అలాగే వర్గాలలో అత్యధిక మార్పులు చేసిన ఉత్సాహవంతుడైన వైవి.ఎస్ రెడ్డి గారు , తెలుగు ప్రముఖుల ప్రణాళికను చేపట్టిన రాజసేఖర్ గారూ, భాస్కరనాయుడు గారు, యువ వికీపీడియన్లు ఉత్సాహవంతులు అయిన రహ్మానుద్దీన్, ప్రణయరాజ్ మరియు విశ్వనాథ్ గార్లు, స్వల్పకాలంలో అత్యధిక వ్యాసాలు మరియు వ్యాసేతర సేవలు అందించిన వెంకట రమణగారూ , పాలగిరిగారు ఈ ముందడుగుకు కారణం అని భావిస్తున్నాను. ఇంకా ఉత్సాహంగా పనిచేస్తున్న తెవికీ సభ్యులందరికీ ఈ అభివృద్ధికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కలిసి నడుస్తాం మరింత అభివృద్ధి సాధిస్తాం. --[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 18:25, 24 అక్టోబర్ 2013 (UTC)
తెలుగులో వ్యాసాలు వ్రాయడం మొదలుపెట్టాక, కొన్ని కారణాల వల్ల అనుకున్నట్టు చేయలేకపోయాను. చరిత్ర పుస్తకాల నుంచి, వైజ్ఞానిక విషయాలు అనువదించడం సరి అంటే, నేను ఆ పనిలో నిమగ్నమవుతాను. [[వాడుకరి:కిరణ్మయి|కిరణ్మయీ]] ([[వాడుకరి చర్చ:కిరణ్మయి|చర్చ]]) 22:42, 24 అక్టోబర్ 2013 (UTC)
 
== సముచిత వినియోగానికి తెవికీలో విధాన నిర్ణయం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/934277" నుండి వెలికితీశారు