గుమ్మడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
 
==ఆయుర్వేదములో గుమ్మడి :==
[[File:Gummadi 2.JPG|thumb|right|తీయ గుమ్మడి]]
 
గుమ్మడికాయ పండినది:-Pumpkin-ripe బాగుగా ముదిరిన, పండిన గుమ్మడి కాయ వండిన మధురముగ నుండును. రుచిబుట్టించును. దేహ పుష్టి, బలము, వీర్యవృద్ధి, మేహశాంతి, దాహము, తాపము, కడుపుబ్బు లను తగ్గించును. చెడు రక్తమును బుట్టించును. అలస్యముగ జీర్ణమగును; వాతము జేయును; దీనికి విరుగుళ్ళు 1 శొంఠి, 2 కాక ఔషధములు, 3 కానుగ వేరు రసము. ఔషధ సేవలో పథ్యమైన వస్తువు. గుమ్మడి కాయ లేతది:- Pumpkin-tender. దీని కూర మిక్కిలి వాతము, రక్త పైత్యము, అగ్నిమాంద్యము జేయును; దుర్బల దేహులు, రోగులు దీనిని పుచ్చుకొనగూడదు; మిక్కిలి అపథ్యమైనది. దీనికి విరుగుళ్ళు గుమ్మడి పువ్వులు :-Flowers of pumpkin plant. పైత్యమును, సన్నిపాతములను హరించును; వీనిని కూరవండుదురు. గుమ్మడికొసల కూర :-Curry of the tender leaves of pumpkin plant. తియ్య గుమ్మడి తీగె కొసలు అనగా లేత ఆకుల కూర ఆమ్ల దోషము, వాతము, గుల్మము, జ్వరము, ఉబ్బు, విదాహము వీని నణచును; జఠరదీప్తి నిచ్చును
 
"https://te.wikipedia.org/wiki/గుమ్మడి" నుండి వెలికితీశారు