పత్తిగింజల నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
===పత్తిగింజ===
పత్తినుండి దూదిని, గింజలను జిన్నింగ్‌ మిల్లులో వేరుచెయ్యుదురు. పత్తినుండి దూదిని వేరుచేసిన తరువాత కూడా విత్తనంపై సన్నని నూగు పదార్థం వుండును. దీనిని 'లింటర్స్', అంటారు. డిలింటింగ్‌ మెషిన్‌ ద్వారా ఈ లింటరును తొలగించెదరు <ref>http://www.padsons.com/cotton-seed-delinting-plant.htm</ref> . ఈ లింటరుకు కూడా మార్కెటింగ్‌ వున్నది. విత్తనం నల్లని, గట్టి పెంకును (hull) కల్గి లోపల మొత్తటి పసుపు వర్ణంలో వున్న గింక/పిక్కను కల్గివుండును. విత్తనంలో 5% వరకు లింటరు, 40-45% వరకు పెంకును కల్గివుండును. విత్తనం అండాకారంగా వుండి, 7-9 మి.మీ. పొడవు,3-5 మి.మీ. వెడల్పు వుండును. మొత్తం విత్తనంలో నయినచో 20-25% వరకు నూనె వుండును. పెంకు తొలగించిన గింజ/పిక్కలో 40-45% వరకు నూనె వుండును. విత్తనం నుండి నూనెను పై పెంకును తొలగించి (decorticated), లేదా ఆలాగే మొత్తం విత్తనాన్ని (non decorticated) మిల్లులో ఆడించి నూనె తీయుదురు. మొత్తం విత్తనంను మిల్లింగ్‌ చేసిన 13-15% వరకు నూనె వచ్చును, 6-8% వరకు నూనె ఆయిల్‌కేకులో వుండిపోవును. పెంకు తొలగించిన గింజలను ఆడించిన 35-45% వరకు నూనె దిగుబడి వచ్చును. మొత్తం విత్తనంను మిల్లింగ్‌ చేయగా వచ్చిన కేకులో ప్రొటీన్‌ శాతం 20-22% వుండగా, పెంకు తొలగించిన గింజల నుండి వచ్చు కేకులో ప్రోటిన్‌ శాతం 35-40% వుండును<ref name="sea"/>.
 
'''పత్తి విత్తనంలో సమ్మేళన పదార్థాలు'''<ref>http://learningstore.uwex.edu/assets/pdfs/a3519.pdf</ref>
"https://te.wikipedia.org/wiki/పత్తిగింజల_నూనె" నుండి వెలికితీశారు