ఐజాక్ మెరిట్ సింగర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
 
==వారసులు==
ఐజాక్ యొక్క ఇరవైయ్యో సంతానం, [[విన్నరెట్టా సింగర్]] (ఇసబెల్లా బోయెర్ కూతురు) తన 22వ యేట 1887లో ప్రిన్స్ [[లూయీ దే స్కీ-మాంట్‌బెలిర్డ్]] ను వివాహమాడింది. 1891లో ఈ వివాహం తెగతెంపులైన తర్వాత, ఈమె 1893లో ప్రిన్స్ [[ఎడ్మండ్ దే పొలినాక్]] కు పెళ్ళిచేసుకొంది. ఆ తర్వాత కాలంలో ఈమె ఫ్రెంచి అవాంట్ గార్డ్ సంగీతానికి ప్రముఖ పోషకురాలైంది. మచ్చుకు ఎరిక్ సేటీ తన సొక్రాటే అనే సంగీత ఖండాన్ని ఆమె పురమాయింపుతోనే సృష్టించాడు. లెస్బియనుగా ఈమె 1923 నుండి వయొలెట్ ట్రెఫూసిస్ తో క్రియాశీలకంగా పనిచేసింది.
 
ఐజాక్, ఇసబెల్లా బోయెర్ల యొక్క మరో కూతురైన, ఇసబెల్-బ్లాంచ్ సింగర్ (1869–1896), [[జాన్, డూక్ దే డెకాజెస్]]ను పెళ్ళిచేసుకుంది. డెయిజీ ఫెల్లోస్ వీరి కూతురే. ఇసబెల్-బ్లాంచ్ 1896లో ఆత్మహత్య చేసుకొంది.
 
ఐజాక్ యొక్క పెద్ద కుమారుడు, 1914లో మరణించిన విలియం సింగర్, సారా సింగర్ వెబ్ తో వివాహం ద్వారా విలియం సువర్డ్ వెబ్‌కు స్వయానా బావమరిది. విలియం వెబ్ భార్య వాండర్బిల్ట్ వంశానికి చెందిన [[ఎలీజా వాండర్బిల్ట్]]. విలియం సింగర్ కూతురు, ఫ్లోరెన్స్ సింగర్ (ఆ తర్వాత కాలంలో కౌంటెస్ వాన్ డిర్న్), తన మేనత్తలు విన్నరెట్టా మరియు ఇసబెల్ఇసబెల్‌ల మాదిరిగానే ఐరోపా సాంప్రదాయ రాజకీయ కుటుంబంలో పెళ్ళిచేసుకొంది.
 
ఐజాక్ రెండో కుమారుడు పారిస్ యూజీన్ సింగర్ (జ. పారిస్, 20 ఫిబ్రవరి 1867; మ. లండన్, 24 జూన్ 1932), సిసీలియా హెన్రియట్టా ఆగస్టా "లిల్లీ" గ్రహామ్ ను పెళ్ళిచేసుకున్నాడు (జ. [[పెర్త్]] [[ఆస్ట్రేలియా]], 6 జూన్ 1867; మ. [[పెయింటన్]], 7 మార్చి 1951).
 
[[వాష్టింగన్ సింగర్]], (ఇసబెల్లా బోయెర్ కుమారుడు) ఆ తర్వాత కాలంలో ఎక్సీటర్ విశ్వవిద్యాలయంగా రూపుదాల్చిన యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ సౌత్-వెస్ట్ ఆఫ్ ఇంగ్లండ్ యొక్క ప్రధానదాత. విశ్వవిద్యాలయంలో ఒక భవనానికి ఈయన పేరు పెట్టారు.
 
సింగర్ కుటుంబపు ప్రముఖ వారసులలో హెర్బర్ట్ మోన్రోస్ సింగర్ (జ. [[పెయింటన్]], 22 జూన్ 1888; మ. [[లండన్]], 3 నవంబర్ 1941), సీసిల్ మార్టిమర్ సింగర్ (జ. [[లండన్]], 16 జూలై 1889; మ. [[న్యూయార్క్]], 28 జనవరి 1954 ), పారిస్ గ్రహాం సింగర్ మరియు జార్జెస్ ఫర్క్వార్ సింగర్ (జ. లండన్, 28 ఫిబ్రవరి 1892; మ. డేటోనా బీచ్, ఫ్లోరిడా, 19 జూలై 1955) మరి కొందరు.