ఐజాక్ మెరిట్ సింగర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 50:
 
==వివాహాలు, విడాకులు మరియు పిల్లలు ==
ఆర్థిక విజయంతో సింగర్, న్యూయార్క్‌లోని [[ఐదవ ఎవెన్యూ]] లో ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. అందులోకి 1860 లో తన రెండవ కుటుంబాన్ని మార్చాడు. స్టీఫెన్ కెంట్ తో అక్రమ సంబంధముందన్న ఆధారంతో సింగర్ తన మొదటి భార్య క్యాథరిన్ కు విడాకులు ఇచ్చాడు. మేరీ అన్న్ తో సహజీవనం యధాతథంగా కొనసాగించాడు. ఒక రోజు అనుకోకుండా మేరీ అన్న్‌కు, ఐజాక్ తన వద్ద పనిచేస్తున్న మేరీ మెక్‌గోనిగల్ అనే ఒక ఉద్యోగి పక్కన కూర్చుని ఐదవ ఎవెన్యూలో వివహరిస్తూ కనపడేవరకు ఈ సహచర్యం కొనసాగింది. మేరీ అన్న్‌కు అంతకు మునుపే మేరీ మెక్‌గోనిగల్‌పై ఉన్న అనుమానం ఋజువైంది. అయితే అప్పటికే, మెక్‌గోనిగల్ సింగర్ యొక్క ఐదుగురు పిల్లలకి జన్మనిచ్చింది. ఈ కుటుంబ సభ్యుల యింటిపేర్లు మాథ్యూస్ గా వాడబడినవి. మేరీ అన్న్ (ఇంకనూ మిసెస్ ఐ.ఎం.సింగర్ గా పిలుచుకొనేది) తన భర్తను [[రెండవ వివాహం]] నకు అరెస్టు చేయించింది. సింగర్ బెయిలుపై విడుదలై, 1862 లో మేరీ మెక్ గోనియల్ తో సహా లండన్ పారిపోయాడు. ఆ తరువాత ఈ విషయపు దృష్టాంతంలో ఐజాక్‌కు లోవర్ మన్‌హాటన్లో మేరీ ఈస్ట్‌వుడ్ వాల్టర్స్ అనే మరో భార్య ఉందని వెలికివచ్చింది. ఆమెతో పుట్టిన కుమార్తె ఆలిస్ ఈస్ట్‌వుడ్, మెరిట్ ను యింటిపేరుగా స్వీకరించింది. 1860 లో ఐజాక్ తనకు మొత్తం నలుగురు స్త్రీలతో పద్దెనిమిది మంది సంతానం (అప్పటికి 16 మంది జీవించి ఉన్నారు) ఉన్నట్టు అంగీకరించాడు.
 
ఐజాక్ లండన్లో ఉండగా, మేరీ ఆన్, ఐజాక్ ఆస్తులన్నింటి మీద ఆర్ధిక హక్కులను సాధించేందుకు ఐజాక్ యొక్క అక్రమసంబంధాలను వివరిస్తూ దస్తావేజులను పంపించింది. తనకు ఐజాక్ తో సాంప్రదాయకంగా ఎప్పుడూ పెళ్లి జరగకపోయినా, ఉమ్మడి చట్టం ప్రకారం ఐజాక్ తన మొదటి భార్య కాథరిన్‌కు విడాకులిచ్చిన తర్వాత తనతో ఏడునెలలు కలిసి ఉండటం వలన భార్యాభర్తలైనట్టు న్యాయస్థానంలో దరఖాస్తు పెట్టుకుంది. తుదకు న్యాయస్థానం ఈ విషయంపై ఒక ఒప్పందం కుదిర్చింది కానీ విడాకులు మంజూరు చేయలేదు. తను ఎవరినైనా పెళ్ళిచేసుకునేందుకు స్వతంత్రురాలినని ప్రకటించుకొని జాన్ ఈ.ఫాస్టర్ ను వివాహమాడింది. ఇదిలా ఉండగా ఐజాక్ 1860 లో పారిస్ నివసిస్తున్నప్పుడు పరిచయమైన ఫ్రెంచి వనిత ఇసబెల్లా యూజీన్ బోయర్ ను తిరిగి సంబంధమేర్పరచుకొన్నాడు. ఆమె తన భర్తను వదిలి జూన్ 13, 1863న ఇసబెల్లా యూజీన్ సోమర్‌విల్ల్ అనే పేరుతో గర్భవతిగా ఉన్నప్పుడే ఐజాక్ ను పెళ్ళిచేసుకొంది. ఇసబెల్లాతో ఐజాక్ కు ఇద్దరు కూతుర్లు మరియు నలుగురు కుమారులు కలిగారు. ఐజాక్ మరణం తర్వాత ఈమె 1879లో ఈమె విక్టర్ ర్యూబ్సెట్ (మ.1887) 1891 లో పాల్ సొహేజ్ ను పెళ్ళిచేసుకొంది.
పంక్తి 62:
 
==వారసులు==
ఐజాక్ యొక్క ఇరవైయ్యో సంతానం, [[విన్నరెట్టా సింగర్]] (ఇసబెల్లా బోయెర్ కూతురు) తన 22వ యేట 1887లో ప్రిన్స్ [[లూయీ దే స్కీ-మాంట్‌బెలిర్డ్]] ను వివాహమాడింది. 1891లో ఈ వివాహం తెగతెంపులైన తర్వాత, ఈమె 1893లో ప్రిన్స్ [[ఎడ్మండ్ దే పొలినాక్]] కు పెళ్ళిచేసుకొంది. ఆ తర్వాత కాలంలో ఈమె ఫ్రెంచి అవాంట్ గార్డ్ సంగీతానికి ప్రముఖ పోషకురాలైంది. మచ్చుకు ఎరిక్ సేటీ తన సొక్రాటే అనే సంగీత ఖండాన్ని ఆమె పురమాయింపుతోనే సృష్టించాడు. లెస్బియనుగా ఈమె 1923 నుండి ఇంగ్లీషు రచయిత్రి వయొలెట్ ట్రెఫూసిస్ తో సంబంధం ఉన్నది.
 
ఐజాక్, ఇసబెల్లా బోయెర్ల యొక్క మరో కూతురైన, ఇసబెల్-బ్లాంచ్ సింగర్ (1869–1896), [[జాన్, డూక్ దే డెకాజెస్]]ను పెళ్ళిచేసుకుంది. డెయిజీ ఫెల్లోస్ వీరి కూతురే. ఇసబెల్-బ్లాంచ్ 1896లో ఆత్మహత్య చేసుకొంది.
 
ఐజాక్ యొక్క పెద్ద కుమారుడు, 1914లో మరణించిన విలియం సింగర్, సారా సింగర్ వెబ్ తో వివాహం ద్వారా విలియం సువర్డ్ వెబ్‌కు స్వయానా బావమరిది. విలియం వెబ్ భార్య వాండర్బిల్ట్ వంశానికి చెందిన [[ఎలీజా వాండర్బిల్ట్]]. విలియం సింగర్ కూతురు, ఫ్లోరెన్స్ సింగర్ (ఆ తర్వాత కాలంలో కౌంటెస్ వాన్ డిర్న్), తన మేనత్తలు విన్నరెట్టా మరియు ఇసబెల్‌ల మాదిరిగానే ఐరోపా సాంప్రదాయ రాజకీయ కుటుంబంలో పెళ్ళిచేసుకొంది.
 
ఐజాక్ రెండో కుమారుడు పారిస్ యూజీన్ సింగర్ (జ. పారిస్, 20 ఫిబ్రవరి 1867; మ. లండన్, 24 జూన్ 1932), సిసీలియా హెన్రియట్టా ఆగస్టా "లిల్లీ" గ్రహామ్ ను పెళ్ళిచేసుకున్నాడు (జ. [[పెర్త్]] [[ఆస్ట్రేలియా]], 6 జూన్ 1867; మ. [[పెయింటన్]], 7 మార్చి 1951).
 
[[వాష్టింగన్ సింగర్]], (ఇసబెల్లా బోయెర్ కుమారుడు) ఆ తర్వాత కాలంలో ఎక్సీటర్ విశ్వవిద్యాలయంగా రూపుదాల్చిన యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ సౌత్-వెస్ట్ ఆఫ్ ఇంగ్లండ్ యొక్క ప్రధానదాత. విశ్వవిద్యాలయంలో ఒక భవనానికి ఈయన పేరు పెట్టారు.
 
సింగర్ కుటుంబపు ప్రముఖ వారసులలో హెర్బర్ట్ మోన్రోస్ సింగర్ (జ. [[పెయింటన్]], 22 జూన్ 1888; మ. [[లండన్]], 3 నవంబర్ 1941), సీసిల్ మార్టిమర్ సింగర్ (జ. [[లండన్]], 16 జూలై 1889; మ. [[న్యూయార్క్]], 28 జనవరి 1954 ), పారిస్ గ్రహాం సింగర్ మరియు జార్జెస్ ఫర్క్వార్ సింగర్ (జ. లండన్, 28 ఫిబ్రవరి 1892; మ. డేటోనా బీచ్, ఫ్లోరిడా, 19 జూలై 1955) మరి కొందరు.