పిలు నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
Salvadora oleoides చెట్టువిత్తనాలు చిన్నవిగా,గట్టిగా,చేదుగా వుండటంవలన పైపొట్టును డికార్టికెటరుయంత్రాలద్వారా తొలగించడం కష్టమైనపని.salvadora persica చెట్టువిత్తనాలనే నూనె తీయుటకు,మిల్చ్ పశువులకు ఎక్కువపాలు ఇచ్చుటకై దాణా గాను ఉపయోగిస్తారు.పెర్సిక(persica) విత్తనాలు తియ్యగావుండి నూనెశాతంను కూడా 39% వరకు కలిగివుండును.ఒలియొడెస్(oleodes)గింజలు చేదుగా వుండును. గట్టిరకం విత్తనాలు 21% వరకు మాత్రమే నూనెను కల్గివుండును.కాయ\పండులో గింజశాతం 44-46% వరకుండును.గింజలో ప్రొటీన్ శాతం 27% వరకుండును.S.persica గింజలను డికార్టికేసన్ చేసిన తరువాత యంత్రాలలో క్రషింగ్ చేయుదురు.S.Oleoids గింజలను డికార్టికెసన్ చెయ్యకుండనే క్రషింగ్‍చేయుదురు.ఏడాదికి 50వేలటన్నుల గింజలనుసేకరించి,క్రషింగ్ చేయు అవకాశం వున్నది.ఇంచుమించు ఏడాదికి 17వేల టన్నుల పిలునూనెను ఉత్పత్తిచేయు వీలున్నది.
 
పిలునూనెలో [[సంతృప్త కొవ్వు ఆమ్లాలశాతంఆమ్లం| సంతృప్త కొవ్వు ఆమ్లాల]] శాతం ఎక్కువగా వుండటంవలన,సాధారణ,మరియు శీతలఉష్ణొగ్రత సమాయల్లో ఈనూనెగడ్డగట్టి వుండును.అందుచే దీన్ని నూనె కన్న కొవ్వు(Fat)అనటం సబబు.
 
పిలునూనెలో బెంజైల్ ఐసొథైసైయనెట్(Menzyl isoythiocynate)వుండటంవలన ఘాటైనవాసన కల్గివుండును.రుచి కూడా వికారం పుట్తించునట్లుండును.నూనె ఆకుపచ్చఛాయకలిగిన పసుపురంగులో వుండును.నూనెను రిఫైండ్‍చేసినప్పుడు వెగటురుచి,ఘటైనవాసన రెండు తొలగింపబడుతాయి.
"https://te.wikipedia.org/wiki/పిలు_నూనె" నుండి వెలికితీశారు