మాధవపెద్ది సత్యం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''మాధవపెద్ది సత్యం ''' [[తెలుగు సినిమా]] నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. ఈయన [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడ]], [[మళయాళం]], [[హిందీ]] మరియు [[సింహళ భాష]]లతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందాడు.
సత్యం
తెలుగు రంగస్థలముపై మల్లాది సూర్యనారాయణ నాటక బృందములోని సభ్యునిగా హరిశ్చంద్ర నాటకములో నక్షత్రకుని పాత్రను అద్భుతము పోషిస్తూ పెరుతెచ్చుకున్నాడు. ఈయన ప్రతిభను గుర్తించిన [[ఆలూరు చక్రపాణి|చక్రపాణి]] సత్యంను తనతోపాటు మద్రాసు తీసుకువెళ్లి, తను నాగిరెడ్డితో కలిసి అప్పడే కొత్తగా స్థాపించబడిన విజయా పిక్చర్స్ పతాకము కింద నిర్మిస్తున్న షావుకారు చిత్రములో నటించే అవకాశము కలుగజేశాడు. ఈయన తొలిసారిగా వెండితెరపై హిందీ, తమిళ ద్విభాషాచిత్రం రామదాసులో కనిపించాడు. ఈ సినిమాకు రెండు భాషల్లోనూ తన పాత్ర యొక్క పాటలు తనే స్వయంగా పాడాడు. మాధవపెద్ది సత్యం [[షావుకారు]] సినిమాతో తెలుగు సినిమా రంగములో అడుగుపెట్టాడు. ఈ సినిమాలో సత్యం ఒక గుడ్డివాని పాత్రపోషించి ఆ పాత్రకు ఉన్న మూడు పాటలు పాడాడు. ప్రసిద్ధిమైన పాటలు ''అయ్యయో జేబులో డబ్బులు పోయెనే'' మరియు [[మాయాబజార్]] సినిమాలోని ''వివాహ భోజనంబు'' ఈయన మధురకంఠమునుండి జాలువారినవే. కొన్ని తెలుగు చిత్రాలలో నటించినా మాధవపెద్ది సత్యం ప్రధానంగా గాయకుడే. ఈయన ఆనాటి ప్రసిద్ధ సంగీతదర్శకులైన [[సాలూరు రాజేశ్వరరావు]], [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] తదితరులందరితో పనిచేశాడు. సత్యం ఎస్వీ రంగారావు మరియు రేలంగి వెంకటరాయయ్య పాటలన్నీ దాదాపు తనే పాడాడు. ఈయన పౌరాణిక చిత్రాలలో పద్యాలు పాడటములో ప్రసిద్ధి చెందాడు.
|