జీవ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
జీవి అధ్యయనము జీవ శాస్త్రము (biology). జీవుల ఉద్భావన, లక్షణాలు, వర్గీకరణ, జీవకోటిలో జాతులు, పర్యావరణ చట్రంలో వాటి మనుగడ, ఇలా ఎన్నో కోణాల నుండి జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు. కనుక జీవ శాస్త్రము యొక్క పరిధి చాలా విస్త్రుతమైనది. వృక్షశాస్త్రం (botany), జంతుశాస్త్రం (zoology), వైద్యశాస్త్రం (medicine) మొదలైన వర్గాలు చాలరోజులబట్టీ వున్నవే. ఈ రోజులలో ఈ వర్గీకరణ కూడ బాగా వ్యాప్తి చెందింది. జీవి లక్షణాలని అణు (atomic), బణు (molecular) ప్రమాణాలలో అధ్యయనం చేస్తే దానిని బణుజీవశాస్త్రం (molecular biology) అనీ, జీవరసాయనం (biochemistry) అనీ, బణుజన్యుశాస్త్రం (molecular genetics) అనీ అంటున్నారు. జీవి లక్షణాలని జీవకణం స్థాయిలో చదివితే దానిని కణజీవశాస్త్రం (cell biology) అనీ, అంగము (organ) స్థాయిలో పరిశీలిస్తే దానిని ఎనాటమీ (anatomy) అనీ, ఇలా రకరకాల కోణాలలో జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు.
 
 
"https://te.wikipedia.org/wiki/జీవ_శాస్త్రం" నుండి వెలికితీశారు