భద్రిరాజు కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కొత్త పేజీ: ఇరవైయవ శతాబ్దపు భాషాశాస్త్ర కోవిదులలో గిడుగు రామమూర్తి తరువా... |
(తేడా లేదు)
|
04:07, 5 ఏప్రిల్ 2007 నాటి కూర్పు
ఇరవైయవ శతాబ్దపు భాషాశాస్త్ర కోవిదులలో గిడుగు రామమూర్తి తరువాత ఎన్నదగ్గ వ్యక్తి కృష్ణమూర్తి. భాషాతత్వం, భాషా ప్రయోజనం, భాషా వికసనం వీరిరువురికి అవగాహన అయినంతగా మరెవ్వరికీ కాలేదేమో. భాషా శాస్త్రాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి అధ్యాపనం చేయగల సత్తా నిరూపించుకున్న పండితుడు భద్రిరాజు కృష్ణమూర్తి. భాషాశాస్త్ర విజ్ఞానిగా ఈయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.ద్రావిడ భాషా తత్వాన్ని గురించి,తెలుగు ధాతువుల ప్రాతిపదిక స్వరూప స్వభావాల గురించి, తెలుగు భాష నవీకరణ గురించి ఎన్నెన్నో పరిశోధనా గ్రంధాలు, వ్యాసాలు రచించారు.