జైన మతం: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
పంక్తి 17:
==చరిత్ర==
[[File:Mahavir.jpg|150px|right|thumb|వర్థమాన మహావీరుడు]]
క్రీ.పూ ఆరవ శతాబ్దంలో మతపరంగా సమాజం ఒక కుదుపుకు లోనైంది. ఈ కాలంలో నైతిక, ఆధ్యాత్మిక అశాంతి నెలకొని ఉంది. ప్రపంచం మొత్తం మీద నాడు ఉన్న యధాతధ స్థితిలో విసిగిపోయిన జనం ఎదురు తిరిగారు. గ్రీసు బయోనియో గిరాక్లీటీజ్ నూతన సిద్ధాంతాన్ని ప్రవచించారు. జరతూష్ట్ర [[ఇరాన్]] లో, [[చైనా]] లో [[కన్ఫ్యూజియన్కన్ఫ్యూషియస్]] లు ఉన్న పరిస్థితులకు వ్యతిరేకంగా తమ నూతన సిద్ధాంతాలను ప్రతిపాదించారు. భారత దేశంలోనూ ఇదే జరిగింది. ప్రాచీన మత ధర్మాలలో, కర్మకాండ క్రతువుల భారంతో జనం విసిగి పోయి ఉన్నారు. మత సంస్కృతి యొక్క మృత భారంతో నడుములు వంగిపోయాయి. పూజారి వర్గం, అసమానతలు, సామాజిక స్తబ్దత, అధర్మం, బలులు, కులవ్యవస్థ లతో సమాజం కుళ్ళిపోయింది. విప్లవం తప్పనిసరి అయింది. "వ్యక్తి ఆడగాని, మగ గాని మానవ మాతృడుగా తన ముక్తిని తానే సాధించుకోవాలి. జీవితం లక్ష్యం కాదు. ఆధ్యాత్మీకరణ మార్గంలో అది ఒక పరికరం మాత్రమే. అంతిమ లక్ష్యం భౌతికం కాదు ఆధ్యాత్మిక సామాజీకరణం కాదు. "ఆధ్యాత్మీకరణం" అన్నది నూతన విప్లవం.
 
ఈ నేపథ్యం లో భారత దేశంలో రెండు మతాలు, ఉపనిషన్మతానికి వ్యతిరేకంగా వెలిశాయి. అవి జైన, బౌద్ధ మతాలు. ఈ రెండింటి తాకిడి తో బ్రాహ్మణ మతం అనేక మార్పులకు లోనైంది. అసలు మనం భగవద్గీతను, ఈ రెండు మతాల సవాళ్ళకు సమాధానంగానే చూడవలసి ఉంటుంది. హిందూ మతానికి అవి వ్యతిరేకమే అయినా, మొత్తం మతాలు భారతదేశంలో ప్రక్క ప్రక్కనే నివాసం చేశాయి.
"https://te.wikipedia.org/wiki/జైన_మతం" నుండి వెలికితీశారు