భీమారామం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
 
== ఆలయ ప్రశస్థి ==
చాళుక్య భీముడు ఈ దేవాలయానికి ప్రాకారాలను , గోపురాన్నినిర్మించాడనడానికి చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. అందువలన ఇది భీమారామంగా పిలువబడుతుంది.ఇక్కడి శివలింగ చంద్రప్రయిష్టితం కనుక సోమేశ్వరం అనికూడా పిలువబడుతుంది.భక్త సులభుడైన పరమశివుడు ఇక్కడ సోమేశ్వరస్వామి పేరుతో నిత్య పూజలందుకుంటూ ఉంటాడు. ఇక్కడి అమ్మవారు 'అన్నపూర్ణ'గాఅన్నపూర్ణగా భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది. ఈ క్షేత్రంలోని చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పటాపంచలవుతాయనిపోతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.
 
==ఈ ఆలయంలో ప్రత్యేకతలు==
శ్వేతవర్ణంలో కనిపించే ఈ లింగము కృమ క్రమముగా[[ అమావాస్య ]]వచ్చే సరికి భూడిద లేదా గోధుమ వర్ణమునకు మారిపోతుంది తిరిగి [[పౌర్ణమి]] వచ్చేసరికి యదాతధంగా శ్వేతవర్ణములో కనిపిస్తుంది. ఈ దేవాలయంలోని లింగము చంద్రునిచే ప్రతిష్టించిన చంద్రశిల కనుక ఈ మార్పులు కలుగుతున్నాయని అంటుంటారు. ఈ మర్పులను గమనించాలంటే పౌర్ణమికి అమావాస్యకు దర్శిస్తే తెలుస్తుంది. ఆలయపు ముందు బాగమున కోనేరుకలదు ఈ కోనేరు గట్టున రాతి స్థంభముపై ఒక నందీశ్వరుని విగ్రహము కలదు ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ఈ ఆలయము రెండు అంతస్తులుగా ఉంటుంది. అదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే అదే గర్భాలయ పైబాగాన రెండవ అంతస్తులో వేరే గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/భీమారామం" నుండి వెలికితీశారు