బట్టతల: కూర్పుల మధ్య తేడాలు

తల లేదా శరీర నుండి జుట్టు నష్టం
(తేడా లేదు)

15:19, 7 నవంబరు 2013 నాటి కూర్పు

మానవులలో మరియు కొన్ని జంతువులలో తలపై సహజముగా పెరిగే వెంట్రుకలు ఒక వయస్సు వచ్చిన తర్వాత క్రమంగా రాలిపోయి బట్టతల అనే వ్యాధికి దారితీస్తాయి.

బట్టతల
SpecialtyDermatology Edit this on Wikidata

అధ్యయనము

పురుషుల్లో బట్టతల ఆరంభం కావడానికి భూమి ఆకర్షణ శక్తి కూడా కారణం అయ్యే అవకాశముందని, దీనికితోడు టెస్టోస్టిరాన్‌లో మార్పులు కూడా కారణమని అమెరికా పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. టెస్టోస్టిరాన్‌లో మార్పుల వల్ల తలపై కొన్ని భాగాల్లో జట్టు ఊడిపోతుందని, హార్మోన్‌లో ఈ మార్పును డిహైడ్రోటెస్టోస్టిరాన్ (డీహెచ్‌టీ) అంటారు. డీహెచ్‌టీ వల్ల తలపై ఉండే చర్మంలో కొవ్వు మోతాదు తగ్గగడం వల్ల ఒత్తిడిని తట్టుకోలేక జట్టు ఊడిపోతుందన్నది వీరి పరిశోధనలో గుర్తింపు. ఇలా మాడుపై కాకుండా శరీరంలోని ఇతర భాగాల్లో వచ్చే వెంట్రుకల విషయంలో మాత్రం డీహెచ్‌టీ పాత్ర విభిన్నంగా ఉంటుంది. దీనికితోడు ఇతర పురుష హార్మోన్ల వల్ల అక్కడి వెంట్రుకల కింద చర్మం మందంగా తయారవుతుందని అంటున్నారు. అయితే, వయసు పెరిగే కొద్దీ చర్మం, దాని కింది కొవ్వు తగ్గిపోవడంతో వెంట్రుకలు ఊడిపోతాయి. దీనికి పురుషుల్లో టెస్టోస్టిరాన్ కీలక ప్రాత పోషిస్తుందంటున్నారు. అదే మహిళల విషయంలో మాత్రం ఇలా వెంట్రుకలు ఊడిపోకుండా ఈస్ట్రోజన్ హార్మోన్ నివారిస్తుందని, కనీసం మెనోపాజ్ వరకైనా ఈ పరిస్థితి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇవికూడా చూడండి

బయటి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=బట్టతల&oldid=943652" నుండి వెలికితీశారు