శ్రీలంక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 249:
 
=== కళా సంస్కృతి ===
[[File:Sri Lanka traditional drum.jpg|thumb|A Low Country drummer playing the traditional ''Yak Béra''.]]
1947లో చిత్రకళా మూవీటోన్ సంస్థ తరఫున " కడవువును పొరందువా " (ది బ్రోకెన్ ప్రామిస్) ఉత్సవాలతో శ్రీలంక చలనచిత్ర చరిత్ర ఆరంభం అయింది. రన్‌ముత్తు డువా ( ఐలాండ్ ఆఫ్ ట్రెషర్స్, 1962) చిత్రంతో శ్రీలంక చలన చిత్రాలు నలుపు-తెలుపు నుండి వర్ణచిత్రాల స్థాయికి ఎదిగాయి. ప్రస్థుత చలనచిత్రాలు కుటుంబ కథలు, సాంఘిక మార్పులు, తరువాత సన్యం-ఈళ పులుల మద్య దీర్ఘకాలం సాగిన యుద్ధం సంఘటనలు ఆధారం చేసుకుని నిర్మించబడుతున్నాయి. వీరి చలనచిత్రాలు బాలీవుడ్ శైలిని పోలి ఉంటాయి. 1979లో చలనచిత్ర పేక్షకుల సంఖ్య తారస్థాయికి చేరుకుంది. తరువాతి కాలంలో అది క్రమంగా తగ్గుముఖం పట్టింది. శ్రీలంక చరిత్రను ప్రభావితం చేసిన దర్శకుడు లెస్టర్ జేంస్ పెరిస్ అన్నది నిస్సందేహం. ఆయన అనర్జాతీయ గుర్తింపు పొందిన రెకవా (లైన్ ఆఫ్ డిస్టినీ,1956), గంపెరలియా ( ది చేంజింగ్ విలేజ్, 1964), నిధనయా ( ది ట్రెషర్, 1970) మరియు గొలు హదవత (కోల్డ్ హార్ట్ , 1968).
 
=== సంగీతం ===
శ్రీలంకలో ఆరంభకాల సంగీతం రంగస్థల ప్రదర్శనలైన కొలం, సొకారి మరియు నాటకాల ద్వారా మొదలైంది. తమ్మతమ, దౌల, మరియు రాబన్ మొదలైన సంప్రదాయ సంగీత పరికరాలు ఈ ప్రదర్శనలలో చోటు చేసుకున్నాయి. 1903లో సిలోన్ రేడియో శ్రీలంక మొదటి సంగీత ఆల్బం " నూర్తి " విడుదల చేయబడింది. మహాగమా శేఖర మరియు ఆనంద సమరకూన్ వంటి పాటల రచయితలు మరియు డబల్యూ.డి. అమరదేవా, హెచ్.ఆర్ జ్యోతిపాలా మరియు క్లారెంస్ విజెవర్ధనె వంటి సంగీతదర్శకులు శ్రీలంక సంగీతంలో చరిత్ర సృష్టించారు.దేశంలో ఇతర సంగీతకారులలో ఆఫ్రో సింహళీయుల ఆదరణ పొందిన బైల కు ప్రాముఖ్యత ఉంది.
"https://te.wikipedia.org/wiki/శ్రీలంక" నుండి వెలికితీశారు