శ్రీలంక: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 166:
=== నదులు ===
దేశంలో 103 నదులు ఉన్నాయి. మహావెలి నది వీటిలో అయి పొడవైనది. మహావెలి నది పొడవు 335 కిలోమీటర్లు (208 మైళ్ళు). ఈ నదీప్రవాహం 10 మీటర్లు అంతకంటే ఎత్తైన 51 సహజసిద్ధ జలపాతాల సృష్టికి మూలకారణంగా ఉంది. ఈ జలపాతాలలో అత్యంత ఎత్తైనది 263 మీటర్ల (863 అడుగుల) ఎత్తైన బంబరకాండ జలపాతం. శ్రీలంకా సముద్రతీరం మొత్తం పొడవు 1,585 కిలోమీటర్లు. 200 నాటికల్ కిలోమీటర్ల విశిష్ఠమైన వాణిజ్య జలభాగం శ్రీలంక ఆధీనంలో ఉంది. ఈ జలభాగం వైశాల్యం దేశవైశాల్యం కంటే 6.7 రెట్లు అధికంగా ఉండడం విశేషం. తీరప్రాంతాలు దానిని ఆనుకుని ఉన్న సముద్రజాలాలు పగడపు దీవులు, షాలో దిబ్బలు మరియు దట్టంగా ఉన్న సముద్రపు గడ్డి వంటి సమృద్ధమైన సముద్రపర్యావరణానికి దోహదంచేస్తుంది. శ్రీలంకలో 45 నదీముఖాలు, 40 నీటి మడుగులు ఉన్నాయి. వీటి వైశాల్యం 7,000 హెక్టార్లు. 2004 హిందూమహాసముద్రంలో సంభవించిన టీ సునామీ సమయంలో ఈ జలాశయాలు ప్రముఖపాత్ర వహించాయి. శ్రీలంక ఇల్మేనైట్, ఫెల్స్పార్, గ్రాఫైట్, సిలికా, చైన మట్టి, మైకా మరియు థోరియం వంటి ఖనిజ సంపన్నమై ఉంది. మన్నార్ గల్ఫ్ లో పెట్రోలియం ఉనికి కూడా నిర్ధారించబడడమే కాక వెలికితీత ప్రయత్నాలు జరుగుతున్నాయి.
== వృక్షజాలం మరియు జంతుజాలం ==
|